కాఠ్మండు
కాఠ్మండు నేపాల్ దేశ రాజధాని. 2015లో సంభవించిన భూకంపం లో ఈ నగరం సర్వనాశనమైనది.
| కాఠ్మండు మెట్రోపాలిటన్ నగరము काठमाण्डू महानगर, यें देय् | |
|---|---|
| మెట్రోపాలిటన్ నగరము | |
![]() పైనుండి సవ్య దిశలో: కాఠ్మండు చుట్టుపక్కల కనిపించే తోరణాలు మరియు దెగుతలేజు నేపధ్యములో కాఠ్మండు దర్బార్ స్క్వేర్, బుద్దనాధ స్థూపము, బాగ్‌మతి నది, బుద్దనీల్‌కంఠ, సింఘ దర్బార్, స్వయంభూనాధ్ ఆలయము రాత్రి వేళ, పశుపతినాథ్ దేవాలయం | |
| Motto: My legacy, my pride, my Kathmandu | |
![]() | |
![]() కాఠ్మండు మెట్రోపాలిటన్ నగరము | |
| భౌగోళికాంశాలు: 27°42′N 85°20′E | |
| దేశము | నేపాల్ |
| Development Region | Central |
| జోన్ | బాగ్‌మతి జోన్ |
| జిల్లా | కాఠ్మండు జిల్లా |
| పేదరిక సూచీ | |
| పేదరిక సూచీ | |
| అక్షరాస్యత శాతము | |
| Established | 900s BC[2] |
| ప్రభుత్వం | |
| • ముఖ్య కార్యనిర్వహణ అధికారి | పూర్ణ భక్త తందుకర్ |
| విస్తీర్ణం | |
| • మొత్తం | 49.45 |
| ఎత్తు | m ( ft) |
| జనాభా (2011) | |
| • మొత్తం | 1[3] |
| • సాంద్రత | 20,288.8 |
| భాషలు | |
| • Local | నేపాలీ భాష (లేదా నెవర్ భాష), నేపాలీ భాష, షెర్పా భాష, తమంగ్ భాష, గురుంగ్ భాష, మంగర్ భాష, సునువర్ భాష/కిరాంతీ భాష, టిబెటన్ భాష |
| • అధికారిక భాష | నేపాలీ భాష (లేదా నెవర్ భాష), నేపాలీ భాష, ఆంగ్లము |
| సమయప్రాంతం | నేపాల్ ప్రామాణిక కాలము (UTC+5:45) |
| పిన్‌కోడ్ | 44600 (GPO), 44601, 44602, 44604, 44605, 44606, 44608, 44609, 44610, 44611, 44613, 44614, 44615, 44616, 44617, 44618, 44619, 44620, 44621 |
| ఏరియా కోడ్ సంఖ్యలు | 01 |
| వెబ్‌సైటు | www |
పేరు వెనుక చరిత్ర

కాఠ్మండు నగరానికి ఆ పేరు కాష్ఠమండపము ఆలయం ద్వారా వచ్చింది. సంస్కృతములో కాష్ఠ (काष्ठ) అనగా కొయ్య మరియు మండప్ (/मण्डप) అనగా కప్పబడిన ప్రదేశము అని అర్థము. స్థానిక భాషలో దీనిని మారు సతాల్ అని కూడా పిలుస్తారు. దీనిని 1596వ సంవత్సరంలో రాజు లక్ష్మీ నరసింగ మల్ల నిర్మించాడు. రెండు అంతస్తులుగా నిర్మింపబడిన ఈ ఆలయంలో పూర్తిగా కొయ్య సామాగ్రినే వాడారు. ఇనుప మేకులు గానీ లేదా ఇతర సామాగ్రి కానీ వాడనేలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ దేవాలయానికి కావలసిన చెక్క సామాగ్రి అంతా ఒకే చెట్టు నుండి సేకరించడం జరిగింది[4].
చరిత్ర

ఇక్కడ జరిగిన తవ్వకాల ప్రకారం గతంలో ఇక్కడ నాగరికత వెలిసినట్లు ఆధారాలు లభించాయి. ఈ త్రవ్వకాలలో భాగంగా మలిగావ్లో క్రీస్తు శకం 185వ సంవత్సరానికి చెందిన ప్రతిమ లభించినది[5]. దండోచైత్య సొరంగంలో బ్రహ్మీ లిపిలో లిఖింపబడిన వాక్యాలున్న ఒక ఇటుక లభ్యమైనది. పురాతత్వ శాస్త్రవేత్తలు దీనిని 2000 సంవత్సరాలనాటిగా అంచనా వేస్తున్నారు[5].
భౌగోళిక ప్రాంతము

కాఠ్మండు నగర పరిధి
అధికారికంగా కాఠ్మండు నగర పరిధి నిర్థారించనప్పటికీ, ఈ నగర పరిధి మూడు జిల్లాలలో విస్తరించి ఉన్నది . ఈ మూడు జిల్లాలలోనే దేశ జనాభాలో అత్యధిక జనాభా కేంద్రీకృతమై ఉంది. ఆ వివరాలు ఈ క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.
| పరిపాలనా జిల్లా | విస్తీర్ణము (km²) | జనాభా (2001 జనాభా లెక్కలు) | జనాభా (2011 జనాభా లెక్కలు) | జన సాంద్రత (/km²) |
|---|---|---|---|---|
| కాఠ్మండు | 395 | 1,081,845 | 1,740,977 | 4408 |
| లలిత్‌పూర్ | 385 | 337,785 | 466,784 | 1212 |
| భక్తపూర్ | 119 | 225,461 | 303,027 | 2546 |
| కాఠ్మండు నగర పరిధి | 899 | 1,645,091 | 2,510,788 | 2793 |
వాతావరణము
నేపాల్ లో ముఖ్యంగా ఐదు రకాలైన వాతావరణ ప్రదేశాలు చూడవచ్చు. ఈ కేంద్రాలలో భాగంగా కాఠ్మాండు ఉష్ణ ప్రాంతములో ( సముద్ర మట్టానికి 1,200–2,300 మీటర్లు (3,900–7,500 ft) ) విస్తరించి ఉంది. ఈ నగరంలో ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటుంది.
దర్శనీయ ప్రదేశాలు
- కాఠ్మండు దర్బార్ స్క్వేర్
- బుద్దనాధ స్థూపము
- బాగ్‌మతి నది
- బుద్దనీల్‌కంఠ
- సింఘ దర్బార్
- స్వయంభూనాధ్ ఆలయము
- పశుపతినాథ్ దేవాలయం
చిత్రమాలిక
మూలాలు
- "An Overview of the Central Development Region (CR)" (PDF). Internal-displacement.org. Retrieved November 25, 2013.
- "History". Kathmandu.gov.np. Retrieved 16 May 2010.
- "National Population and Housing Census 2011" (PDF). National Planning Commission Secretariat, Central Bureau of Statistics (CBS), Government of Nepal. November 2012.
- "Introduction". Kathmandu Metropolitan City, Government of Nepal. Retrieved 2009-12-12.
- "सुस्त उत्खनन » पुरातत्व » सम्पदा :: नेपाल ::". Ekantipur.com. 2010-06-09. Retrieved 2012-01-15.






