ఇంటర్నెట్ మూవీ డేటాబేసు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు వీడియోలకి సంబంధించిన ఒక ప్రముఖ వెబ్ సైటు. ఇది సినిమాలు, TV షోలు, నటులు, సాంకేతిక నిపుణుల వివరాలతో కూడిన అతి పెద్ద ఆన్ లైన్ సమాచార నిధి (డేటాబేసు). ఇది ప్రస్తుతం Amazon.com సంస్థ ఆధ్వర్వంలో నడుస్తుంది.

ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (IMDb)
వెబ్ చిరునామాimdb.com
వాణిజ్యపరమా?Yes
రకంOnline database for movies, television, and video games
నమోదుRegistration is optional for members to participate in discussions, comments, ratings, and voting.
దొరకు భాష(లు)English
యజమానిAmazon.com
Created byCol Needham (CEO)
ప్రారంభంఅక్టోబరు 17, 1990 (1990-10-17)
Alexa rank 45 (January 2014)[1]
ప్రస్తుత స్థితిActive

దీనిని 1990 లో కోల్ నీధమ్ అనే కంప్యూటరు ప్రోగ్రామరు రూపొందించాడు. దీనిని 1996 లో Internet Movie Database Ltd అనే పేరుతో యూకేలో రిజిష్టరు చేశారు. దీనికి ప్రకటనల రూపంలో, లైసెన్సింగ్ రూపంలోనూ, భాగస్వామ్య రూపంలోనూ ఆదాయం సమకూరేది. 1998 లో ఇది అమెజాన్.కామ్ కి ఉప కంపెనీగా మారింది. వారు దీనిలో సినిమా డీవీడీలు, వీడియో టేపుల ప్రకటనలు చూపించి వారి అమ్మకాలు పెంచుకున్నారు.

జూన్ 2016 నాటికి ఈ వెబ్ సైటులో సుమారు 37 లక్షల వీడియోల సమాచారం, 7౦ లక్షల మంది సెలబ్రిటీల సమాచారం ఉంది. 67 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు.[2] ఈ వెబ్సైటులో నమోదయిన వారు కొత్త సమాచారం చేర్చడం కోసం, ఉన్న సమాచారం మార్చడం కోసం అభ్యర్థన పంపవచ్చు. ఇందులో సమాచారం ప్రచురించే ముందే పరీక్షించినా అప్పుడప్పడు దోషాలు దొర్లుతుంటాయి. నమోదయిన సభ్యులు ఏదైనీ సినిమాకు ఒకటి నుండి పది మధ్యలో రేటింగు ఇవ్వవచ్చు. ఇలా సేకరించిన రేటింగుల సగటును సదరు వీడియో పక్కనే చూపిస్తారు. ఎవరైనా ఏదైనా సినిమాకు విపరీతంగా దొంగ ఓట్లు వేసినా పసిగట్టగల సామర్థ్యం దీనికుంది. సభ్యులు తమకు నచ్చిన సినిమాల గురించి చర్చించుకునేందుకు మెసేజ్ బోర్డులు కూడా ఉన్నాయి.

మూలాలు

  1. "Imdb.com Site Info". Alexa Internet. Retrieved 2014-01-02.
  2. "Stats". IMDb.

బయటి లంకెలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.