ఒడిషా

ఒడిషా లేదా ఒరిస్సా (Orissa) (ଓଡ଼ିଶା) భారతదేశం తూర్పు తీరాన ఉన్న రాష్ట్రం. దీని వైశాల్యం 60,162 చ.మైళ్ళు (1,55,820 చ.కి.మీ.). 2001 లెక్కల ప్రకారం జనాభా 3,67,06,920. November 4, 2011 న ఈ రాష్ట్రం యొక్క పేరును ఒడిషాగా మారుస్తూ భారత రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.

ఒరిస్సా(ఒడిషా)
Map of India with the location of ఒరిస్సా(ఒడిషా) highlighted.
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
భువనేశ్వర్
 - 20.15° ఉ 85.50° తూ
పెద్ద నగరము భువనేశ్వర్
జనాభా (2001)
 - జనసాంద్రత
36,706,920 (11వది)
 - 236/చ.కి.మీ
విస్తీర్ణము
 - జిల్లాలు
155,707 చ.కి.మీ (9వది)
 - 30
సమయ ప్రాంతం IST (UTC +5:30)
అవతరణ
 - గవర్నరు
 - ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
1949-01-01
 - రామేశ్వర్ ఠాకూర్
 - నవీన్ పట్నాయక్
 - ఒకే సభ (147)
అధికార బాష (లు) ఒరియా
పొడిపదం (ISO) IN-OR
వెబ్‌సైటు: www.orissa.gov.in

ఒడిషాకు ఉత్తరాన ఝార్ఖండ్ రాష్ట్రం, ఈశాన్యాన పశ్చిమ బెంగాల్, దక్షిణాన ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమాన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలున్నాయి. తూర్పున బంగాళాఖాతం సముద్రమున్నది.

కోణార్క, పూరి, భువనేశ్వర్లు ప్రసిద్ధి చెందిన మందిరాలు గల పట్టణాలు. ఒరియా ప్రధాన భాష. ఒరిస్సా పేరును ఒడిషా గా, ఒరియాను ఒడియాగా మార్చడానికి కేంద్రం ఆమోదించింది.

భౌగోళికం

ఒడిషా రాష్ట్రానికి పశ్చిమ, ఉత్తర భాగాలలో తూర్పు కనుమలు, ఛోటానాగపూర్ పీఠభూమి ఉన్నాయి. ఇది దట్టమైన అడవుల ప్రాంతం. లోపలి ప్రాంతాలు అరణ్యాలు, కొండల మయం. ఆదివాసులు, తెగలు ఇక్కడ నివసిస్తున్నారు. తూర్పు కనుమలకు, సముద్రానికి మధ్యభాగంలోని మైదాన ప్రాంతం సారవంతమైన వ్వవసాయభూమి. తీరప్రాంత మైదానాలు ప్రధాన జనావాసకేంద్రాలు. మహానది, బ్రాహ్మణి నది, బైతరణి నది డెల్టాలు కూడా ఇక్కడే ఉన్నాయి. తీర రేఖ తిన్నగా (చీలకుండా) ఉండడంవల్ల మంచి నౌకాశ్రయాలకు అవకాశంలేదు. ఒక్క పరదీప్ మాత్రం నౌకలకు అనుకూలమైనది. తీర ప్రాంతాలు, మహానది డెల్టా సారవంతమైన నేలలు. సక్రమంగా మంచి వర్షపాతం ఉండడంవల్ల ఏటా రెండు వరి పంటలు పండుతాయి.

బంగాళాఖాతంలో జనించే తుఫానుల తాకిడికి ఒరిస్సా తీరప్రాంతం తరచు నష్టపోతూ ఉంటుంది. 1999 అక్టోబరులో వచ్చిన తుఫాను వల్ల 10,000 మంది మరణించాఱు. తీవ్రమైన నష్టం వాటిల్లింది

చరిత్ర

ఉదయగిరి బౌద్ధ స్తూపం, ఒడిష

ఎక్కువ కాలం ఒడిషా కళింగరాజుల పాలనలో ఉండేది. క్రీ.పూ. 250 లో మగధ రాజు ఆశోకుడు తీవ్రమైన యుద్ధంలో కళింగరాజులను జయించాడుగాని, ఆ యుద్ధంలోని రక్తపాతానికి పశ్చాత్తాపం చెంది, శాంతి మార్గాన్ని అవలంబించాడు. తరువాత దాదాపు 100 సంవత్సరాలు ఈ ప్రాంతం మౌర్యుల పాలనలో ఉంది. కళింగరాజుల పతనానంతరం ఒరిస్సా ప్రాంతాన్ని వేరువేరు వంశాల రాజులు పాలించారు.

  • మురుంద వంశము
  • మరాఠ వంశము
  • నల వంశము
  • విగ్రహ, ముద్గల వంశము
  • శైలోద్భవ వంశము
  • భౌమకార వంశము
  • నందోద్భవ వంశము
  • సోమవంశి వంశము
  • తూర్పు గంగుల వంశము
  • సూర్య వంశి వంశము

ముస్లిం దండయాత్రల ప్రధానమార్గానికి ప్రక్కగా ఉన్నందువల్లా, కొద్ది దండయాత్రలకు బలమైన ప్రతిఘటన చేయగలగడం వల్లా ఈ ప్రాంతం చాలా కాలం మహమ్మదీయుల పాలనలోకి రాలేదు. కాని 1568లో ముఘల్ సామ్రాజ్యంలో కలుపబడింది.

ముఘల్ రాజుల పతనం తరువాత ఒడిషాలో కొంత భాగం బెంగాలు నవాబుల పాలనలోను, మరి కొంత భాగం మరాఠా లపాలనలోను ఉంది. 1936లో బీహారులో కొంతభాగం చేర్చి ఒడిషా ప్రాదేశిక విభాగం ఏర్పరచబడింది. 1948లో 24 రాజసంస్థానాల విలీనం వల్ల ఒడిషా వైశాల్యం, జనాభా దాదాపు రెట్టింపు అయ్యింది.

1950లో ఒడిషా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది.

సంస్కృతి

ఒడియా అధికారిక భాష. ఒడిషాలో సాంస్కృతిక వారసత్వం సుసంపన్నమైనది. భువనేశ్వర్ లో మందిరాలు, పూరీ రథయాత్ర, పిపిలి హస్తకళలు, కటక్ వెండినగిషీలు, పట చిత్రాలు, వివిధ ఆదిమవాసుల (కొండజాతుల) వారి కళలు, ఆచారాలు - ఇవన్నీ ఒడిషా సాంస్కృతిక ప్రతీకలు.

జన విస్తరణ

ఒడిషా జనాభాలో దాదాపు 24% వరకు ఆదిమవాసులు. ఇది చాలా రాష్ట్రాలకంటే ఎక్కువ. 87% జనాభా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఎక్కువ భూమి కొద్ది మంది అధినంలో ఉండడంవలనా, అభివృద్ధి కార్యక్రమాలు ఆదివాసి ప్రాంతాలకు విస్తరిచకపోవడం వలనా ఒరిస్సాలో పేదరికం బాగా ఎక్కువనే చెప్పవచ్చును.

24% వరకు ఉన్న ఆదివాసజనులలో 62 వివిధ తెగలున్నాయి. వీరి జీవనవిధానం వన్య సంపద కేంద్రంగా ఉంటుంది. రైల్వేలు, ఆనకట్టలు, ఖనిజాల త్రవ్వకం వంటి ఆధునిక కార్యక్రమాలు వీరి బ్రతుకుతెరువును దుర్భరంచేయడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.

16% వరకు ఉన్న దళితులు దేశమంతటా ఉన్న సామాజిక వివక్షతల్ల, ఆర్థిక అసమానతల వల్ల బాగా వెనుకబడి ఉన్నారు.

ఒడిషాలో శిశుమరణాలు 1000 కి 97. ఇది దేశంలో బాగా అధికం. 60% పైగాజనులకు సరైన సదుపాయాలు (నీరు, విద్యుత్తు, నివాసయోగ్యమైన ఇల్లు వంటివి) అందుబాటులోలేవు. వీటికి తోడు తుఫానులు, వరదలు, అనావృష్టి వంటి ప్రకృతివైపరీత్యాలు ఒడిషా అభివృద్ధికి ప్రధానమైన అడ్డంకులు.

పర్యాటక స్థలాలు

  • రాజధాని భువనేశ్వర్: మందిరాల నగరమని దీనికి పేరు. ఇక్కడ సుమారు 1000 మందిరాలున్నాయి.
  • పూరి: జగత్ప్రసిద్ధమైన జగన్నాధ మందిరం ఉంది. జగన్నాధ రధయాత్ర ఏటా ఒక ముఖ్యమైన ఉత్సవం. జగన్నాధుడు, బలభద్రుడు, సుభద్రలను ఊరేగించే ఈ ఉత్సవానికి లక్షలాది భక్తులు హాజరవుతారు.
  • కోణార్క సూర్య మందిరం - ఒరిస్సా శిల్పకళా నైపుణ్యానికి, నిర్మాణకౌశలానికి ఒక చక్కని తార్కాణం. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ మందిరంలోని శిల్పాలలో ఆనాటి సాంస్కృతిక జీవన విధానం ప్రతిబింబిస్తుంది.
Stone work at Konark
  • చిల్కా సరస్సు: మహానది ముఖద్వారానికి దక్షిణాన ఉన్న ఉప్పునీటి సరస్సు. ఎన్నో విధాల పక్షులకు ఆవాసం. రక్షితవనం. ఇక్కడ దాదాపు 150 జాతుల పక్షులు వలసకు వస్తుంటాయి.
  • చర్చికా మాత మందిరం: రేణుకా నది ఒడ్డున రుచికా పర్వతంపై, బంకి వద్ద, సుందర ప్రకృతి సౌందర్యానికి దీటుగా నిర్మింపబడ్డ మందిరం. కటక్ కు 52 కి.మీ., భువనేశ్వర్ కు 60 కి.మీ. దూరంలో ఉంది.
  • సునాదేయి మందిరం: మహానది ఒడ్డున ఉంది. వలస పక్షులకు ఆవాసం కూడాను. పిక్నిక్ లకు జనప్రియమైనది.

రాజకీయాలు

ఒడిషా రాష్ట్రపాలన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల పాలనా విధానాన్ని అనుసరించే ఉంటుంది (గవర్నరు, ముఖ్య మంత్రి, కాబినెట్, అసెంబ్లీ వగయిరా)

ఆర్ధిక పరిస్థితి

చారిత్రక జనాభా
జనగణనజనాభా
19511,46,46,100
19611,75,49,50019.8%
19712,19,44,62525.0%
19812,63,70,27020.2%
19913,16,59,74020.1%
20013,67,07,90015.9%
20114,19,47,35814.3%

ఒడిషా ఆర్థిక స్థితికి ముఖ్యమైన వనరులు:

కొన్ని గణాంకాలు:

  • అభివృద్ధి రేటు 4.3 % (భారతదేశం సగటు 6.7 %)
  • మొత్తం స్థూల ఉత్పత్తిలో వ్వసాయం పాలు 32% . మొత్తం జనాభాలో 62% వ్యసాయ పనులపై ఆధారపడి ఉన్నారు.
  • సుమారు 1,75,000 మంది దారిద్ర్యరేఖ దిగువన ఉన్నారు
  • అక్షరాస్యత 50% (భారతదేశం సగటు 66%)

కంప్యూటరు సంస్థలు

Mobile pos -https://www.epaisa.com

భారీ పరిశ్రమలు

వ్యవసాయం

  • ఆహార ధాన్యాలు

మత్స్య పరిశ్రమ

  • ఆక్వా కల్చర్
  • మంచినీటి చేపల పెంపకం
  • సముద్రంలో చేపలు పట్టడం

విద్య

ఒడిషాలో పలు విద్యాలయాలు, విశ్వ విద్యాలయాలు ఉన్నాయి

విశ్వ విద్యాలయాలు

మేనేజిమెంటు కాలేజీలు

ఇంజినీరింగు కాలేజీలు

మెడికల్ కాలేజీలు

  • Shri Ramachandra Bhanj Medical College, Cuttack.
  • Maharaja Krushna Chandra Gajapati Dev Medical College, Berhampur.
  • Veer Surendra Sai Medical College, Burla, Sambalpur.
  • Institute of Health Sciences, Bhubaneswar.

రీహాబిలిటేషన్ విద్య

  • Institute of Health Sciences, Bhubaneswar.
  • Training Centre for Teachers of the Visually Handicapped, Bhubaneswar
  • Chetna Institute for the Mentally Handicapped (Jewels International), Bhubaneswar
  • National Institute of Rehabilitation Training and Research, Olatpur
  • Training Centre for Teachers of the Deaf (A Joint Project of State Govt. & AYJNIHH, Bhubaneswar
  • Open Learning System, Bhubaneswar
  • Shanta Memorial Rehabilitation Centre, Bhubaneswar

ఆయుర్వేద కాలేజీలు

దర్మ కిరన్ ఆయుర్వేద కాలేజీ హీదారాబాద్

  • Anata Tripathy Ayurvedic College, Bolangir.
  • Berhampur Govt. Ayurvedic College, Berhampur.
  • Govt. Ayurvedic College, Puri.
  • Gopalbandhu Ayurveda Mahavidyalaya, Puri.
  • Government Ayurveda College, Balangir.
  • K.A.T.A. Ayurvedic College, Ganjam.
  • Nrusingh Nath Govt. Ayurvedic College, Paikmal, Sambalpur.
  • S.S.N.Ayurved College and Research Institute, Nursingnath.

హోమియోపతి కాలేజీలు

  • Govt. Homoeopathic Medical College, Berhampur.

జిల్లాలు

సంఖ్య రాష్ట్రము. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
1ORANఅంజుల్అంజుల్11393416347180
2ORBDభౌధ్భౌధ్373038428987
3ORBHభద్రక్భద్రక్13322492788478
4ORBLబలంగిర్బలంగిర్13357606552204
5ORBRబర్గర్బర్గర్13456015832231
6ORBWబలేశ్వర్బలేశ్వర్20230563706546
7ORCUకటక్కటక్23406863915598
8ORDEదియోగర్దియోగర్274095278199
9ORDHఢెంకనల్ఢెంకనల్10659834597232
10ORGNగంజంఛత్రపూర్31369378033391
11ORGPగజపతి జిల్లాపరలఖెముండి5184483056170
12ORJHఝార్సుగూడఝార్సుగూడ5090562202231
13ORJPజాజ్పూర్పనికోయ్‌లి16228682885563
14ORJSజగత్సింగ్పూర్జగత్సింగ్పూర్10565561759601
15ORKHఖొర్దాభువనేశ్వర్18744052888649
16ORKJకియోంఝర్కియోంఝర్15615218336187
17ORKLకలహందిభవానీపట్నం13343728197163
18ORKNకంధమల్ఫుల్‌బాని6479126004108
19ORKOకొరపుత్కొరపుత్11779548534138
20ORKPకేంద్రపరాకేంద్రపరా13018562546511
21ORMLమల్కనగిరిమల్కనగిరి480232611579
22ORMYమయూర్బనిబరిపద222178210412134
23ORNBనబరంగ్పుర్నబరంగ్పుర్10181715135198
24ORNUనౌపదనౌపద5305243408156
25ORNYనయాగర్నయాగర్8639343954218
26ORPUపూరి (ఒడిషా)పూరి (ఒడిషా)14986043055491
27ORRAరాయగడరాయగడ8230197585109
28ORSAసంబల్పుర్సంబల్పుర్9288896702139
29ORSOసోనెపూర్సోనెపూర్5406592284237
30ORSUసుందర్ఘర్సుందర్ఘర్18294129942184

ఇవికూడా చూడండి

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.