ఉపన్యాసం

ఉపన్యాసంను ఆంగ్లంలో లెక్చర్ అంటారు. విద్యను నోటి ద్వారా బోధించడాన్నే ఉపన్యాసం అంటారు. ఒక ప్రత్యేకమైన విషయాన్ని లేక సమాచారాన్ని నోటితో బోధించడానికి లేక ప్రదర్శించడానికి ఉద్దేశించబడిన విద్యే ఉపన్యాసం. ఉదాహరణకు కళాశాల లేదా విశ్వవిద్యాలయం యొక్క ఉపాధ్యాయులు విద్యార్ధులకు నోటి ద్వారా విద్యను బోధించడం. ఉపన్యాసం ఇచ్చే వ్యక్తిని ఉపన్యాసకుడు అంటారు. ఉపన్యాసకుడిని ఆంగ్లంలో లెక్చరర్ అంటారు. చరిత్ర, నేపథ్యం, సిద్ధాంతాలు మరియు సమీకరణాలు వంటి క్లిష్టమైన సమాచారాన్ని తెలియజేయడానికి ఉపన్యాసాలను ఉపయోగిస్తారు. సాధారణంగా విద్యాగదిలో లెక్చరర్ ఉపన్యాసం ఇచ్చేటప్పుడు విద్యార్థులందరికి కనపడే విధంగా వారందరికి ముందువైపున నిలబడి ఉపన్యాసమిస్తాడు.

A lecture on linear algebra at the Helsinki University of Technology
A lecture on statistics at the University of KwaZulu-Natal


రాజకీయ ఉపన్యాసాలు

రాజకీయ ఉపన్యాసకుడిని రాజకీయనాయకుడు అంటారు. ఇతను తమ పార్టీ బలోపేతానికి కార్యకర్తలకు ఉపన్యాసమిస్తాడు.

వ్యాపార ఉపన్యాసాలు

వ్యాపార ఉపన్యాసకుడిని వ్యాపారవేత్త అంటారు. ఇతను తన సంస్థలో తయారైన వస్తువులను అమ్ముకుని తను లాభపడటానికి తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉపన్యాసాలిస్తాడు.

సుత్తికొట్టడం

అవసరమైన ఉపన్యాసం ఇచ్చేటప్పుడు అనవసరమైన, సందర్భానికి సంబంధం లేని మితిమీరిన ఉపన్యాసాన్ని సుత్తికొట్టడం అంటారు. సుత్తిలేని ఉపన్యాసాలు ఇంపుగా ఉండవు, అందుకే బోరు కొట్టకుండా పిట్టకథలు, చమత్కారాలతో సుత్తికొడతారు. సుత్తి అనే పదం స్తుతి పదం నుంచి ఉద్భవింవించింది. స్తుతించడం అనగా ప్రార్ధించడం అని అర్ధం.

ఇవి కూడా చూడండి

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.