కురుక్షేత్రం (సినిమా)
1977 జనవరి నెలలో సంక్రాంతి కానుకగా విడదలైన చిత్రం కురుక్షేత్రం.
| తెలుగు సినిమా*వేదిక |
| కురుక్షేత్రం (1977 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | కమలాకర కామేశ్వరరావు |
| తారాగణం | కృష్ణ, విజయనిర్మల |
| సంగీతం | ఎస్.రాజేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ | మాధవీ పద్మాలయ కంబైన్స్ |
| భాష | తెలుగు |
వివాదం
ఈ చిత్రానికి పోటిగా దాన వీర శూర కర్ణ చిత్రంతో పోటీగా నిర్మితమైనదని ప్రతీతి.
చిత్ర సన్నివేశాలు
మహాభారత కథలోని సుభద్రాపరిణయం, రాజసూయం, మాయాజూదం, కౌరవపాండవ సంగ్రామం, పాండవ విజయం సన్నివేశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.
విశేషాలు
సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా రూపొందపడిందీ చిత్రం. కురక్షేత్ర సన్నివేశాల చిత్రీకరణ రాజస్ధాన్, అంబాలలో జరిపేరు. దానవీరశూర కర్ణ సినిమా నాటకీయత, సంభాషణలు, ముఖ్యంగా నందమూరి తారక రామారావు నటనా కౌశలం ముందు ఈ చిత్రం వెలవెలపోయిందని చెప్పక తప్పదు. తెలుగునాట అంతంత మాత్రంగా నడిచిన ఈ సినిమాను హిందీలో డబ్ చేస్తే ఉత్తరాదిన విజయ దుంధుబి మ్రోగించింది.
పాత్రలు - పాత్రధారులు
- శ్రీ కృష్ణుడు - శోభన్ బాబు
- అర్జునుడు - కృష్ణ
- కర్ణుడు - కృష్ణంరాజు
- ధర్మరాజు - బాలయ్య
- దుర్యోధనుడు - కైకాల సత్యనారాయణ
- శకుని - నాగభూషణం
- అభిమన్యుడు - చంద్రమోహన్
- శిశుపాలుడు - మోహన్ బాబు
- సుభద్ర - విజయనిర్మల
- ద్రౌపది - జమున
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
