ఐరోపా సమాఖ్య
ఐరోపా సమాఖ్య (ఆంగ్లం:యూరోపియన్ యూనియన్) ఐరోపాలో ఉన్న 28 సభ్యదేశాల రాజకీయ మరియు ఆర్థిక సమాఖ్య. ప్రాంతీయ సమైక్యతకు కట్టుబడిన ఐరోపా సమాఖ్య 1993నాటి మాస్ట్రిచ్ ఒడంబడిక ఆధారంగా, అప్పటికే పనిచేస్తున్న ఐరోపా ఆర్థిక సముదాయము (ఆంగ్లం:యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ) పునాదిగా స్థాపించబడింది. 50 కోట్ల జనాభా పైబడి కలిగిన ఐరోపా సమాఖ్య, స్థూల ప్రపంచ ఉత్పత్తిలో 30% వాటా కలిగి ఉంది. ఐరోపా సమాఖ్యలోని పదహారు సభ్యదేశాలు యూరోను అధికారిక మారక ద్రవ్యంగా కలిగియున్నాయి - వీటిని సంయుక్తంగా యూరోజోన్ అని సంబోధిస్తారు.

2009లో యూరోజోన్

2009లో ఐరోపా సమాఖ్య
సభ్యదేశాలు
- ఆస్ట్రియా
- బెల్జియం
- బల్గేరియా
- సైప్రస్
- చెక్ రిపబ్లిక్
- డెన్మార్క్
- ఎస్టోనియా
- ఫిన్లాండ్
- ఫ్రాన్స్
- జర్మనీ
- హంగేరి
- ఐర్లాండ్
- ఇటలీ
- లాట్వియా
- లిథువేనియా
- లక్సెంబర్గ్
- మాల్టా
- నెదర్లాండ్స్
- పోలాండ్
- పోర్చుగల్
- రొమానియా
- స్లొవేకియా
- స్లొవేనియా
- స్పెయిన్
- స్వీడన్
- యునైటెడ్ కింగ్డమ్ -ఇటీవలి కాలంలో సమాఖ్య నుండి తప్పుకోవాలని బ్రిటను ప్రజలు రిఫరెండమ్ ద్వారా నిర్ణయించారు.
28.on 1 July 2013, Croatia is the newest member
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.