ఇంధనం
మండించినపుడు శక్తిని ఉత్పత్తి చేయు పదార్ధాన్ని ఇంధనం (ఆంగ్లం: Fuel) అని అంటారు. వాహనాలు నడవడానికి, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి, వంట చేయడానికి ఉపయోగపడును.

కలప, లేదా వంటచెరకు, ప్రపంచంలో అనేక యుగాలుగా మానవునిచే వుపయోగింపబడే ప్రాథమిక శక్తి వనరు.
ఇది రెండు రకాలు.
- కర్బన ఇంధనం
- అకర్బన ఇంధనం
కర్బన ఇంధనాలు
వీటినే ఆర్గానిక్ ఇంధనాలు ( Organic Compounds) అని కూడా అంటారు. ఇందులో కర్బన పదార్ధము ( Carbon Compound ) ఉండును. వీటిలో చాలా వరకు పెట్రోలియం ఉత్పత్తులే.
కర్బన ఇంధనాలకు ఉదాహరణలు :
- రాకాసి బొగ్గు- దీనిని బొగ్గు గనులు నుండి వెలికితీస్తారు. విద్యుత్ ఉత్పత్తి కోసం, రైలు నడవడం కోసం వాడతారు.
- కలప- వృక్షం యొక్క కాండపు భాగం. వంట చెరకుగా వాడతారు. పంచదార మిల్లులో చెరుకు పిప్పిను ఇంధనంగా వాడతారు.
- సాధారణ బొగ్గు- కట్టెను పాక్షికంగా కాల్చితే ఇది వస్తుంది.
- పెట్రోలు - దీనినే శిలాజ ఇంధనం అని కూడా అంటారు.
- డీసిల్
- కిరోసిన్
- నాఫ్తా
- ఏవియేషన్ టర్బైన్ ఫుయెల్ (Aviation Turbine Fuel ) (A.T.F)- విమానాలు, హెలికాప్టర్ లలో వాడతారు.
- వంట గ్యాస్- దీనిలో బ్యూటేన్ అనే వాయువు ఉండును.
- వెల్డింగ్ గ్యాస్- దీనిలో అసిటలీన్ అనే వాయువు ఉండును. లోహాలు అతికించడానికి వాడతారు.
- జీవ ఇంధనం (బయో డీసిల్)- మొక్కల నుండి తయారుఛేస్తారు.
- ఆల్కహాల్ (సారాయి)- ప్రయోగశాలలో రసాయనాలను వేడిచేయడానికి సారాయి దీపంలో ఊయోగిస్తారు.
- కర్పూరం- హిందువుల పూజలలో హారతిగా వాడతారు. తిరుపతి లడ్డులో ఇది ఒక ముఖ్యమైన పదార్ధము. పార్టీలలో వంటకాలను వేడిగా ఉంచుటకు వంట పాత్రల క్రింద మండుతున్న కర్పూరం ఉంచుతారు.
అకర్బన ఇంధనాలు
వీటిలో కార్బన పదార్థం (Carbon) ఉండదు.
అకర్బన ఇంధనాలకు ఉదాహరణలు :
- ఉదజని ( Hydrogen )- ఇది కూడా ఇంధనమే. ఇది మండినపుడు పెద్దమొత్తంలో శక్తి వెలువడుతుంది. అంతరిక్ష నౌక (రాకెట్) లో వాడతారు.
- కొన్ని రకాల బ్యాటరీ ( Fuel Cell ) లలో వాడతారు.
బాయిలరులలో నీటిని ఆవిరిగా మార్చుటకు ఇంధనాలనువాడెదరు.బాయిలర్లలో పలురకాలు కలవు ఓడల్లో ఎక్కువగాకొక్రేన్ బాయిలరును ఉపయోగిస్తారు.అలాగే లాంకషైర్ బాయిలరులోకూడా బొగ్గును ఇంధనంగా ఉపయోగిస్తారు.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.