ఈతముక్కల
ఈతముక్కల, ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలానికి చెందిన గ్రామము.[1].పిన్ కోడ్ నం. 523280., ఎస్.టి.డి.కోడ్ నం. 08592.
| ఈతముక్కల | |
| — రెవిన్యూ గ్రామం — | |
![]() ఈతముక్కల |
|
| అక్షాంశరేఖాంశాలు: 15.374451°N 80.113657°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | ప్రకాశం జిల్లా |
| మండలం | కొత్తపట్నం |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 6,995 |
| - పురుషుల సంఖ్య | 3,482 |
| - స్త్రీల సంఖ్య | 3,513 |
| - గృహాల సంఖ్య | 1,920 |
| పిన్ కోడ్ | 523280 |
| ఎస్.టి.డి కోడ్ | 08592 |
పేరువెనుక చరిత్ర
రామాయణంలో లక్ష్మణుడు శూర్పణఖ యొక్క ముక్కును ఈ ప్రదేశంలో కోసినందున, ఇంతి యొక్క ముక్కును ముక్కలు చేసినందున ఇంతిముక్కల అని పిలిచెను. అ పేరు మార్పు చెంది "ఈతముక్కల"గా స్థిరం అయినది.
గ్రామ భొగోళికం
సమీప గ్రామాలు
మదనూరు 2 కి.మీ, ఆలకూరపాడు 5.6 కి.మీ, సూరారెడ్డి పాలెం 10 కి.మీ, కొత్తపట్నం 9 కి.మీ, రాజుపాలెం 3 కి.మీ.
సమీప పట్టణాలు
టంగుటూరు 15 కి.మీ, కొత్తపట్నం 9 కి.మీ, ఒంగోలు 20 కి.మీ, సింగరాయకొండ 25 కి.మీ.
సమీప మండలాలు
పశ్చిమాన జరుగుమిల్లి మండలం, దక్షణాన సింగరాయకొండ మండలం, ఉత్తరాన ఒంగోలు మండలం.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
శ్రీ ఉలిచి వెంకారెడ్డి, సీతారామమ్మ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల(S.U.V.R & S.R.G.P.W College)
- ఈ కళాశాల విద్యార్ధినులు, 2015, మార్చ్-8వ తేదీనాడు, తూర్పుగోదావరి జిల్లాలోని గండేపల్లిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అంతర పాలిటెక్నిక్ కళాశాలల బ్యాండ్ మింటన్ డబుల్స్ పోటీలలో, ద్వితీయస్థానం పొందినారు. [9]
- ఈతముక్కలలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఇమ్మడిశెట్టి సుప్రజ అను విద్యార్ధిని, డిప్లమా ఇన్ ఎలెక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ కోర్స్ చదువుచున్నది. ఈమె ఇటీవల ఈ-సెట్ ప్రవేశ పరీక్ష వ్రాయగా, అందులో రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంక్ సాధించినది. [10]
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
ఈ గ్రామానికి చెందిన శ్రీ దాసూరి గోపాలరెడ్డి, 1988 నుండి 1995 వరకూ, ఈ గ్రామ పంచాయతీకి సర్పంచిగా పనిచేసారు. ఆ రోజులలో డబ్బుతో పనిలేదు. మనిషిని బట్టి ఓట్లు వేసే రోజులవి. [2]in addition to that smt.Basamgaripadma w/O Prasad elected as sarpanch in 2013 from TDP party with majority of 250 votes.
గ్రామములోని మౌలిక సదుపాయాలు
వైద్య సౌకర్యం
ఈ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది.
బ్యాంకులు
ఇండియన్ బ్యాంక్.
గ్రామ పంచాయతీ
2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి బసంగారి పద్మ సర్పంచిగా ఎన్నికైనారు. అనంతరం ఈమె మండల సర్పంచిల సంఘం డైరెక్టరుగా ఎన్నికైనారు. [13]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
శ్రీ జ్వాలాముఖి అమ్మవారి ఆలయం
- ఈ ఆలయంలో 2013 అక్టోబరు 18 నాడు అమృతపూర్ణిమ సందర్భంగా, 5వ వార్షికోత్సవం ఘనంగా జరిపినారు. వెన్నెల్లో పాయసం తయారుచేసి భక్తులకు పంపిణీ చేశారు. ఈ ప్రసాదం తీసుకుకున్నవారికి మానసిక ప్రశాంతత వస్తుందని ప్రతీతి. అమ్మవారు ఆరోజు అరటిపళ్ళ మధ్య కొలువుదీరినారు. అందువలన అమ్మవారిని "కదళీఫల కదంబ వనప్రియే" అని సంబోధించెదరు. [3]
- శ్రీ జ్వాలాముఖి అమ్మవారి వార్షిక తిరునాళ్ళు, 2014, ఆగస్టు-2వ తేదీ శనివారం నాడు వైభవంగా ప్రారంభమైనవి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విద్యుద్దీపాలు, ఈఫిల్ టవర్, ప్రభలు గ్రామమంతా వెలుగులు నింపినవి. ఉదయం నుండియే భక్తులు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. విద్యుత్తు ప్రభలవద్ద ఏర్పాటుచేసిన మ్యూజికల్ నైటె, పాటకచేరి కార్యక్రమాలు అలరించినవి. ఈ తిరునాళ్ళలో, మందుచెట్లు కాల్చే కార్యక్రమం, ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. [7]
- ఈ గ్రామానికి చెందిన డా.ఎ.రవీంద్రబాబు, ఈతముక్కల జ్వాలాముఖీదేవి అను పుస్తకాన్ని రచించారు. వీరు ముందుగా జంటగ్రామాల చరిత్ర తెలుసుకొని, అనేక గ్రంథాలు తరచిచూసి, అంతర్జాలంలో కొంత సమాచారాన్ని సేకరించి, ఈ పుస్తక రచనకు పూనుకున్నారు. ఈ పుస్తక ఆవిష్కరణ, 2014, మే-29 న ఆలయ ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిమాచలప్రదేశ్ లో ఉన్న జ్వాలాముఖి శక్తిపీఠానికి, అనుబంధ ఉపపీఠాలలో ఈతముక్కల ఆలయం గూడా ఉండటం విశేషం. [4]
- ఈ ఆలయంలో 2014, అక్టోబరు-9 న, షష్టమ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు ప్రతి కుటుంబం నుండి ఒక పసుపు బిందె నీటిని తీసికొని మేళతాళాలమధ్య ఆలయానికి చేరుకున్నారు. ఉదయం నుండి మద్యాహ్నం వరకు అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయంలో కొలువుదీరిన అమ్మవారిని పుష్పాలతో అలంకరించారు. ఆలయప్రాంగణం అంతటా రకరకాల పుష్పాలు, విద్యుద్దీపాలతో ప్రత్యేకత సంతరించుకొన్నది. [8]
శ్రీ కన్నేశ్వరస్వామివారి ఆలయం
ఈ ఆలయంలో కార్తీకమాసం చివరిరోజైన 2015, డిసెంబరు-11వ తేదీ శుక్రవారంనాడు, స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రభిషేకాలు నేత్రపర్వంగా నిర్వహించారు. [12]
శ్రీ జాలమ్మ తల్లి ఆలయం
ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక తిరునాళ్ళు ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ఐదురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. 2014, జూలై-30 నుండి నిర్వహించుచున్న ఈ తిరునాళ్ళ కార్యక్రమంలో, తొలిరోజు బుధవారం నాడు రాములవారికి గ్రామీణులు హారతులిచ్చారు. గురు, శుక్రవారాల్లో ఆలయంలో ప్రత్యేకపూజలు మరియూ భక్తుల వినోదం కొరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శనివారంనాడు అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించెదరు. ఆఖరి రోజయిన ఆదివారం నాడు, భక్తులు ఆలయప్రాంగణంలో అమ్మవారికి పొంగళ్ళు వండి నైవేద్యాలు సమర్పించెదరు. [6]
శ్రీ అనంతకోదండరామస్వామివారి ఆలయం
ఈ ఆలయంలో నూతన జీవ ధ్వజస్తంభ మహా ప్రతిష్ఠోత్సవాలు, 2015, జూన్-8వ తేదీ సోమవారం నుండి ప్రారంభించారు. సోమవారంనాడు అఖండ దీపారాధన, అంకురార్పణ నిర్వహించారు. 9వ తేదీ మంగళవారం నాడు, ఈతముక్కల మరియు మడనూరు గ్రామాలలో, నూతన ధ్వజస్తంభానికి గ్రామోత్సవం నిర్వహించారు. 10వ తేదీ బుధవారంనాడు, విష్వక్సేనపూజ, నిత్య హోమం, మహాశాంతిహోమం, సర్వదైవత్య పరమాత్మక హోమం నిర్వహించారు. 11వ తేదీ గురువారం తెల్లవారుఝామునుండియే భక్తులు అధికసంఖ్యలో పూజాకార్యక్రమాలలో పాల్గొని, స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రామనామస్మరణతో ఆలయప్రాంగణం ప్రతిధ్వనించింది. అనంతరం ఉదయం 8 గంటలకు, వేదపండితుల ఆధ్వర్యంలో, జీవధ్వజప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఈ నూతన ధ్వజస్తంభాన్ని, ఈతముక్కల గ్రామానికి చెందిన శ్రీ కేశవరపు కోటిరెడ్డి, తన స్వంత నిధులనుండ్ సమకూర్చారు. తదుపరి ఆలయప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఆంజనేయస్వామివారి విగ్రహప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం శాంతికళ్యాణం, తదుపరి స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. [11]
శ్రీ భావనాఋషేశ్వరస్వామి దేవస్థానం
గ్రామంలో ప్రధాన పంటలు
వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలోని ప్రధాన వృత్తులు
రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలు (హ్యాచరీస్).
గ్రామ విశేషాలు
జర్మనీ దేశస్థురాలయిన "శాండీ రాబ్సన్" అను ఒక మహిళ, జర్మనీ నుండి ఆస్ట్రేలియాకు, ఒక పడవపై, ఒంటరిగా సముద్రయానం చేసి ప్రపంచ రికార్డు సాధించాలనే క్రమంలో, 2014, మే-30, శుక్రవారం సాయంత్రం, అనుకోకుండా, ఈతముక్కల పల్లెపాలెం వచ్చి, ఆ రాత్రి ఒకరి ఇంట్లో బస చేసారు. శనివారం ఉదయమే గ్రామస్థులు పెద్ద సంఖ్యలో, ఆమె బసచేసిన ఇంటికి చేరుకొని ఆమెను అభినందించారు. ఆమెకు మామిడి, అరటి పండ్లను అందజేసినారు. ఆమె రాత్రి తనకు ఆతిధ్యం ఇచ్చిన గృహస్థురాలికి కృతఙతలు తెలియజేసినారు. తరువాత ఆమె తన సామానులు పడవలోకి సర్దుకొని, గ్రామస్థులు వీడ్కోలు పలుకుతుండగా, తన పడవలో సముద్రంలోనికి వెళ్ళిపోయి, తన యాత్రను తిరిగి ప్రారంభించారు. [5]
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 6,995 - పురుషుల సంఖ్య 3,482 - స్త్రీల సంఖ్య 3,513 - గృహాల సంఖ్య 1,920;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,454.[2] ఇందులో పురుషుల సంఖ్య 3,619, మహిళల సంఖ్య 3,835, గ్రామంలో నివాస గృహాలు 1,800 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1,607 హెక్టారులు.
మూలాలు
వెలుపలి లంకెలు
[2] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2013, జూలై-22; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2013, అక్టోబరు-19; 1&16 పేజీలు. [4] ఈనాడు ప్రకాశం; 2014, మే-30; 7వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2014, జూన్-1; 15వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014, జూలై-31; 3వపేజీ. [7] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014, ఆగస్టు-3; 1వపేజీ. [8] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014, అక్టోబరు-10; 4వపేజీ. [9] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015, మార్చి-9; 1వపేజీ. [10] ఈనాడు ప్రకాశం; 2015, మే-24; 7వపేజీ. [11] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015, జూన్-7&12; 1వపేజీ. [12] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015, డిసెంబరు-12; 3వపేజీ. [13] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2016, అక్టోబరు-11; 2వపేజీ.
