ఉరైయూరు


ఉరయూరు, ఉఱైయూరు లేదా ఉరైయూరు (ఆంగ్లం:Urayur or Uraiyur; తమిళం: உறையூர்) (ప్రస్తుతం తిరుచ్చినాపల్లిలో భాగం) మొదటి ఉండి 8వ శతాబ్దం వరకు పూర్వ చోళుల (early Cholas) రాజధాని. ఉరయూర్ ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో తిరుచ్చినాపల్లి పట్టణానికి దగ్గరలో ఉంది.

ఉరైయూరు
ఉరైయూరు
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :10.49°N 78.41°E / 10.49; 78.41
ప్రదేశము
దేశము:India
రాష్ట్రం:తమిళనాడు
జిల్లా:తిరుచ్చిరాపల్లి
ప్రదేశము:ఉరైయూర్
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:అళగియ మణవాళ పెరుమాల్
ప్రధాన దేవత:నాచ్చియార్
దిశ మరియు స్థానం:ఉత్తరముఖము
పుష్కరిణి:కళ్యాణ పుష్కరిణి
విమానం:కళ్యాణ విమానము
కవులు:తిరుమంగై యాళ్వార్
ప్రత్యక్షం:ధర్మవర్మ, రవివర్మ
నిర్మాణ శైలి మరియు సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :ద్రవిడ శిల్పకళ

ఉరయూర్ అనే పదానికి తమిళంలో నివాసం అని అర్ధం. ఇక్కడ ప్రాచీనమైన కోట కావేరీ నది దక్షిణ తీరంలో ఉంది. తరువాత పాలించిన Imperial చోళులు 9వ శతాబ్దం నుండి తంజావూరును రాజధానిగా చేసుకున్నారు.

ఇక్కడ ప్రముఖ దేవాలయాలలో నాచ్చియార్ దేవాలయం వైష్ణవ దివ్యదేశాలుగా భారతదేశంలో ప్రసిద్ధిచెందినది. ధర్మవర్మ పుత్రికగా లక్ష్మీదేవి అవతరించి వాసలక్ష్మి అనే పేరుతో శ్రీ రంగనాథుని పరిణయమాడిన స్థలమిది. శ్రీరంగములో జరుగు ఆది బ్రహ్మోత్సవమున మూడవనాడు శ్రీ రంగనాథుడు ఉరైయూరు వేంచేసి వాసలక్ష్మితో ఏకాసనాసీనులై భక్తకోటిని అనుగ్రహిస్తారు.

విశేషాలు:

ధర్మవర్మ పుత్రికగా లక్ష్మీదేవి అవతరించిన వాసలక్ష్మి అను పేరుతో శ్రీరంగనాధుని పరిణయమాడిన స్థలము. మీన మాసములో శ్రీరంగములో జరుగు ఆది బ్రహ్మోత్సవమున మూడవనాడు శ్రీరంగనాథులు ఉరైయూరు వేంచేసి వాసలక్ష్మితో ఏకాసనాసీనులై భక్తకోటికి అనుగ్రహింతురు. వీరు మేష మాసమున ఉత్తరా నక్షత్రమున అవతరించిరి. ఇచట స్వామి ప్రయాగ చక్రముతో వేంచేసి యుందురు. తిరుప్పాణి ఆళ్వార్లు ఈ క్షేత్రముననే అవతరించిరి. ఈ క్షేత్రమునకు "కోళి" యని "నాచ్చియార్ కోయిల్" అని తిరునామములు గలవు. ఇది తిరుచ్చిలో ఒక భాగము. తిరుచ్చి నుండి 2 కి.మీ. టౌన్ బస్ కలదు.

సాహిత్యంలో ఉరైయూర్

శ్లోకము:
లక్ష్మీ చరణ ళాక్షాంక సాక్షి శ్రీవత్స వక్షసే
క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళమ్‌ |

శ్లోకము:
శుభే కల్యాణ్యాఖ్యాప్రథిత వర తీర్థేషు నిచుళా
పురే పారే రమ్యే శుభ కుడమురుట్ట్యాఖ్య సరితః
విమానే కల్యాణే ధనపతి దిశావక్త్ర రుచిరః
స్థితో భాతి శ్రీమాన్ వరవర సమాఖ్యో మధురపుః

శ్లోకము:
త్రయస్త్రింశత్కోటిదేవ రవిధర్మాది గోచరః
కలిధ్వంసి ముని స్తుత్యో వాసలక్ష్మీ సమంవితః

పాశురము :
కోళయం కూడలుమ్‌ కోయిల్ కొణ్డ కోవలరే యొప్పర్; కున్ఱమన్న
పాళయమ్‌ తోళుమోర్ నాన్గుడైయర్ పణ్డివర్‌తమ్మైయుం కణ్డఱియోమ్;
వాళయరో వివర్‌వణ్ణ మెణ్ణిల్ మా కాడల్ పోన్ఱుళర్; కైయిల్ వెయ్య
ఆళయొన్ఱేన్దియోర్ శజ్గు పత్తియచ్చో వొరువ గియవా. తిరుమంగై ఆళ్వార్ - పెరియతిరుమొల్ 9-2-5.

వివరణ:

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
అళగియ మణవాళన్ వాసలక్ష్మి (ఉరైయూర్‌వల్లి నాచ్చియార్) కల్యాణ పుష్కరిణి, కుడమురుట్టి నది ఉత్తర ముఖము నిలచున్న మూర్తి తిరుమంగై యాళ్వార్ కల్యాణ విమానము ముప్పది మూడు కోట్ల దేవతలకు ధర్మవర్మకు, రవివర్మకు

చిత్రమాలిక

ఇవికూడా చూడండి

మూలాలు

    • Nilakanta Sastri, K.A. (1935) . The CōĻas, University of Madras, Madras (Reprinted 1984) .

    బయటి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.