ఉత్తర ఫల్గుణి నక్షత్రము

ఉత్తర ఫల్గుణీ నక్షత్ర జాతకుల గుణగణాలు

ఉత్తర ఫల్గుణీ నక్షత్రముకు అధిపతి సూర్యుడు, అధిదేవత ఆర్యముడు, గణము మనుష్య, రాశ్యాధిపతులు సూర్యుడు, బుధుడు, జంతువు గోవు. ఈ నక్షత్రమున జన్మించిన వారు తంద్రి వలన ప్రయోజనము పొందుతారు. సహోద్ర వర్గము బలముగా ఉంటారు. నైతిక బాధ్యతలు అధికము. వివాహము సకాలములో ఔతుంది, ఉద్యోగము లెక వ్యాపారము ఉంటాయి. అదృష్టానికి దగ్గరగా జీవితము సాగుతుంది. స్థాయికి మించిన వ్యాపార వ్యవహారాలు కలసి వస్తాయి. స్థిరాస్థులు, ధనము అధికముగా గుప్తముగా ఉంటాయి. తనకు అంతగా పరిచయము లేని రమ్గములో ఉన్నత స్థితి సాధిస్తారు. పరోపకారము చాలా తక్కువ. చౌకగా ఆస్తులు కొనుగోలు చేస్తారు. సంపాదనలో బమ్ధుత్వానికి పాపభీతికి చోటు ఉండదు. ధనము విషయములో వీరు ఉదారులని భావిస్తారు కాని వీరు అనవసరముగా ఖర్చు పెట్టరు. ఖర్చు పెట్తిన దానికి వమ్దరెట్లు ఫలితము ఉంటేనే ఖర్చు చేస్తారు. ఇతరులను అవమానించి ఆనందిస్తారు. సంతానము వలన చిక్కులు ఎదుర్కొంటారు. తేనెటీగ లాగా కూడబెడతారు. సంఘవ్యతిరేక, చట్ట వ్యతిరేక పనులకు భయపడరు. లోలోపల పిరికి వారుగా ఉంటారు. భార్య ఆధిపత్యము అధికము. మంచి ఆశయాలతో ముందుకు వచ్చినా వీరిని ప్రపమ్చము సరిగా అర్ధము చేసుకోదు. రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు కలసి వస్తాయి. జీవితము మీద ఉన్న భయము వీరిని అడ్డదారులలోకి వెళ్ళేలా చేస్తుంది. రాహు, గురు దసలు విరికి యోగిస్తాయి.

ఉతార ఫల్గుణినక్షత్ర వివరాలు

ఉత్తర ఫల్గుణి నక్షత్రాన్ని ఉత్తర అని కుడా అంటారు. నక్షత్రములలో ఇది పన్నెండవది.

నక్షత్రంఅధిపతిగణముజాతిజంతువువృక్షమునాడిపక్షిఅధిదేవతరాశి
ఉత్తర ఫల్గుణిసూర్యుడుమానవస్త్రీగోవుజువ్విఆదివడ్రంగి పిట్టఆర్యముడు1 సింహం 2,3,4 కన్య
నక్షత్రములు
అశ్వని నక్షత్రము
భరణి నక్షత్రము
కృత్తిక నక్షత్రము
రోహిణి నక్షత్రము
మృగశిర నక్షత్రము
ఆరుద్ర నక్షత్రము
పునర్వసు నక్షత్రము
పుష్యమి నక్షత్రము
ఆశ్లేష నక్షత్రము
మఖ నక్షత్రము
పుబ్బ నక్షత్రము
ఉత్తర ఫల్గుణి నక్షత్రము
హస్త నక్షత్రము
చిత్త నక్షత్రము
స్వాతి నక్షత్రము
విశాఖ నక్షత్రము
అనూరాధ నక్షత్రము
జ్యేష్ట నక్షత్రము
మూల నక్షత్రము
పూర్వాషాఢ నక్షత్రము
ఉత్తరాషాఢ నక్షత్రము
శ్రవణ నక్షత్రము
ధనిష్ఠ నక్షత్రము
శతభిష నక్షత్రము
పూర్వాభాద్ర నక్షత్రము
ఉత్తరాభాద్ర నక్షత్రము
రేవతి నక్షత్రము

ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకుల తారా ఫలాలు

తార నామంతారలుఫలం
జన్మ తారకృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢశరీరశ్రమ
సంపత్తారరోహిణి, హస్త, శ్రవణంధన లాభం
విపత్తారమృగశిర, చిత్త, ధనిష్టకార్యహాని
సంపత్తారఆర్ద్ర, స్వాతి, శతభిషక్షేమం
ప్రత్యక్ తారపునర్వసు, విశాఖ, పూర్వాభద్రప్రయత్న భంగం
సాధన తారపుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్రకార్య సిద్ధి, శుభం
నైత్య తారఆశ్లేష, జ్యేష్ట, రేవతిబంధనం
మిత్ర తారఅశ్విని, మఖ, మూలసుఖం
అతిమిత్ర తారభరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢసుఖం, లాభం

ఉత్తర ఫల్గుణి నక్షత్రము నవాంశ

  • 1 వ పాదము - ధనసురాశి.
  • 2 వ పాదము - మకరరాశి.
  • 3 వపాదము - కుంభరాశి.
  • 4 వ పాదము - మీనరాశి.

చిత్ర మాలిక

ఇతర వనరులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.