కార్తీక దీపం
ఇది 1979లో విడుదలైన తెలుగు చిత్రం. శివాజీ గణేశన్ హీరోగా నటించిన తమిళ చిత్రం ఆధారంగా కొద్దిమార్పులతో డా.ప్రభాకరరెడ్డి రచనగా తెలుగులో నిర్మింపబడింది. శోభన్ బాబు, శారద, శ్రీదేవిల చక్కని నటనతో, మంచిపాటలతో చిత్రం విజయవంతమయ్యింది.
| కార్తీక దీపం (1979 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | లక్ష్మీదీపక్ |
| తారాగణం | శోభన్‌బాబు, శ్రీదేవి, శారద |
| సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
| నిర్మాణ సంస్థ | కవిత ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
చిత్రకథ
శోభన్ బాబు శారదల అన్యోన్యదాపత్యంలో శ్రీదేవి ఆగమనం, శారద, శ్రీదేవిల పరిచయం, స్నేహం తర్వాత ఆపార్ధం, శ్రీదేవి, శోభన్ ల ఫ్లాష్ బాక్, శ్రీదేవి మరణం మొదలైనవి చిత్రాంశాలు.
నటవర్గం
- శోభన్ బాబు ... శ్రీధరరావు మరియు రాజా
- శారద ... లక్ష్మి
- శ్రీదేవి ... రాధ
- సూర్యకాంతం ... లక్ష్మి తల్లి
- రాజబాబు
- అల్లు రామలింగయ్య ఆమ్యామ్యా
- గిరిజ
- రమాప్రభ
- మాడా ... పూజారి
పాటలు
- ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం (రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి; గాయకులు: పి.సుశీల, ఎస్.జానకి)
- నీ కౌగిలిలో తలదాచి ఈ చేతులలో కనుమూసి జన్మజన్మలకు (గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి)
- చిలకమ్మ పిలిచింది (గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి)
- మువ్వలేమో నేడేమో (గాయని: ఎస్.జానకి)
- ఏ మాట (గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల)
- చూడ చక్కని దానా (గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల)
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
