కుకుర్బిటేసి

కుకుర్బిటేసి (ఆంగ్లం: Cucurbitaceae) కుటుంబంలో దాదాపు 110 ప్రజాతులు, 840 జాతులు ఉన్నాయి. ఈ మొక్కలు ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాలలో ఉన్నాయి.

కుకుర్బిటేసి
Hodgsonia male plant
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
విభాగం: మాగ్నోలియోఫైటా
తరగతి: మాగ్నోలియోప్సిడా
క్రమం: కుకుర్బిటేలిస్
కుటుంబం: కుకుర్బిటేసి
Juss.

కుటుంబ లక్షణాలు

  • నులితీగెలతో ఎగబ్రాకే మొక్కలు.
  • లఘు పత్రాలు, హస్తాకార జాలాకార ఈనెల వ్యాపనము.
  • పత్రగ్రీవంలో ఏర్పడే ఏకలింగపుష్పాలు.
  • అండకోశోపరిక, సౌష్టవయుత, పంచభాగయుత పుష్పాలు.
  • ఆకర్షణ పత్రాలు 5, సంయుక్తము.
  • కేసరాలు 5, సంయోజకము, పరాగకోశాలు మెలితిరిగి 'S' ఆకారంలో ఉంటాయి.
  • అండాశయము నిమ్నము, త్రిఫలదళయుతము, కుడ్య అండాన్యాసము.
  • పెపో ఫలము.

ముఖ్యమైన మొక్కలు

మూలాలు

  • బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.