ఉప రాష్ట్రపతి
ఉప రాష్ట్రపతి భారత ప్రభుత్వంలో రెండో అత్యున్నత స్థానం. భారత రాజ్యాంగంలోని 63 వ అధికరణంలో ఉప రాష్ట్రపతి పదవి గురించిన ప్రస్తావన ఉంది. ఈ పదవికి సంబంధించి భారత్ కు ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోని మరే పెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోను లేని అంశం ఇది. పెద్ద ప్రజాస్వామ్యాలలో, అమెరికాలో మాత్రమే ఈ పదవి ఉంది. అయితే భారత్, అమెరికాలలో ప్రజాస్వామ్య విధానాలు వేరు (భారత్‌లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యము, అమెరికాలో అధ్యక ప్రజాస్వామ్య పద్ధతి ఉన్నాయి) కనుక, ఉప రాష్ట్రపతి విధులకు, అమెరికా ఉపాధ్యక్షుడి విధులకు చాలా తేడా ఉంది.
| భారతదేశం |
![]() ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం. |
|
|
|
|
కార్య నిర్వాహక వ్యవస్థ |
|
శాసన వ్యవస్థ |
|
న్యాయ వ్యవస్థ
|
| g |
|
|
|
ఇతర దేశాలు |
అర్హతలు
ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నిక కావడానికి కింది అర్హతలు ఉండాలి.
- భారత పౌరుడై ఉండాలి.
- 35 సంవత్సరాలు లేదా ఆ పైబడి వయసు ఉండాలి.
- రాజ్యసభ సభ్యుడయేందుకు అవసరమైన అర్హతలు కలిగి ఉండాలి.
- అభ్యర్థి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో లేదా వటి నియంత్రణ కలిగిన సంస్థలలో ఆదాయం వచ్చే పదవిలో ఉండరాదు.
ఎన్నిక విధానం, కాలపరిమితి
ఉప రాష్ట్రపతి ఎన్నిక ఎలెక్టోరల్ కాలేజి ద్వారా జరుగుతుంది. ఈ కాలేజిలో లోక్‌సభ, రాజ్యసభల సభ్యులు సభ్యులుగా ఉంటారు.
ఉప రాష్ట్రపతి ఐదేళ్ళు పదవిలో ఉంటారు. అయితే కింది సందర్భాలలో పదవీకాలం ముందే ముగియవచ్చు.
- ఉప రాష్ట్రప్తి తన రాజీనామాను రాష్ట్రపతికి పంపినపుడు
- రాజ్యసభ తీర్మానం ద్వారా ఉప రాష్ట్రపతిని పదవి నుండి తొలగించినపుడు
అయితే ఉప రాష్ట్రపతి ఐదేళ్ళ కాలం ముగిసినా, తన వారసుడు పదవి చేపట్టే వరకు పదవిలో కొనసాగుతారు.
ఉప రాష్ట్రపతి పదవీకాలం ముగిసే లోపు తదుపరి ఉప రాష్ట్రపతి ఎన్నిక పూర్తి అయిపోవాలి. ఒకవేళ ఉప రాష్ట్రపతి పదవి అర్ధంతరంగా ఖాళీ అయితే (మరణం, రాజీనామా, తొలగింపు మొదలైన వాటి వలన) తదుపరి ఉప రాష్ట్రపతి కొరకు ఎన్నిక వీలయినంత త్వరగా జరగాలి. అప్పుడు ఎన్నికయ్యే వ్యక్తి ఐదేళ్ళ పూర్తి కాలం అధికారంలో ఉంటారు.
విధులు, అధికారాలు
ఉప రాష్ట్రపతి రెండు ప్రముఖమైన విధులు నిర్వర్తిస్తారు. కార్య నిర్వాహక వ్యవస్థకు సంబంధించి, ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, శాసన వ్యవస్థకు సంబంధించి, రాజ్యసభ ఉపాధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వర్తిస్తారు.
మరణం, రాజీనామా, అభ్శంసన వంటి కారణాల వలన రాష్ట్రపతి పదవి ఖాళీ అయినపుడు, ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి విధులు నిర్వర్తిస్తారు. అనారోగ్య కారణాల వలన రాష్ట్రపతి విధులు నిర్వర్తించలేని పరిస్థితిలో, ఉప రాష్ట్రపతి ఈ విధులు చేపడతారు. రాష్ట్రపతి విధులు నిర్వర్తించే సమయంలో, ఆ పదవికి లభించే అన్ని అధికారాలు, సౌకర్యాలు, వేతనం మొదలైనవన్నీ ఉప రాష్ట్రపతికి లభిస్తాయి.
రాజ్యసభ అధ్యక్షుడిగా సభా కార్యక్రమాలను నిర్వహిస్తారు. దీనికి డిప్యూటీ ఛైర్మను సహకరిస్తారు.
ఉప రాష్ట్రపతుల జాబితా
| సంఖ్య | పేరు | నుండి | వరకు |
|---|---|---|---|
| 1 | డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ | మే 13 1952 | మే 12 1962 |
| 2 | డా.జాకీర్ హుస్సేన్ | మే 13 1962 | మే 12 1967 |
| 3 | వి.వి.గిరి | మే 13 1967 | మే 3 1969 |
| 4 | డా.గోపాల్ స్వరూప్ పాఠక్ | ఆగష్టు 31 1969 | ఆగష్టు 30 1974 |
| 5 | బి.డి.జట్టి | ఆగష్టు 31 1974 | ఆగష్టు 30 1979 |
| 6 | ఎం.హిదయతుల్లా | ఆగష్టు 31 1979 | ఆగష్టు 30 1984 |
| 7 | ఆర్.వెంకటరామన్ | ఆగష్టు 31 1984 | జూలై 24 1987 |
| 8 | డా.శంకర్ దయాళ్ శర్మ | సెప్టెంబర్ 3 1987 | జూలై 24 1992 |
| 9 | కె.ఆర్.నారాయణన్ | ఆగష్టు 21 1992 | జూలై 24 1997 |
| 10 | కృష్ణకాంత్ | ఆగష్టు 21 1997 | జూలై 27 2002 |
| 11 | భైరన్ సింగ్ షెఖావత్ | ఆగష్టు 19 2002 | జూలై 21 2007 |
| 12 | మహ్మద్ హమీద్ అన్సారి | ఆగష్టు 11 2007 | ఆగష్టు 11 2017 |
| 13 | ఎం. వెంకయనాయుడు | ఆగష్టు 11 2017 | |
