కిసాన్ క్రెడిట్ కార్డు

బ్యాంకింగ్‌ వ్యవస్థ ద్వారా రైతులకు వారి స్వల్పకాలిక ఉత్పత్తులను సాధించడం కోసం అవసరమయ్యే పనిముట్లు తదితర అవసరాలకు కావాల్సిన సరైనమొత్తాలు, సరైనసమయాల్లో అందించడమే కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ ముఖ్యోద్దేశ్యం. దీనివల్ల రైతులకు ఖర్చుకు తగ్గట్టుగా రుణాలను చెల్లించే వెసులుబాటు కలుగుతుంది.

కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ పథకం వల్ల లాభాలేమిటి?

  • సరళీకృతమైన రుణాల పంపిణీ విధానం.
  • డబ్బూ గురించి రైతులు ఇబ్బంది పడనవసరం లేదు
  • ప్రతి పంటకీ రుణం కోసం అప్లై చేసుకోనక్కర్లేదు.
  • ఖచ్ఛితంగా రుణం దొరుకుతుంది కాబట్టి రైతుకు వడ్డి భారం తగ్గుతుంది.
  • విత్తనాలను, ఎరువులను తమకిష్టం వచ్చినపుడు, తాము ఎంచుకొన్నవాటిని కొనుక్కొనె వెసులుబాటు ఉంటుంది.
  • డబ్బిచ్చి కొనుక్కోవడంవల్ల వచ్చే డిస్కౌంట్‌లను డీలర్లనుంచి పొందవచ్చు.
  • 3ఏళ్లపాటు రుణ సౌకర్యం - ప్రతి సీజనుకీ ఎవరికీ చెప్పనక్కర్లేదు.
  • వ్యవసాయ ఆదాయాన్నిబట్టే గరిష్ఠ రుణ పరిమితి
  • గరిష్ఠ రుణ పరిమితికి లోబడి ఎన్ని సార్లైనా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.
  • పంటకోత అయ్యాకే రుణాన్ని తిరిగి చెల్లించే అవసరం.
  • వ్యవసాయ అడ్వాన్సుకు వర్తించే వడ్డీ రేటే దీనికీ వర్తిస్తుంది.
  • వ్యవసాయ అడ్వాన్సుకు వర్తించే సెక్యూరిటీ, డాక్యుమెంటేషన్‌ షరతులే దీనికీ వర్తిస్తాయి.

కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ పొందడం ఎలా?

  • సమీప పబ్లిక్‌ సెక్టర్‌ బ్యాంకు నుండి.
  • అర్హతగల ప్రతి రైతుకూ ఒక కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌, పాస్‌బుక్‌ ఇవ్వడం జరుగుతుంది. అందులో రైతు పేరూ, చిరునామా, భూమి వివరాలూ, గుణ గరిష్ఠ పరిమితి, కాలవ్యవధి, ఫోటో - అన్ని ఉండి ఒక ఐడెంటిటీ కార్డ్‌గానూ, లావాదేవీలకు రికార్డుగానూ పనికొస్తుంది.
  • రుణాన్ని పొందినవారు ఆ కార్డ్‌ను, పాస్‌బుక్‌ను రుణాన్ని పొందే సమయంలో చూపాలి.

వివిధ లీడింగ్‌ బ్యాంకులిచ్చే కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ల పేర్లు

  • అలహాబాద్‌ బ్యాంక్‌ కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్
  • ఆంధ్రా బ్యాంక్‌ - ఎ.బి. కిసాన్‌ గ్రీన్‌ కార్డ్
  • బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా - బి.కె.సి.సి.
  • బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కిసాన్‌ సమాధాన్‌ కార్డ్
  • కెనరా బ్యాంక్‌ కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్ - కె.సి.సి.
  • కార్పొరేషన్‌ బ్యాంక్‌ కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్ -కె.సి.సి.
  • దీనా బ్యాంక్‌ కిసాన్‌ గోల్డ్‌ క్రెడిట్‌ కార్డ్
  • ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ ఓరియంట్‌ గ్రీన్‌ కార్డ్
  • పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ క్రిష్‌ కార్డ్
  • స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ -కె.సి.సి.
  • స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా -కె.సి.సి.
  • సిండికేట్‌ బ్యాంక్‌ - యస్.కె.సి.సి.
  • విజయా బ్యాంక్‌ విజయా కిసాన్‌ కార్డ్
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.