ఉండుకము

ఉండుకము (Vermiform appendix) పేగులో ఒక భాగము. మానవులలో ఇది అవశేషావయవము. ఇది ఉదరములో కుడివైపు క్రిందిమూలలో పెద్ద ప్రేగు మొదటి భాగానికి కలిసి ఉంటుంది. అరుదుగా ఎడమవైపుకూడా ఉండవచ్చును. మనుషులలో ఉండుకము ఇంచుమించు 10 సె.మీ పొడుగుంటుంది (2-20 సె.మీ.). ఇది పేగుకు కలిసేభాగం స్థిరంగా ఉన్నా, దీనికొన ఉదరంలో ఏవైపుకైనా తిరిగి ఉండవచ్చు. దీని వాపునొప్పి ఈస్థానాన్ని బట్టి ఉంటుంది.

ఉండుకము
Arteries of cecum and vermiform appendix. (Appendix visible at lower right, labeled as "vermiform process").
Normal location of the appendix relative to other organs of the digestive system (frontal view).
లాటిన్ appendix vermiformis
గ్రే'స్ subject #249 1178
అంగ వ్యవస్థ జీర్ణ వ్యవస్థ
Precursor Midgut
MeSH Appendix
Dorlands/Elsevier a_54/12147735

వ్యాధులు

  • అపెండిసైటిస్ (Appendicitis) : అపెండిక్స్ లేదా ఉండుకము ఇన్ఫెక్షన్ వలన ఇది వాచిపోతే దానిని అపెండిసైటిస్ అంటారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ పొట్ట లోపల అంతటా వ్యాపించవచ్చు. ఒక్కోసారి అపెండిక్స్ పగిలి ప్రాణాపాయ స్థితి కూడా సంభవించవచ్చు. అందుకే వెంటనే శస్త్రచికిత్స చేయడం ఉత్తమం.
అపెండిసైటిస్ కు గల కారణాలు

మనం తిన్న ఆహారం అవశేషాలు లేక పెద్ద ప్రేగులలోని ఒక రకమైన నులిపురుగులు అపెండిక్స్ నాళంలో ప్రవేశించి, ఇన్ఫెక్షన్ రావడం.

శస్త్రచికిత్స పేరు "అపెండిసెక్టమీ" (Appendicectomy) అంటారు.

point.jpg intestinalis appendix vermiformis.svg/400px-Tractus intestinalis appendix vermiformis.svg.png

ఉండుకపు వాపు నొప్పివచ్చే స్థానం

మూలాలు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.