ఇంద్రావతి నది
ఇంద్రావతి నది (ఆంగ్లం: Indravati River) గోదావరి ఉపనది. ఇది తూర్పు కనుమలలో పుట్టి, గోదావరి కలసిపోతుంది. ఈ నది మహారాష్ట్ర మరియు చత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు సరిహద్దుగా ఉంది.
ప్రఖ్యాతిచెందిన చిత్రకూట జలపాతం ఇంద్రావతి నది మీద జగదల్ పూర్ నుండి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈ నది చాలావరకు దట్టమైన అడవుల మధ్యగా ప్రవహిస్తుంది. ఇంద్రావతి నదిని బస్తర్ జిల్లా ప్రాణదాత అని పిలుస్తారు. ఇంద్రావతి జాతీయ వనం ఈ నదీ తీరంలో ఉంది.
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.


