కులు
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని 12 జిల్లాలలో కులు జిల్లా ఒకటి. జిల్లా దక్షిణ సరిహద్దులో రాంపూర్ (హిమాచల్ ప్రదేశ్), ఉత్తర సరిహద్దులో రోహ్తంగ్ పాస్ ఉన్నాయి.

| Kullu జిల్లా | |
|---|---|
| Himachal Pradesh జిల్లాలు | |
![]() Himachal Pradesh రాష్ట్రంలో Kullu యొక్క స్థానాన్ని సూచించే పటం | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | Himachal Pradesh |
| ముఖ్యపట్టణం | Kullu |
| తాలూకాలు | Kullu, Nirmand, Banjar, Manali |
| విస్తీర్ణం | |
| • మొత్తం | 5,503 |
| జనాభా (2001) | |
| • మొత్తం | 379 |
| • సాంద్రత | 69 |
| • Urban | 7.92 |
| జనగణాంకాలు | |
| • అక్షరాస్యత | 63.45% |
| • లింగ నిష్పత్తి | 105% |
| వెబ్‌సైటు | అధికారిక వెబ్‌సైటు |
జిల్లాలోని అతి పెద్ద లోయను కులు లోయ అంటారు. దీనిని " దేవతా లోయ " అని కూడా అంటారు. ఈ లోయ మద్య భాగంలో బియాస్ నదీతీరంలో కులు పట్టణం ఉంది. జిల్లాలోని మరొక లోయ పేరు లగ్ లోయ. ఇక్కడి నుండి ఒప్పందదారులు 150 సంవత్సరాల నుండి నిరంతరంగా కలపను తరలిస్తూనే ఉన్నారు.[1] ఉత్తరంగా అదనంగా మణలి (హిమాచల్ ప్రదేశ్) ఉంది. కులు పట్టణానికి 12 కి.మీ దూరంలో పురాతన కులు రాజ సంస్థానానికి చెందిన నగ్గర్ కోట ఉంది. 17వ శతాబ్దంలో " రాజా సిధ్ సింగ్ " ఈ కోటను నిర్మించి తన నివాసాన్ని కోటకు మార్చుకున్నాడని (1637-72) భావిస్తున్నారు. దీనిని దుల్తాన్‌పూర్ అని పిలిచారు. ఈ కోటలో " రూపి ప్యాలెస్, పలు ఆలయాలు మరియు పొడవైన అంగడి వీధి ఉన్నాయి.బ్రిటిష్ ప్రభుత్వం 1846లో కాంగ్రా (హిమాచల్ ప్రదేశ్) మరియు సిక్కుల నుండి కులు స్వాధీనపరచుకున్నారు. ఈ కోటలో ఇప్పటికీ రాజకుటింబీకులు నివసిస్తున్నప్పటికీ పురాతన నగ్గర్ కోటలో చాలాభాగం బ్రిటిష్ ప్రభుత్వానికి విక్రయించబడింది. కాశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న అశాంతి కారణంగా భారతదేశంలోని వేసవి తాపం నుండి తప్పించుకోవడానికి పర్యాటకులు ఇప్పుడు మణలి మరియు కులు లోయలను వేసవి విహారానికి ఎంచుకుంటున్నారు. జిల్లా తూర్పు భూభాగంలో ఉన్న మనికరన్‌లో సిక్కూ మరియు హిందూ ఆలయాలు మరియు ప్రబల ఉష్ణగుండాలు ఉన్నాయి. ప్రముఖ " హిడింబా దేవి ఆలయం " ఈ జిల్లాలోని మణలి వద్ద ఉంది. జిల్లాలో మనికరన్ సమీపంలో పలు సిక్కు గ్రామాలు ఉన్నాయి. కులు లోయ ఈశాన్యంలో ప్రముఖ మలానా లోయ ఉంది.
Disambiguation
2001 లో గణాంకాలు
| విషయాలు | వివరణలు |
|---|---|
| జిల్లా జనసంఖ్య | 437,474, [2] |
| ఇది దాదాపు | మాల్టా దేశ జనసంఖ్యకు సమానం [3] |
| అమెరికాలోని | నగర జనసంఖ్యకు సమం |
| 640 భారతదేశ జిల్లాలలో | 553వ స్థానంలో ఉంది.[2] |
| 1చ.కి.మీ జనసాంద్రత | 79 [2] |
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం | 14.65%.[2] |
| స్త్రీ పురుష నిష్పత్తి | 950:1000 |
| జాతియ సరాసరి (928) కంటే | అధికం |
| అక్షరాస్యత శాతం | 80.14%.[2] |
| జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
ప్రత్యేక విశేషాలు
చిత్రమాలిక
Sikh pilgrims cheering on truck to Manikaran
Manikaran, Kullu District, 2004
Shiva shrine, Kullu, 2004
Road workers crushing rocks, Kullu, 2004
Steam from Manikaran baths, 2004
2 friends - a Sikh & a Gaddi, Manikaran, 2004
Diners at Sikh Gurdwara, Manikaran, 2004
Roadside restaurant, Kullu, 2004
Raja Rupi Kulu Palace, 2004
ఇవి కూడా చూడండి
- లగ్ లోయ
- కులు లోయ
- మలానా, హిమాచల్ ప్రదేశ్
మూలాలు
- "History of Ropeways in Kullu". Archived from the original on 2001-05-22. Retrieved 2006-12-24.
- "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01.
Malta 408,333 July 2011 est.
line feed character in|quote=at position 6 (help)
అదనపు పఠనం
Chetwode, Penelope. 1972. Kulu: The End of the Habitable World. John Murray, London. Reprint: Time Books International, New Delhi. ISBN 81-85113-20-3
వెలుపలి లింకులు
- DISTRICT PROFILE
- CULTURAL & TOURISM HERITAGE OF THE DISTRICT
- Birds, Butterflies, Landscapes etc. of Kullu District
- Birds of Kullu District
- Butterflies of Kullu District
- Landscapes of Kullu District
| Wikimedia Commons has media related to కులు. |
