ఇరుగుడు

ఇరుగుడు లేదా జిట్టేగి (లాటిన్ Dalbergia latifolia; synonym Amerimnon latifolium) ఒక కలప చెట్టు. ఇవి తూర్పు మరియు దక్షిణ భారతదేశంలోని ఉష్ణమండల రైన్ ఫారెస్ట్ లలో పెరుగుతుంది.[1][2] దీనికున్న కొన్ని ఇంగ్లీషు పేర్లు : blackwood, Bombay blackwood, rosewood, Roseta rosewood, East Indian rosewood, black rosewood, Indian palisandre, and Java palisandre.[1][2] వీటి వాడుక పెరులు ఇండియాలొ ఏమిటి అంటె బీటి మరియు సిట్సాల్.[1]వృక్షాలు సతతహరితంగఅ సుమారు 40 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.[1][2]

ఇరుగుడు / జిట్టేగి
జావా దీవుల వీధిలో పెరిగుతున్న Dalbergia latifolia.
పరిరక్షణ స్థితి

Vulnerable  (IUCN 2.3)
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
(unranked): పుష్పించే మొక్కలు
(unranked): యుడికాట్స్
(unranked): రోసిడ్స్
క్రమం: ఫాబేలిస్
కుటుంబం: ఫాబేసి
ఉప కుటుంబం: Faboideae
జాతి: డాల్బెర్గియా
ప్రజాతి: D. latifolia
ద్వినామీకరణం
Dalbergia latifolia
Roxb.

లక్షణాలు

Pinnately compound leaves of Dalbergia latifolia growing in Java.
  • ఎత్తుగా పెరిగే వృక్షాలు.
  • ఉపాంతరహిత అండాకార పత్రకాలు గల సంయుక్త పత్రాలు.
  • బలహీనమైన శాఖలు గల అనిశ్చత విన్యాసంలో అమరిన తెలుపు రంగు పుష్పాలు.
  • ఏక విత్తనం గల దీర్ఘవృత్తాకార రెక్కగల ఫలం.

ఉపయోగాలు

Dalbergia latifolia రోజ్ వుడ్ తో తయారుచేసిన చదరంగం పావులు
  • దీని బెరడును గాయం చేయగా స్రవించు ఎర్రటి ద్రవమును గాయములను మాన్పుటకు వాడెదరు.[3]
  • దీని కలప నల్లగా అందముగా ఉండి కుర్చీలు, బల్లలు మొదలైనవి తయారుచేయుటకు వాడెదరు.

భారతీయ సంస్కృతి

  • బేతాళ కథలు లో విక్రమార్కుడు ఈ శింశుపా వృక్షం ఎక్కి వేళ్ళాడుతున్న శవాన్ని తాడు కోసి కింద పడవేస్తాడు. కిందపడగానే, శవం ఏడవటం మొదలుపెడుతుంది. బేతాళుదు ఆ శవాన్ని ఆవహించి ఉన్న సంగతి తెలుసుకోలేక విక్రమార్కుడు, ఎందుకు నవ్వుతావు. ఒక క్లిష్టమైన సమస్యను పూరించమని అడుగుతాడు. పరిష్కారం చెప్పగానే శవం మల్లీ వృక్షం పైకి పోతుంది.

ఉపయోగాలు

ఈ వృషం చాలా వాటికి ఉపయోగ పడుతుంది ఈ విదమైన చెట్లు అడవులు తిరిగి పెంచడానికి ఉపయోగ పడతాయి మరియు చాలా రకమైన వస్తువులు చెయడానికి ఉపయోగపడతాయి గిటార్ తయారు చేయడంలొ, కాబినెట్ బెంచిలు తయారు చెయడములొ మరుయు మంచి సామానులు చేయడానికి ఈ కలప పనికివస్తుంది.

మూలాలు

  1. World Agroforestry Centre, Agroforestry Tree Database, retrieved 2011-03-21
  2. IUCN Redlist Dalbergia latifolia
  3. శింశుపా - జిట్టేగి, పవిత్రవృక్షాలు, తిరుమల తిరుపతి దేవస్థానములు,తిరుపతి, 1992, పేజీ: 145.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.