కదంబ
కదంబ లేదా కదంబము (Cadamba) ఒక పెద్ద వృక్షం. దీని పుష్పాలు గుండ్రంగా బంతి వలె అందంగా ఉంటాయి. వీటిని లలితాదేవి పూజలో ప్రముఖంగా ఉపయోగిస్తారు.
| కదంబం | |
|---|---|
![]() | |
| పరిరక్షణ స్థితి | |
Least Concern | |
| శాస్త్రీయ వర్గీకరణ | |
| రాజ్యం: | ప్లాంటే |
| ఉప రాజ్యం: | Tracheobionta |
| విభాగం: | మాగ్నోలియోఫైటా |
| తరగతి: | మాగ్నోలియోప్సిడా |
| ఉప తరగతి: | Asteridae |
| క్రమం: | జెన్షియనేలిస్ |
| కుటుంబం: | రూబియేసి |
| జాతి: | నియోలామార్కియా |
| ప్రజాతి: | ని. కదంబ |
| ద్వినామీకరణం | |
| నియోలామార్కియా కదంబ (Roxb.) Bosser | |
| పర్యాయపదాలు | |
|
Nauclea cadamba Roxb. | |
లక్షణాలు
- ఒక పెద్ద వృక్షం.
- అండాకార సరళ పత్రాలు.
- గుండ్రటి సమపుష్టి శీర్షవద్విన్యాసంలో పసుపుతో కూడిన ఆకుపచ్చ రంగు పుష్పాలు.
- లేత పసుపు రంగు మృదు ఫలాలు.
ఉపయోగాలు
హైందవ సంస్కృతిలో కదంబం
కదంబోత్సవం జనాదరణ పొందిన రైతుల పండుగ. దీనిని భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు జరుపుకుంటారు. ఆ రోజున కదంబ వృక్షపు కొమ్మను ఇంటికి తెచ్చుకొని పూజిస్తారు. ఆనాటి సాయంత్రం ఈ పూల రెక్కల్ని బంధువులు, స్నేహితులకు పంచుకుంటారు. ఈ పండుగ తుళు ప్రజలు, ఓనం నాడు కేరళ ప్రజలు కొంత తేడాగా జరుపుకుంటారు.[1]
ఈ కదంబోత్సవం" ("The festival of cadamba") ప్రతి సంవత్సరం కేరళ్ ప్రభుత్వం కదంబ సామ్రాజ్యం (Kadamba kingdom) గౌరవార్ధం జతుపుతుంది. ఇది బనవాసి (Banavasi) పట్టణంలో జరుగుతుంది.[2]
కదంబ వృక్షం హిందూ దేవత కదంబరియమ్మన్ (Kadambariyamman) కు సంబంధించినది.[3][4] కదంబ వృక్షం నేటి మీనాక్షి అమ్మవారి ఆలయం (ఒకప్పటి కదంబ వనం) యొక్క స్థల వృక్షంగా పేర్కొంటారు.[5] A withered relic of the Kadamba tree is also preserved there.[6]
జ్యోతిష శాస్త్రంలో నక్షత్రాలు ఒక్కొక్క దానికి ఒక వృక్షాన్ని గుర్తించారు. అందువలన నక్షత్రవనం లో కదంబ వృక్షాన్ని శతభిష నక్షత్ర స్థానంలో పెంచుతారు.[7]
మూలాలు
- http://tulu-research.blogspot.com/2007_12_01_archive.html - TuLu Studies: December 2007
- Kadambotsava Staff Correspondent (2006-01-20). "Kadambotsava in Banavasi". The Hindu, Friday, January 20, 2006. Chennai, India: The Hindu. Retrieved 2006-11-28.
- http://www.hinduonnet.com/thehindu/mp/2007/06/02/stories/2007060250410100.htm -Natures Unsung heroes
- http://www.khandro.net/nature_trees.htm -Tree worship
- The Hindu : Metro Plus Madurai : Nature’s unsung heroes
- Tripura Sundari Ashtakam - Audarya Fellowship
- http://chennaionline.com/astro/articles/yourstar.asp Your star, your tree
