కార్తికా నాయర్

కార్తికా నాయర్ (జననం 27 జూన్ 1992)[1] ప్రముఖ భారతీయ సినీ నటి. ఆమె ముఖ్యంగా దక్షిణ భారత సినిమాల్లో నటించింది. 2009లో అక్కినేని నాగచైతన్య  సరసన  తెలుగు సినిమా  జోష్ తో తెరంగేట్రం  చేసింది కార్తికా. జీవా  సరసన  ఆమె  నటించిన  రెండో  చిత్రం  రంగంతో  ఆమె  ప్రసిద్ధి  చెందింది.  ఈ సినిమా  అసలు  తమిళం లో తీసి, తెలుగులో డబ్బింగ్  చేశారు.

కార్తీకా నాయర్
జననం (1992-06-27) 1992 జూన్ 27
వృత్తినటి,మొడల్
క్రియాశీలక సంవత్సరాలు2009 – ప్రస్తుతం
తల్లిదండ్రులురాధ
బంధువులుతులసి_నాయర్ (సొదరి)

తొలినాళ్ళ జీవితం

కార్తీకా తల్లి ప్రముఖ నిన్నటి తరం నటి రాధ. ఆమె పెద్దమ్మ అంబిక కూడా ప్రముఖ దక్షిణ భారత నటే. కార్తికాకు ఒక తమ్ముడు, ఒక          చెల్లెలు. ఆమె చెల్లెలు తులసి నాయర్ కూడా సినిమాల్లో నటించింది.  కార్తికా ముంబైలోని పోడర్ అంతర్జాతీయ పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసింది.[2] లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అనుబంధ కళాశాలలో అంతర్జాతీయ బిజినెస్ డిగ్రీ చదువుకుంది కార్తికా. 

కెరీర్

2010లో నార్వేలో రంగం సినిమా షూటింగ్ లో కార్తికా.

2009లో తన 17వ ఏట తెలుగు సినిమా జోష్ తో తెరంగేట్రం  చేసింది. ఈ సినిమాలో ఆమె నాగచైతన్య సరసన  నటించింది. ఆమె రెండో సినిమా  రంగం.  తమిళంలో  తీసిన  ఈ  సినిమాను తెలుగులో డబ్బింగ్  చేయగా, రెండు భాషల్లోనూ విజయవంతం కావడం విశేషం.[3] ఆ తరువాత ఆమె  మలయాళంలో లెనిన్ రాజేంద్రన్ దర్శకత్వంలో మకరమంజు  సినిమాలో  నటించింది కార్తికా. ఆ తరువాత ఆమె భారతీరాజా దర్శకత్వంలో అన్నాకొడి సినిమాలో నటించింది. 

నటనా జీవితం

చలన చిత్రాలు
Key
ఇంకా విడుదలైన సినిమాలను సూచిస్తుంది
సంవత్సరంచలన చిత్రంపాత్రభాషగమనికలు
2009జోష్విద్యాతెలుగుఉత్తమ తొలి నటి సంతోషం అవార్డ్స్ ,ఉత్తమ తొలి నటి సినిమా(CineMAA) అవార్డ్స్
2011కో(రంగం)రేనుకా నారాయణన్తమిళం
మకతమంజుసుగందా బాయి, ఊర్వశిమలయాళం
2012దమ్మునీలవేణితెలుగు
2013కమ్మత్ & కమ్మత్సురేఖామలయాళం
అన్నకొడిఅన్నకొడితమిళం
బృందావనభూమికన్నడబృందావనం యొక్క పునఃనిర్మాణం
2014బ్రదర్ అఫ్ బొమ్మలి(సినిమా)లక్ష్మి/లక్కితెలుగు
2015పుఱంపోక్కుకుయిలితమిళం
వా డీల్ తమిళంఆలస్యంమైనది
బుల్లి తెర
సంవత్సరందారావాహికపాత్రభాషచానలుగమనికలు
2017ఆరంభ్దేవసేనహిందీస్టార్ ప్లస్తొలి ధారావాహిక

మూలాలు

  1. "Karthika celebrates 21st birthday – The Times of India". The Times Of India. 27 June 2013.
  2. "Karthika: T-town's new face – Times Of India". The Times of India. 2 September 2009. Retrieved 11 October 2011.
  3. Ko hits half century!, Times of India, 11 June 2011

ఇతర లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.