ఎస్. వి. కృష్ణారెడ్డి

ఎస్వీ కృష్ణారెడ్డి గా పిలువబడే సత్తి వెంకటకృష్ణా రెడ్డి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు, రచయిత, సంగీతదర్శకుడు, మరియు నటుడు.[1] దర్శకత్వంతో బాటు కథారచన, సంగీత దర్శకత్వం, మరియు విభిన్న కళలలో ప్రవేశం ఉన్న వ్యక్తి. కె. అచ్చిరెడ్డితో కలిసి ఇతను రూపొందించిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి.

ఎస్.వి.కృష్ణారెడ్డి
జననంసత్తి వెంకట కృష్ణారెడ్డి
(1964-06-01) 1964 జూన్ 1
కొంకుదురు, తూర్పు గోదావరి జిల్లా. ఆంధ్రప్రదేశ్
వృత్తిదర్శకుడు, నటుడు, సంగీతదర్శకుడు, కథారచయిత, నిర్మాత, గాయకుడు
క్రియాశీలక సంవత్సరాలు1991 -

బాల్యం, విద్యాభ్యాసం

ఎస్. వి. కృష్ణారెడ్డి సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా, ఆరవల్లి గ్రామం. అక్కడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. నిర్మాత కె. అచ్చిరెడ్డి ఇతనికి మంచి స్నేహితుడు.[2] కృష్ణారెడ్డికి మొదటి నుంచి సినిమాల మీద ఆసక్తి. డిగ్రీ పూర్తి కాగానే సినిమా నటుడిగా అవకాశాల కోసం మద్రాసు వెళ్ళాడు.

వృత్తి

మద్రాసు వెళ్ళిన వెంటనే అవకాశాలు ఆయన్ను వెతుక్కుంటూ రాలేదు. ప్రయత్నంతో పగడాల పడవ అనే సినిమాలో ఓ పాత్ర దక్కింది. కానీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఈయన చేసే ప్రయత్నాలన్నీ స్నేహితుడు అచ్చిరెడ్డికి తెలియజేస్తూ ఉండేవాడు. కృష్ణారెడ్డి మీద అపారమైన నమ్మకం కలిగిన ఆయన అతన్ని నటుడ్ని చేయాలంటే తానే నిర్మాత అవతారం ఎత్తాలనుకున్నాడు.

సినిమాలు

మూలాలు

  1. IVS. "Director S V Krishna Reddy Birthday Today". businessoftollywood.com. Business of Tollywood. Retrieved 18 October 2016.
  2. "స్నేహమే మా బంధాన్ని నిలబెట్టింది". sakshi.com. సాక్షి. Retrieved 22 November 2017.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.