ఉత్తరాభాద్ర నక్షత్రము

ఉత్తరాభద్రానక్షత్ర,ము గుణగణాలు

ఉత్తరాభద్ర నక్షత్ర అధిపతి శని, రాశ్యధిపతి గురువు, మానవగణం, జంతువు ఆవు. ఈ నక్షత్ర జాతకులు వినయవిధేయతలు కలిగి ఉంటారు. పెద్ద చిన్న తారతమ్యం కలిగి ఉంటారు. చదువు మీద మంచి పట్టు సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు. విదేశీ విద్య, అధికార పదవులు, వ్యాపారం కలసి వస్తాయి. వివాహ జీవితం బాగా ఉంటుంది. చక్కటి వ్యూహరచనతో పొదుపుగా సంసారాన్ని సాగిస్తారు. గొప్పలు చెప్పుకోరు. ఇతరులను కించపరచరు. ఇతరులకు అనవసరంగా ఖర్చు చేయరు. ఇతరుల సొమ్మును ఆశించరు. భూమి వాహనముల మీద అధికారం కలిగి ఉంటారు. కుటుంబ చరిత్ర తండ్రి వలన మేలు జరుగుతుంది. ఇతర భాషలు నేర్చుకుంటారు. మంచి హాస్య ప్రియులు. అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుంది. అబద్ధాలు చెప్పి ఇతరులను మోసగించరు. మంచి స్నేహస్పూర్తి కలిగి ఉంటారు. ఉన్నత స్థితిలో ఉన్నవారికి ఇష్టులుగా, సలహాదారులుగా ఉంటారు. మంచి స్నేహస్పూర్తి కలిగి ఉంటారు. జివితం సాఫీగా జరిగి పోతుంది. ముప్పై నుండి నలభై సంవత్సరాల తరువాత జీవితంలో అభివృద్ధి కలుగుతుంది. ఇది నక్షత్ర జాతకులు అందరికీ సామాన్య ఫలితాలు. జాతక చక్రములో గ్రహస్థితులను అనుసరించి ఫలితాలలో మార్పులు చేర్పులు ఉంటాయి.

నక్షత్ర వివరాలు

నక్షత్రములలో ఇది 26వ నక్షత్రము.

నక్షత్రంఅధిపతిగణముజాతిజంతువువృక్షమునాడిపక్షిఅధిదేవతరాశి
ఉత్తరాభద్రశనిమానవస్త్రీగోవువేపమధ్యఅహిర్పద్రువ్యుడుమీనం
నక్షత్రములు
అశ్వని నక్షత్రము
భరణి నక్షత్రము
కృత్తిక నక్షత్రము
రోహిణి నక్షత్రము
మృగశిర నక్షత్రము
ఆరుద్ర నక్షత్రము
పునర్వసు నక్షత్రము
పుష్యమి నక్షత్రము
ఆశ్లేష నక్షత్రము
మఖ నక్షత్రము
పుబ్బ నక్షత్రము
ఉత్తర ఫల్గుణి నక్షత్రము
హస్త నక్షత్రము
చిత్త నక్షత్రము
స్వాతి నక్షత్రము
విశాఖ నక్షత్రము
అనూరాధ నక్షత్రము
జ్యేష్ట నక్షత్రము
మూల నక్షత్రము
పూర్వాషాఢ నక్షత్రము
ఉత్తరాషాఢ నక్షత్రము
శ్రవణ నక్షత్రము
ధనిష్ఠ నక్షత్రము
శతభిష నక్షత్రము
పూర్వాభాద్ర నక్షత్రము
ఉత్తరాభాద్ర నక్షత్రము
రేవతి నక్షత్రము
నక్షత్రం/వివరం ప్రత్యేక వివరం
నక్షత్ర అధిపతి
గణము
జాతి
జంతువు
పక్షి
వృక్షం
రాశి
అధిదేవత
నాడి

ఉత్తరాభద్రా నక్షత్ర జాతకుల తారా ఫలాలు

తార నామంతారలుఫలం
జన్మ తారపుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్రశరీరశ్రమ
సంపత్తారఆశ్లేష, జ్యేష్ట, రేవతిధన లాభం
విపత్తారఅశ్విని, మఖ, మూలకార్యహాని
సంపత్తారభరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢక్షేమం
ప్రత్యక్ తారకృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢప్రయత్న భంగం
సాధన తారరోహిణి, హస్త, శ్రవణంకార్య సిద్ధి, శుభం
నైత్య తారమృగశిర, చిత్త, ధనిష్టబంధనం
మిత్ర తారఆరుద్ర, స్వాతి, శతభిషసుఖం
అతిమిత్ర తారపునర్వసు, విశాఖ, పూర్వాభద్రసుఖం, లాభం

ఉత్తరాభద్రానక్షత్రము నవ్వాంశ

  • 1వ పాదము - సింహరాశి.
  • 2వ పాదము - కన్యారాశి.
  • 3వ పాదము - తులారాశి.
  • 4వ పాదము - వృశ్చికరాశి.

చిత్ర మాలిక


ఇతర వనరులు =


This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.