ఇమ్మడిచెరువు

ఇమ్మడిచెరువు, ప్రకాశం జిల్లా, వెలిగండ్ల మండలానికి చెందిన గ్రామము.[1]. పిన్ కోడ్: 523 224., ఎస్.ట్.డి.కోడ్ = 08402.

ఇమ్మడిచెరువు
  రెవిన్యూ గ్రామం  
ఇమ్మడిచెరువు
అక్షాంశరేఖాంశాలు: 15.293268°N 79.250753°E / 15.293268; 79.250753
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం వెలిగండ్ల
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,766
 - పురుషుల సంఖ్య 1,433
 - స్త్రీల సంఖ్య 1,333
 - గృహాల సంఖ్య 638
పిన్ కోడ్ 523224
ఎస్.టి.డి కోడ్ 08402

గ్రామ ప్రముఖులు

ఈ గ్రామానికి చెందిన శ్రీ ముక్కు కాశిరెడ్డి, 1981 లో ఈ గ్రామ సర్పంచిగా గెలుపొందినారు. 1983, 1985, 1994 లలో శాసనసభ్యులుగా, జిల్లా తె.దే.పా. అధ్యక్షులుగా, జిల్లా పరిషత్తు అధ్యక్షులుగా పనిచేశారు. [1]

విద్య

కనిగిరి పట్టణం కొత్తపేటకు చెందిన శ్రీ సుంకర బ్రహ్మానందరెడ్డి, వెలిగండ్ల మండలం ఇమ్మడిచెరువు గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో స్కూలు అసిస్టెంటుగా పనిచేస్తున్నారు. వీరు "జన విఙాన వేదిక" కనిగిరి డిజను ప్రధాన కార్యదర్శిగా గూడా పనిచేస్తున్నారు. వీరు భౌతిక, రసాయన శాస్త్రాల అధ్యయనం, విస్తృతికి విశేష కృషి చేస్తున్నారు. వీరి సేవ, ప్రతిభను గుర్తించిన "స్టేట్ కరికులం ఎడ్యుకేషన్" వారు ఈయనను 10వ తరగతి భౌతిక, రసాయనిక శాస్త్ర పాఠ్యాంశ రూపకల్పనకు నియమించిన ఆరుగురు నిపుణులైన ఉపాధ్యాయులలో ఒకరిగా ఎంపిక చేసారు. ఎన్.సి.ఇ.ఆర్.ట్. వారి పదవ తరగతి భౌతిక, రసాయన శాస్త్ర పాఠ్యాంశ రచనకు జిల్లా నుండి ఎంపికైన ఏకైక ఉపాధ్యాయులు వీరు. [2]

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 2, 766 - పురుషుల సంఖ్య 1, 433 - స్త్రీల సంఖ్య 1, 333 - గృహాల సంఖ్య 638

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2, 374.[2] ఇందులో పురుషుల సంఖ్య 1, 230, మహిళల సంఖ్య 1, 144, గ్రామంలో నివాస గృహాలు 463 ఉన్నాయి.

సమీప గ్రామాలు

సమీప పట్టణాలు

మూలాలు

వెలుపలి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.