ఉద్దంసింగ్ నగర్

ఉద్ద్ంసింగ్ నగర్ జిల్లా (హింది:ऊधम सिंह नगर ज़िला) ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జిలాలలో ఒకటి. జిల్లాకు ప్రధానకేంద్రం రుద్రాపూర్. ఇది తెహ్రీ భూభాగంలో ఉంది. ఈ జిల్లాలో బజ్పూర్, గడర్పుర్, జాస్పుర్, కాశీపూర్, కిచ్చా, ఖతిమా, సితర్గని అని 7 తాలూకాలు (తెహ్సిల్స్) ఉన్నాయి. ఈ జిల్లా తెరియా ప్రాంతంలో కుమాన్ విభాగంలో ఉంది.జిల్లా ఉత్తరదిశలో నైనీతాల్, ఆగ్నేయదిశలో చంపావత్, తూర్పు దిశలో నేపాల్ దేశం మరియు దక్షిణ మరియు పడమర దిశలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నాయి. 1995లో నైనీతాల్ నుండి కొంత భుభాగం తీసూని ఈ జిల్లా స్థాపించబడింది. 2011 గణాంకాలను అనుసరించి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని 13 జిల్లాలలో ఇది జనసంఖ్యలో 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానాలలో హరిద్వార్ మరియు డెహ్రాడూన్ ఉన్నాయి.[1] వ్యవసాయ పరిశోధకులకు మరియు ఇంజనీర్లకు గుర్తింపు పొందిన " గోవింద వల్లభ పంత్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ & టెక్నలజీ " రుద్రాపూర్‌కు 5 కి.మీ దూరంలో ఉంది.

Udham Singh Nagar district
ऊधम सिंह नगर ज़िला
district
Udham Singh Nagar district
Location in Uttarakhand, India
భౌగోళికాంశాలు: 28.98°N 79.40°E / 28.98; 79.40
Country India
StateUttarakhand
DivisionKumaon
HeadquartersRudrapur
విస్తీర్ణం
  మొత్తం2,908
జనాభా
  మొత్తం12,35,614
  సాంద్రత425
Languages
  OfficialHindi, Punjabi
సమయప్రాంతంIST (UTC+5:30)
వెబ్‌సైటుusnagar.nic.in

ఉద్దం సింగ్ నగర్ జిల్లాలోని తహసిల్స్

కాశీపూర్ ఉపవిభాగం

  • జాస్పూర్
  • కాశీపూర్
  • బజ్పూర్

రుద్రాపూర్ ఉపవిభాగం

  • గడార్పూర్
  • పంత్నగర్
  • రుద్రాపూర్
  • కిచ్చా
  • సితార్గంజ్

ఖతిమా ఉపవిభాగం

  • నానక్‌మట్ట
  • ఖతిమా

గణాంకాలు

2011 గణాంకాలను అనుసరించి ఉద్దం సింగ్ నగర్ జనసంఖ్య 1,648,367. [1] ఇది దాదాపు గునియా-బిస్సు దేశ జనసంఖ్యతో సమానం. [2] లేక అమెరికా నగరమైన ఇదహో జనసంఖ్యకు సమానం. [3] భారతీయ జిల్లాలు (640) లో ఉద్దంసింగ్ నగర్ జిల్లా 303వ స్థానంలో ఉంది.[1] జిల్లా జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 648. [1] 2001-2011 జిల్లా కుటుంబ నియంత్రణ శాతం 33.4%.[1] ఉద్దంసింగ్ నగర్ జిల్లా స్త్రీపురుష నిష్పత్తి 919:1000. [1] అలాగే అక్షరాస్యత శాతం 74.44%.[1]

వెలుపలి లింకులు

మూలాలు

  1. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Guinea-Bissau 1,596,677 July 2011 est. line feed character in |quote= at position 14 (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Idaho 1,567,582 line feed character in |quote= at position 6 (help)
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.