కిల్లర్

కిల్లర్ 1991 లో ఫాజిల్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. నాగార్జున, నగ్మా, శారద ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై వి. బి. రాజేంద్రప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు.

కిల్లర్
దర్శకత్వంఫాజిల్
నిర్మాతవి. బి. రాజేంద్ర ప్రసాద్
రచనజంధ్యాల (మాటలు), ఫాజిల్ (కథ, స్క్రీన్ ప్లే)
నటులుఅక్కినేని నాగార్జున,
నగ్మా,
శారద,
సుత్తివేలు,
రఘువరన్
సంగీతంఇళయరాజా
ఛాయాగ్రహణంఆనంద కుట్టన్
కూర్పుటి. ఆర్. శేఖర్
నిర్మాణ సంస్థ
విడుదల
1991
భాషతెలుగు

కథ

కథానాయకుడు ఈశ్వర్ ఒక కాంట్రాక్టు కిల్లర్. భూపతి అనే వ్యక్తి తన కొడుకు బెనర్జీ ద్వారా ఈశ్వర్ ని పిలిపించి పదిహేను రోజుల్లోగా మాళవిక ఒక మహిళ, చిన్న పాపను చంపేలా ఐదు లక్షలకు కాంట్రాక్టు కుదుర్చుకుంటాడు. కానీ అతని మొదటి ప్రయత్నమే బెడిసి కొడుతుంది. దాంతో భూపతి అతను ఎంచుకున్న పని ఎంత కష్టమైనదో వివరించి కావాలంటే అడ్వాన్సు తిరిగిచ్చేసి తన ప్రయత్నం విరమించుకోమంటాడు. కానీ ఈశ్వర్ ఆ పని ఇంకా చాలెంజిగా తీసుకుంటాడు.

తారాగణం

2010 లో హైదరాబాదులో అక్కినేని నాగార్జున

పాటలు

ఇందులో పాటలన్నీ వేటూరి సుందర్రామ్మూర్తి రాశాడు. ఇళయరాజా సంగీతాన్నందించాడు.[1]

  • ప్రియా ప్రియతమా రాగాలు (గానం: మనో, చిత్ర)
  • ఉక్కిరి బిక్కిరి చక్కిలిగింతల కిల్లర్ (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర)
  • పిలిచే కుహూ కుహూ వయసే (గానం: ఎస్. జానకి)
  • సింధూర పూదోటలో (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం)
  • ఓరబ్బీ ఏం దెబ్బ (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి, కృష్ణ)
  • రంభలకి రంజుమొగుడుని (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం)

మూలాలు

  1. "యూట్యూబు లో కిల్లర్ సినిమా పాటల జూక్ బాక్స్". youtube.com. ఆదిత్య మ్యూజిక్. Retrieved 26 October 2017.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.