ఏకవింశతి పత్రపూజ

ఏకవింశతి పత్రపూజ అనేది ఏకవింశతి అనగా 21 విధముల పత్రములతో చేయు పూజ. వినాయక వ్రతకల్పము లో ఈ పూజ ప్రధానమైనది. ఈ పత్రాలన్నింటిలో అనేక ఔషధగుణాలు కలిగివుంటాయి. ఆయా కాలాలలో వచ్చే రోగాలను కాలానుగుణంగా నయం చేయడం ఈ పత్రాల ప్రత్యేకత. గణనాథుని పూజించే నెపంతో మన పూర్వికులు 21 రకాల పత్రాలలోని ఔషధ గుణాలను మనకు సూచించారు.

ఏకవింశతి పత్రములు

  1. మాచి పత్రము
  2. బృహతి పత్రము
  3. బిల్వపత్రము
  4. దూర్వ పత్రము
  5. దత్తూర పత్రము
  6. బదరి పత్రము
  7. ఆపామార్గ పత్రము
  8. తులసి పత్రము
  9. చూత పత్రము
  10. కరవీర పత్రము
  11. విష్ణుక్రాంత పత్రము
  12. దాడిమ పత్రము
  13. దేవదారు పత్రము
  14. మరుతక పత్రము
  15. సింధువార పత్రము
  16. జాజి పత్రము
  17. గలడలి పత్రము
  18. శమి పత్రము
  19. అస్వత్థ పత్రము
  20. అర్జున పత్రము
  21. అర్క పత్రములు.

వినాయకుని ఏకవింశతి పత్రపూజ

  1. సుముఖాయనమః - మాచీపత్రం పూజయామి।
  2. గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి।
  3. ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి।
  4. గజాననాయ నమః - దుర్వాయుగ్మం పూజయామి
  5. హరసూనవేనమః - దత్తూరపత్రం పూజయామి।
  6. లంబోదరాయనమః - బదరీపత్రం పూజయామి।
  7. గుహాగ్రజాయనమః - అపామార్గపత్రం పూజయామి।
  8. గజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి,
  9. ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి,
  10. వికటాయ నమః - కరవీరపత్రం పూజయామి।
  11. భిన్నదంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం పూజయామి,
  12. వటవేనమః - దాడిమీపత్రం పూజయామి,
  13. సర్వేశ్వరాయనమః - దేవదారుపత్రం పూజయామి,
  14. ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి,
  15. హేరంబాయనమః - సింధువారపత్రం పూజయామి
  16. శూర్పకర్ణాయనమః - జాజీపత్రం పూజయామి,
  17. సురాగ్రజాయనమః - గండకీపత్రం పూజయామి,
  18. ఇభవక్త్రాయనమః - శమీపత్రం పూజయామి,
  19. వినాయకాయ నమః - అశ్వత్థపత్రం పూజయామి,
  20. సురసేవితాయ నమః - అర్జునపత్రం పూజయామి।
  21. కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి।
  • శ్రీ గణేశ్వరాయనమః - ఏకవింశతి పత్రాణి పూజయామి.

పత్రాల విశేషాలు

  1. మాచీపత్రం : దీన్ని దవనం అని కూడా అంటారు. ఇది కుష్ఠు సంబంధ వ్యాధులను, బొల్లివంటి చర్మవ్యాధులను, నరాల సంబంధవ్యాధులను తగ్గిస్తుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. ఈ పత్రాలున్న పరిసరాల్లో ఎటువంటి సూక్ష్మక్రిములు దరిచేరవు.
  2. బృహతీపత్రం : దీని వాకుడాకు అంటారు. ఇది ఆయాసాన్ని, దగ్గును, మలబద్దకము, అతివిరేచనాలను తగ్గిస్తుంది. బాలింతలకు ఈచెట్టు ఒక వరం. ఇది అనేక దివ్యౌషధాల తయారీకి ఉపయోగపడుతుంది.
  3. బిల్వపత్రం : దీన్ని మారేడు అంటారు. ఇది నీటిని శుద్ధి చేస్తుంది. కీళ్ల సంబంధవ్యాధులను, విరేచనాలను తగ్గిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను వృద్ధిచేస్తుంది. శరీర దుర్వాసనను తగ్గిస్తుంది. అనేక ఔషధాల తయారీలో ఉపయోగపడుతుంది. సూక్ష్మక్రిమి సంహారిణిగా బాగా ఉపయోగపడుతుంది.
  4. దూర్వారయుగ్మం : దీన్ని గరిక అంటారు. ఇది దేహంలో రక్తాన్ని శుద్ధిచేస్తుంది. అధికరక్తస్రావాన్ని, రక్తహీనతను తగ్గిస్తుంది. శరీరంలోని హానికర సూక్ష్మక్రిములను నశింపజేస్తుంది. అజీర్ణవ్యాధిని, అధిక ఆమ్లస్రావాన్ని తగ్గిస్తుంది. సకలచర్మరోగాలను, సోరియాసిస్ లాంటి వ్యాధులను తగ్గిస్తుంది. దుస్స్వప్నాలను నివారిస్తుంది.
  5. దత్తుర పత్రం (ఉమ్మేత):- ఊపిరితితులను వ్యకోచిమ్పచేసి ఉబ్బసం తగ్గేలా చేస్తుంది.
  6. బదరి పత్రం (రేగు ఆకు):- చర్మ వ్యాధులకు మంచి విరుగుడు.
  7. తుర్యా పత్రం(తులసి):-శరీరంలో ఉష్ణాన్ని నియమ్త్రిస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి. ఆ గాలికి జలుబు,దగ్గు వంటివి దరి చేరవు.
  8. అపామార్గ పత్రం(ఉత్తరేణి): -దగ్గు ,ఉబ్బసంకి బాగా పని చేస్తుంది.
  9. చూత పత్రం(మామిడి ఆకు):-నోటి దుర్వాసన,చిగుళ్ళ వాపు వంటి సమస్యల నుంచి ఉపసమనం ఇస్తుంది.
  10. జాజి పత్రం(జాజి ఆకు):- చర్మ రోగాలు,స్త్రీ సంభంద వ్యాధులకు మంచిది.
  11. గండకి పత్రం(అడవి మొల్ల యుధిక):- అతిమూత్ర సమస్యనుంచి ఉపసమనం ఇస్తుంది.
  12. అశ్వత పత్రం(రావి ఆకు):-చాల ఓషధగుణాలు ఉన్నాయి.
  13. అర్జున పత్రం(మద్ది ఆకు):-రక్త స్తంభనం,గుండె ఆరోగ్యానికి ఇది చాల సహాయకారి.
  14. అర్క పత్రం(జిల్లేడు ఆకు) :-నరాల బలహీనత ఉన్నవరికిది దివ్య ఒషధం.చర్మ వ్యాధులను నివారిస్తుంది.
  15. విష్ణు క్రాంతం(పొద్దు తిరుగుడు ఆకు):-దీనిపై జరిగిన ఎన్నో పరిశోధనలు చెబుతున్న దేమిటంటే ఇది మంచి స్కిన్ కేర్ మందుగా పనిచేస్తుంది.
  16. దాడిమ పత్రం(దానిమ్మ ఆకు):- వాంతులు,విరేచనాలు,అరికడుతుంది.శరీరంలో ఉన్నా హానికారక క్రిములను నాశనం చేస్తుంది.
  17. దేవదారు(దేవదారు ఆకు):-శరీర వేడిని తగ్గిస్తుంది.
  18. మరువాకం(మరువం ఆకు):-మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
  19. సింధువార పత్రం(వావిలాకు):-కీల్లనోప్పులకు మంచి మందు.
  20. శమీ పత్రం(జామ్మీ చెట్టు):-నోటి వ్యాధులను తగ్గిస్తుంది.
  21. కరవీర పత్రం(గన్నేరు ఆకు):-గడ్డలు, పుండ్లు తగ్గటానికి దీని వేరు,బెరడు వాడతారు

ఇవి కూడా చూడండి

మూలాలు

    ఇతర లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.