ఎ. మోహన గాంధీ
అన్నె మోహనగాంధీ ఒక ప్రముఖ తెలుగు దర్శకుడు. ఇతడు పలు తెలుగు, కన్నడ మరియు తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
| అన్నె మోహనగాంధీ | |
|---|---|
![]() | |
| జననం | అన్నె మోహనగాంధీ 1947 జూలై 7 విజయవాడ, ఆంధ్రప్రదేశ్ |
| నివాసం | హైదరాబాదు, తెలంగాణ |
| ఇతర పేర్లు | ఎ. మోహన గాంధీ |
| చదువు | బిఎస్సీ |
| వృత్తి | దర్శకుడు |
| క్రియాశీలక సంవత్సరాలు | 1967–ఇప్పటివరకు |
నేపధ్యము
1947 లో విజయవాడలో జన్మించాడు. అక్కడే యస్.ఆర్.ఆర్;సి.వి.ఆర్ కళాశాలలో బిఎస్సీ చదివాడు. తదుపరి ఉన్నత చదువుల కోసం మణిపాల్లో ఇంజనీరింగ్ విద్యలో చేరాడు. ఆరోగ్యం సహకరించకపోవడంతో నాలుగు నెలలు తిరక్కుండానే దానిని మానివేసి తిరిగి విజయవాడ వచ్చేశాడు.మణిపాల్ వెళ్ళినప్పుడల్లా ఇతని కజిన్ వెంకటరత్నం ఇతని వెంట తోడుగా వచ్చేవాడు. ప్రయాణం మధ్యలో మద్రాసులో ఉదయం నుండి సాయంకాలం దాకా ఉండవలసి వచ్చేది. అప్పుడే ఇతని కజిన్ దూరపుబంధువు అయిన శోభన్ బాబు గారిని కలవడానికి వెళ్ళేవారు. అప్పటికి శోభన్ బాబు తెలుగు చిత్రసీమలో ఇంకా నిలదొక్కుకోలేదు. అతడు వీరి యోగక్షేమాలు కనుక్కొనేవాడు. 1968లో, చదువు మానేసి విజయవాడ వచ్చేశాడు. కోలుకోవడానికి నాలుగైదు నెలలు పట్టింది. స్టేజీ నాటకాలు వేసిన అనుభవం ఉండటంతో సినిమాల పట్ల తన ఆసక్తిని వెంకటరత్నానికి చెప్పాడు. అతడు వెంటనే మోహన గాంధీని హీరో శోభన్ బాబు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. కానీ శోభన్ బాబు ఇతడికి సినిమాల పట్ల గల ఆసక్తిని గమనించి మరోసారి ఆలోచించుకోమన్నారు. మొదట ఎడిటింగ్ పట్ల తనకు ఆసక్తి ఉన్నదని శోభన్ తో చెప్పడంతో, ఎడిటింగ్ అంటే ఒక్క అంశానికే పరిమితమై పోతావు... దర్శకత్వ శాఖలో ప్రయత్నించు అని ఆయన సలహా ఇచ్చాడు. తనకి చిత్రసీమలో ఎవరూ తెలియదని, శోభన్ బాబే తనను రికమెండ్ చేయాలని గాంధీ అభ్యర్థించాడు. హీరో శోభన్ బాబు ద్వారా తెలుగు చలన చిత్ర సీమలో 1967లో ప్రవేశించాడు.
సినీ జీవితము
నాటకాల రాయుడు, పసిడి మనసులు, విచిత్ర దాంపత్యం, మానవుడు దానవుడు, దేవుడు చేసిన పెళ్ళి, అల్లుడొచ్చాడు, అత్తవారిల్లు, కమలమ్మ కమతం, జీవన్ ధారా, మై ఇంతకామ్ లూంగా మొదలైన చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసారు. అక్కినేని సంజీవి, పి.సుబ్రహమణ్యం, పి.సి.రెడ్డి, ప్రత్యగాత్మ, టి.రామారావు, వి.బి.రాజేంద్రప్రసాద్ మొదలైన వారి వద్ద దర్శకత్వ శాఖలో మెళకువలు గ్రహించి 1977లో తొలిసారి నిర్మాత శ్రీ ఎ.వి.సుబ్బారావు నిర్మించిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి అర్ధాంగి చిత్రానికి దర్శకత్వం వహించాడు[1].
దర్శకత్వం వహించిన చిత్రాలు
తెలుగు
- అర్ధాంగి
- రౌడీ
- టెర్రర్
- భలే మిత్రులు
- మంచి మనసులు
- ఆడపడుచు
- పూజకు పనికిరాని పువ్వు
- ప్రేమ సామ్రాట్
- ముద్దుల మనవడు
- న్యాయానికి సంకెళ్ళు
- చినబాబు
- వారసుడొచ్చాడు
- మౌనపోరాటం
- జడ్జిమెంట్
- కర్తవ్యం
- ఆడది
- పీపుల్స్ ఎన్ కౌంటర్
- ఆశయం
- జగన్నాటకం
- ప్రాణదాత
- పోలీస్ బ్రదర్స్
- రౌడీ మొగుడు
- మొగుడు గారు
- మా ఆయన బంగారం
- సంభవం
- వైభవం
- కలవారి చెల్లెలు కనక మహాలక్ష్మి
- పరశురాం
- ప్రేమ దొంగ
- శంఖారావం
కన్నడం
- సర్కిల్ ఇనస్పెక్టర్
- చాముండి
మూలాలు
- అన్నే, మోహన్ గాంధీ. "మొదటి సినిమా-అన్నే మోహన్ గాంధీ" (PDF). కౌముది.నెట్. Retrieved 1 September 2015.
