కెంపె గౌడ

కెంపె గౌడ బెంగళూరు నగర నిర్మాత. ఇతను శ్రీ కృష్ణదేవ రాయలు సామంతు. ఇతని పేరు మీదనే నేటికీ బెంగుళూరు బస్సు స్టేషను కెంపె గౌడ బస్సు నిలయము అని మరియు అంతర్జాతీయ విమానాశ్రయంను కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం అని పిలుస్తారు.

కెంపె గౌడ I
Chieftain of Yalahanka Nadu (a principality under Vijayanagara Empire)
జననంహిరియ కెంపె గౌడ
27 జూన్ 1510 AD
banglore
మరణం1569 AD
ఇతర పేర్లుBengalooru Kempe Gowda, Kempe Gowda
ప్రసిద్ధులుబెంగళూరు నగర నిర్మాత
ముందువారుకెంపె నంజె గౌడ
తరువాతి వారుగిడ్డే గౌడ

నేపధ్యము

1533-1569 లో విజయనగర రాజ్య సామంత రాజు కెంపె గౌడ.

వృషభ ఆలయం

దొడ్డ బసవన గుడి గా పిలవబడే వృషభ ఆలయం దక్షిణ బెంగళూరు – బసవనగుడి లోని ఎన్ ఆర్ కాలనీ లో వుంది. నందీశ్వరుడు ఇక్కడి ప్రధాన దైవం. హిందూ పురాణాల ప్రకారం నందీశ్వరుడు శివుడికి వాహనమే కాక పరమ భక్తుడు. నందీశ్వరుడి ఆలయాల్లోకల్లా అతి పెద్దదైన ఈ ఆలయాన్ని 1537 లో విజయనగర రాజ్య సామంత రాజు కెంపె గౌడ నిర్మించాడు. 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవూ వుండే ఇక్కడి నందీశ్వరుని విగ్రహాన్ని గ్రానైట్ ఒంటి రాతిలోంచి మలిచారు.ఈ ఆలయాన్ని ద్రావిడ శైలి లో నిర్మించారు – విశ్వభారతి నది ఈ విగ్రహం పాదాల నుంచే పుట్టిందని చెప్తారు. క్షేత్ర చరిత్ర ప్రకారం ఇప్పుడు గుడి వున్న ప్రదేశం దాకా వున్న వేరుసెనగ చేలన్నీ తినేస్తూ వచ్చిన ఓ పెద్ద వృషభాన్నిశాంతింప చేసేందుకు ఈ గుడి కట్టారు. ఈ గాధకు స్మారకం గా ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నెలల్లో గుడి దగ్గ కడలేకయి పరిషే (వేరుసెనగ పండుగ) నిర్వహిస్తారు – వేరుసెనగ పంట అప్పుడే చేతికి వస్తుంది కనుక. ఈ గుడిని దర్శించాలంటే ఇదే మంచి సమయం.వృషభ ఆలయం సమీపంలోనే దొడ్డ గణేష్ దేవాలయం వుంది. బసవనగుడి కనుక్కోవడం యాత్రికులకు కష్టమేమి కాదు. బెంగళూరు నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ బస్సు సర్వీసులు చాలానే వున్నాయి[1].

ఉల్సూర్ చెరువు

నగరానికి ఈశాన్యంలో ఎం జీ రోడ్డుకి దగ్గరలో ఉల్సూర్ చెరువు వుంది. బెంగళూరు ను స్థాపించిన కెంపె గౌడ దీన్ని నిర్మించాడు[2]. సుమారు ఒకటిన్నర చదరపు కిలోమీటర్ల వైశాల్యం తో వుండే ఈ చెరువు లో అక్కడక్కడా దీవులు వుంటాయి. శ్రావణ భాద్రపదాల్లో ఇక్కడ వినాయక చవితి ఘనంగా జరుపుకుంటారు. ఈత కోసం ఈత కొలను లాంటి అనేక వినోద కార్యక్రమాలకు ఒక ప్రత్యెక కాంప్లెక్స్ వుంది. ఉల్సూర్ చెరువుకి దగ్గరలో వున్న గురుద్వారా బెంగళూరు నగరం లోనే అతి పెద్దది.ఈ చెరువులో బోటు షికారు బాగా ప్రసిద్ది. ఇక్కడి బోటు క్లబ్బు చెరువులో తిరగడానికి, మధ్యలో వున్న దీవుల్లో ఆగడానికి బోట్లు సిద్ధం గా వుంచుతుంది. మూడు కాల్వల ద్వారా నీరు చేరే ఈ చెరువు ఒకటిన్నర చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వుంది. చెరువు పరిరక్షణ కోసం కఠిన నిబంధనలు చేశారు, పటిష్టమైన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.ఉల్సూర్ చెరువు నుంచి ఎం జీ రోడ్డు నడక దూరంలోనే వుంది. హలసూరు కి దగ్గరలో మెట్రో రైల్ కట్టే ప్రతిపాదన వుంది.

మూలాలు

బయటి లంకెలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.