ఉప్పుగుండూరు
ఉప్పుగుండూరు, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామము.[1].పిన్ కోడ్ నం. 523 186 ., ఎస్.టి.డి.కోడ్ = 08592.
| ఉప్పుగుండూరు | |
| — రెవిన్యూ గ్రామం — | |
![]() ఉప్పుగుండూరు |
|
| అక్షాంశరేఖాంశాలు: 15.673122°N 80.166581°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | ప్రకాశం జిల్లా |
| మండలం | నాగులుప్పలపాడు |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | శ్రీ మసిముక్కు పెద్దబ్బాయి |
| జనాభా (2011) | |
| - మొత్తం | 9,060 |
| - పురుషుల సంఖ్య | 4,584 |
| - స్త్రీల సంఖ్య | 4,476 |
| - గృహాల సంఖ్య | 2,459 |
| పిన్ కోడ్ | 523186 |
| ఎస్.టి.డి కోడ్ | 08592 |
గ్రామ చరిత్ర
ఉప్పుగుండూరుకు, చిన్నగంజాం గ్రామాల సరిహద్దులో 1960లో ఒక బౌద్ధక్షేత్రాన్ని త్రవ్వకాలలో కనుగొన్నారు.[2] ఇక్కడ మూడవ శతాబ్దానికి చెందిన ఇక్ష్వాకు వంశపు రాజు పురుషదత్తుని బ్రాహ్మీ లిపిలో వ్రాసిన ప్రాకృత శాసనం కూడా ఒకటి లభించింది.[3] ఈ శాసనం ఒక వణిజ సంఘం ఇక్కడ మహా విహారాన్ని నిర్మింపజేయటం ప్రస్తావించబడింది. ఉప్పుగుండూరు బౌద్ధ క్షేత్రం నాగార్జున కొండ శైలిలో నిర్మించబడి ఉంది.[4]

గ్రామ భౌగోళికం
సమీప గ్రామాలు
సమీప మండలాలు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
గ్రామంలో విద్యా సౌకర్యాలు
ప్రభుత్వ జూనియర్ కళాశాల
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
- ఈ పాఠశాలలో చదువుచున్న పొట్లూరి సుప్రియ అను విద్యార్థిని, నేషనల్ స్కూల్ గేంస్ లో జాతీయస్థాయికి ఎంపికైనది. ఈమె 2016, జనవరి-4,5 తేదీలలో మహారాష్ట్రలో నిర్వహించే వాలీబాల్, టెన్నిస్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున పాల్గొంటుంది. [14]
- ఈ పాఠశాల వార్షికోత్సవం 2016, ఫిబ్రవరి-26న ఘనంగా నిర్వహించారు. [16]
ఆర్.వి.వి.ఉన్నత పాఠశాల
మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల
రాఘవేంద్ర కాలనీ.
రోజ్ రెసిడెన్షియల్
గ్రామంలోని మౌలిక సదుపాయాలు
- వివేకానంద సేవాసమితి, ఉప్పుగుండూరు.
- పశువైద్యశాల.
బ్యాంకులు
- ఆంధ్రా బ్యాంకు.
- ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు.
- ది ప్రకాశం జిల్లా కేంద్ర సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్.
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
ఎత్తిపోతల పథకం:- ఈ పథకానికి ప్రధాన నీటి వనరు కొమ్మమూరు కాలువ.
గ్రామ పంచాయతీ
2013 లో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ మసిముక్కు పెద్దబ్బాయి, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ మక్కెన బాబూరావు ఎన్నికైనారు. [4]
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాయాలములు
శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్టి వైభవంగా నిర్వహించెదరు. ఆ రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు స్వామివారికి అభిషేకాలు, కళ్యాణం, గ్రామోత్సవం తదితర కార్యక్రమాలు నిర్వహించెదరు. [13]
శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆళ్వారుల ఆలయం
ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం, వైశాఖ శుక్ల త్రయోదశి నుండి నిర్వహించెదరు. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించెదరు. స్వామివారి రథోత్సవం, గ్రామోత్సవం గూడా నిర్వహించెదరు. తరువాత వసంతసేవ, చక్రతీర్ధం, పవళింపుసేవ తదితర పూజాకార్యక్రమాలు నిర్వహించెదరు. [9]
ఈ ఆలయనికి 45.45 ఎకరాల మాన్యం భూమి ఉంది. [12]
శ్రీ గంగా గౌరీశ్వరీ దేవాలయం
కేవలం పంచారామములో మాత్రం కనిపించే తెల్లని శివలింగం ఈ ఆలయంలో ఉంది. ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏమిటనగా, ఆలయం లోపల స్వామివారి లింగస్వరూపానికి ముందు ఒక చిన్న నంది ఉంటే, ఆలయం వెలుపల, మరొక పెద్ద నందీశ్వరుడు కదలటానికి సిద్ధంగా ఉన్నట్లు మనల్ని పిలుస్తుంటాడు.
ఐదు అడుగుల లింగం
ప్రస్తుతం మనకు సుమారు ఐదు అదుగుల ఎత్తయిన తెల్లటి లింగరూపం దర్శనమిస్తుంది. స్థానికుల కథనం ప్రకారం, భూమిలో 8 అడుగుల లోతులో మరియొక లింగమూరి ఉన్నట్లు, ఈయన స్వయంభూగా వెలిశాడని చెబుతారు. మరియొక విశేషంగా, గంగాదేవి, పార్వతీదేవి స్వామివారికి చెరియొక వైపునా ఉన్న లఘు ఆలయాలలో వెలసియుండటం. ఈ విధంగా గంగాదేవికి గూడా విగ్రహం కల్పించటం ఇక్కడి విశిష్టత. [6]&[8]
కమ్మవారి శ్రీరామ మందిరం
ఉప్పుగుండూరు గ్రామములో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో శ్రీ సీతా, లక్ష్మణ, హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామివారల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2017, మార్చి-13వతేదీ సోమావారంనాడు ప్రత్యేకపూజలు నిర్వహించారు. 14వతేదీ మంగళవారం ప్రతిష్ఠా విగ్రహాల గ్రామోత్సవం, ప్రతిష్ఠా విగ్రహాల గ్రామోత్సవం, ప్రత్యేకపూజలు, 15వతేదీ బుధవారం ఉదయం 10-12 కి తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఆగమ పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ఠ, అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [19]
శ్రీ అంకమ్మ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయం
ఈ ఆలయంలో 2014, ఆగస్టు-8, రెండవ శ్రావణ శుక్రవారం నాడు, 108 మంది ముత్తయిదువులతో, వరలక్ష్మీ వ్రతం నిర్వహించెదరు. [10]
శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం
ఈ ఆలయం ప్రసిద్ధి గావించింది. ఈ ఆలయ 31వ వార్షికోత్సవం 2017, మార్చి-12వతేదీ ఆదివారం, (హోలీ రోజున) వైభవంగా నిర్వహించుచున్నారు. [18]
శ్రీ కొండపాటి పోలేరమ్మ తల్లి ఆలయం
ఈ అమ్మవారి ఆలయంలో వార్షిక తిరునాళ్ళ పొంగళ్ళను, 2017, ఏప్రిల్-19వతేదీ, శ్రీ హేవళంబినామ సంవత్సరం, చైత్ర బహుళ అష్టమి, బుధవారంనాడు వైభవంగా నిర్వహించారు. రాత్రికి విద్యుత్తు ప్రభను ఏర్పాటుచేసి, అమ్మవారికిగ్రామోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [20]
శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం
ఈ గ్రామంలోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయంలో స్వామివారి ఆరాధనోత్సవాలు, ప్రతి సంవత్సరం, వైశాఖ శుక్ల దశమి నాడు వైభవంగా నిర్వహించెదరు. [17]
శ్రీ షిర్డీ సాయి సేవాశ్రమం
ఈ ఆశ్రమప్రాంగణంలో 100 అడుగుల సాయికోటి మహాస్తూపం నిర్మాణానికి, 2015, జూన్-11వ తేదీ గురువారంనాడు, భూమిపూజ నిర్వహించారు. ఒకటిన్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ స్తూపంలో 50 అడుగుల స్తూపం, 50 అడుగుల విగ్రహం ఏర్పాటుచేసెదరు. 70 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న ఈ సాయి సేవాశ్రమానికి, ఈ సాయికోటి మహాస్తూపంతో మరింత విశిష్టత ఏర్పడగలదు. [11]
శ్రీ రామకృష్ణ ధ్యానమందిరం
గ్రామంలోని వివేకానంద సేవా సమితి 22వ వార్షికోత్సవం సందర్భంగా, గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ భవనాన్ని, 2016, ఫిబ్రవరి-2న ప్రారంభించారు. [15]
గ్రామములోని ప్రధాన పంటలు
గ్రామములోని ప్రధాన వృత్తులు
వ్యవసాయం, వ్యవసాగాధారిత వృత్తులు
గ్రామ విశేషాలు
(1) ఇటీవల Khammam Photo Arts Oraganisation ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో జరిగిన ఫొటోగ్రఫీ పోటీలలో, ఉప్పుగుండూరుకి చెందిన ఫొటో జర్నలిష్టు శ్రీ కె.యుగంధర్ బంగారు పతకం అందుకున్నారు. "మనోక్రోం విభాగంలో గిరిజన కళాకారులు" అను ఛాయాచిత్రానికి ఈయన ఈ బహుమతిని, 2-12-2013న ఖమ్మం జిల్లా కలెక్టరుగారి చేతులమీదుగా అందుకున్నారు. ప్రఖాత pictorial photographer రాజన్ బాబు గ్నాపకార్ధం ఈ పోటీ ఏర్పాటు చేశారు. [5]
(2) ఈ గ్రామానికి చెందిన శ్రీ ఉప్పుగుండూరి శ్రీనివాసరావు, ప్రముఖ రంగస్థల కళాకారుడు. బుర్రకథ, తోలుబొమ్మలాట కళాకారుడిగా ప్రభుత్వ పథకాల ప్రచారకర్తగా 5 దశాబ్దాలపాటు కళారంగానికి సేవలందించారు. ఇటీవల ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన "బంగారుతల్లి" ప్రచారకర్తగా బుర్రకథ రూపంలో ప్రజలలోకి తీసుకొనివెళ్ళారు. వీరు 2014, ఫిబ్రవరి-15న పరమపదించారు. [7]
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9,055.[5] ఇందులో పురుషుల సంఖ్య 4,656, మహిళల సంఖ్య 4,399, గ్రామంలో నివాస గృహాలు 2,221 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,197 హెక్టారులు.
- ఈ గ్రామ జనాభా సుమారు 20,000.
- జనాభా (2011) - మొత్తం 9,060 - పురుషుల సంఖ్య 4,584 - స్త్రీల సంఖ్య 4,476 - గృహాల సంఖ్య 2,459
మూలాలు
- భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- Journal of Indian history Dept. of Modern Indian History, 1965 - History
- An encyclopaedia of Indian archaeology By Amalananda Ghosh
- South Asian archaeology, 1995
- http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లంకెలు
- ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013, జూలై-27; 2వపేజీ
- ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు, 2013, డిసెంబరు-5; 1వపేజీ.
- ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు, 2013, డిసెంబరు-9; 2వపేజీ.
- ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, ఫిబ్రవరి-16; 2వపేజీ.
- ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, ఫిబ్రవరి-27; 1వపేజీ.
- ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, మే-12; 1వపేజీ.
- ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, ఆగస్టు-8; 1వపేజీ.
- ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, జూన్-12; 1వపేజీ.
- ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, జూన్-21; 1వపేజీ.
- ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు, 2015, డిసెంబరు-16; 2వపేజీ.
- ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు, 2016, జనవరి-3; 2వపేజీ.
- ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016, ఫిబ్రవరి-3; 2వపేజీ.
- ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016, ఫిబ్రవరి-27; 1వపేజీ.
- ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016, మే-18; 2వపేజీ.
- ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017, మార్చి-12; 2వపేజీ.
- ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017, మార్చి-14&16; 1వపేజీ.
- ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017, ఏప్రిల్-20; 1వపేజీ.
