ఏటూరునాగారం మండలం
ఏటూరునాగారం మండలం, తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లాకు చెందిన మండలం.[1].
| ఏటూరునాగారం | |
| — మండలం — | |
![]() ములుగు జిల్లా జిల్లా పటములో ఏటూరునాగారం మండలం యొక్క స్థానము |
|
![]() ఏటూరునాగారం |
|
| అక్షాంశరేఖాంశాలు: 18.477004°N 80.328827°E | |
|---|---|
| రాష్ట్రం | తెలంగాణ |
| జిల్లా | ములుగు జిల్లా |
| మండల కేంద్రము | ఏటూరునాగారం |
| గ్రామాలు | 41 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 41,153 |
| - పురుషులు | 20,312 |
| - స్త్రీలు | 20,841 |
| అక్షరాస్యత (2011) | |
| - మొత్తం | 55.57% |
| - పురుషులు | 68.38% |
| - స్త్రీలు | 42.01% |
| పిన్ కోడ్ | {{{pincode}}} |
ఇది సమీప పట్టణమైన వరంగల్ నుండి 107 కి. మీ. దూరంలో ఉంది.
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 41,153 - పురుషులు 20,312- స్త్రీలు 20,841.
జిల్లా మార్పులు
వరంగల్ జిల్లా నుండి జయశంకర్ జిల్లాకు
లోగడ ఏటూరునాగారం గ్రామం/ మండలం వరంగల్ జిల్లాలో,ములుగు రెవిన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ఏటూరునాగారం మండలాన్ని (1+38) ముప్పైతొమ్మది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2].
జయశంకర్ జిల్లా నుండి ములుగు జిల్లాకు
2018 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం ములుగు జిల్లాను ఏర్పాటు చేసింది. మరో 8 మండలాలతో పాటు ఏటూరు నాగారం మండలాన్ని కూడా కొత్త జిల్లాలోకి చేర్చారు.[3]
ఏటూరునాగారం వన్యప్రాణి సంరక్షణా కేంద్రం
ఇక్కడ వన్యప్రాణి సంరక్షణా కేంద్రం ఉంది.
గ్రామ విశేషాలు
ఏటారునాగారం ఓ చిన్న పట్టణంగా పేర్కొనవచ్చు. లక్నవరం (జంపన్న) ఉపనది గోదావరిలో కలిసే ప్రదేశంలో ఉన్న ఈ ఊరు ప్రకృతి సోయగాల మధ్య అలరారుతూ ఉంటుంది. ఇక్కడ ఐటీడీఏ ఉంది. గిరిజన జనాభా ఎక్కువగా కలిగిన ఈ ప్రాంతానికి ఏటూరునాగారం ఓ ముఖ్య కేంద్రం. అనేక ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. మావోయిస్టులకు ఒకప్పుడు పెట్టని కోటగా ఉన్న ఈ ప్రాంతంలో అనేక విధ్వంసాలు కూడా జరిగాయి. ఏటూరునాగారం పోలీసుస్టేషన్ పేల్చివేత, తుపాకులగూడెం బస్సు పేల్చివేత వంటి దారుణ మారణహోమాలు కూడా ఉన్నాయి.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
గమనిక:నిర్జన గ్రామాలు 16 (పదహారు) పరిగణనలోకి తీసుకోలేదు.
మూలాలు
- తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- http://bhoopalapally.telangana.gov.in/wp-content/uploads/2016/10/233.Jayashankar-.233.pdf
- "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 Feb 2019. Retrieved 17 Feb 2019.

