ఆళ్వార్‌తిరునగరి

ఆళ్వార్‌తిరునగరి భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

ఆళ్వార్‌తిరునగరి
Lua error in మాడ్యూల్:Location_map at line 418: No value was provided for longitude.
Location within Tamil Nadu
ప్రదేశము
దేశము: భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం: ఆదినాథ పెరుమాళ్(పాలిందునిన్ఱ పిరాన్)
ప్రధాన దేవత: ఆదినాథ వల్లి
దిశ మరియు స్థానం: తూర్పు ముఖము
పుష్కరిణి: తామ్ర పర్ణీనది
విమానం: గోవింద విమానము
కవులు: నమ్మాళ్వార్
ప్రత్యక్షం: నమ్మాళ్వార్లకు

విశేషాలు

ఈక్షేత్రమునకు"ఉఱైకోయిల్" (సర్వేశ్వరుడు నిత్య నివాసము ఉంటున్న) దివ్యదేశము. నమ్మాళ్వార్లు ఈ స్వామి మహత్యాన్ని ప్రకాశింపజేసాడు. (తిరువాయిమొళి 4-10)

ఈ దివ్యదేశమునకు 1.కి.మీ దూరములో నమ్మాళ్వార్ల జన్మస్థానం ఉంది. "అప్పన్ కోయిల్" అను గ్రామము ఉంది. ఈ క్షేత్రమునకు సమీపముననే నవ తిరుపతులు ఉన్నాయి. ఆళ్వారు తిరునగరి యను అష్టాక్షరీ మంత్రరూప పద్మమునకు యెనిమిది అక్షరములనెడి యెనిమిది పద్మదళములవలె యెనిమిది దివ్యదేశములు అమరియున్నవి. ఈక్షేత్ర సమాచరం సంగ్రహశ్లోక రూపంలో ఉంది.

ఇచట స్వామి స్వయం వ్యక్తము. పెద్దతిరుమేనితో వేంచేసి యున్నారు. స్వామి శ్రీపాదములు భూమిలో నున్నవని ఐతిహ్యము.

ఇంద్రుడు పితరులను పూజించనందున పితరుల శాపం పొందాడు. తరువాత ఇంద్రుడు ఈ స్థలమునకు వచ్చి ఆధినాథ పెరుమాళ్లను సేవించి శాపవిముక్తిని బొందెనని స్థలపురాణము.

"సర్వేశ్వరుని పరత్వమును తెలిసికొన లేక సంసారులు నశించి పోరాదు" అను ఔదార్యముతో ఆళ్వార్లు "ఒన్ఱుమ్‌ తేవుమ్‌" అను దశకమును ఉపదేశించి సర్వేశ్వరుడే సమస్త కారణభూతుడు అని పరత్త్వమును ప్రకటించి, అతడు మన కొరకే తిరుక్కురుగూర్ అను దివ్యదేశమున (తిరుక్కురు గూర్ అదనుళ్‌నిన్ఱ) వేంచేసియున్నాడు. అని సర్వేశ్వరుని "పరత్త్వ సౌలభ్యములు" అనుగుణములను ఆళ్వారులు ప్రకటించారు.

సాహిత్యం

శ్లో. భాతి శ్రీ కురుకాపురే పురవరే శ్రీ తామ్రపర్ణీ నదీ
  తీరస్థే సురదిజ్ముఖ స్థ్పితిరసౌ గోవింద వైమానగ:|
  దేవ్యా సంతత మాదినాధలతయా యుక్త శ్శఠ ద్వేషిణాం
  దృష్టాస్తత్త్యవ లోలుపో నవరతం దేవాధినాథ ప్రభు:||

పాశురాలు

పా. ఒన్ఱున్తేవు ములగు ముయిరుమ్‌; మత్‌త్తుమ్‌ యాదుమిల్లా
  అన్ఱు;వాన్ముగన్ఱన్నొడు తేవరులకోడు యిర్ పడైత్తాన్
  కున్ఱమ్పోల్ మణిమాడ నీడు తిరుక్కురుగూరదనుళ్
  నిన్ఱ వాదిప్పిరాన్ నిఱ్క మత్‌త్తై తై య్‌వమ్‌ నాడుదిరే||

పా' ఇలిజ్గత్తిట్ట పురాణత్తీరుమ్‌ శమణరుమ్‌ శాక్కియరుమ్‌
  వలిన్దు వాదు శెయ్ వీర్గళుమ్ మற்றுమ్ నున్దెయ్‌వము మాగినిన్ఱాన్
  మలిన్దు శెన్నెల్ కవరివీశుం తిరుక్కురుగూరదునుళ్
  పొలిన్దు నిన్ఱ పిరాన్ కణ్ణిర్ ఒన్ఱుమ్పెయిల్లై పోత్తుమినే.

  ఓడియోడి ప్పలపిఱప్పుమ్పిఱన్దు, మறறோర్‌తెయ్‌వమ్‌
  పాడియాడిప్పణిన్దు పల్ పడికాల్ వ ழி యేఱి కాణ్డీర్
  కూడివాన పరేత్తనిన్ఱ తిరుక్కురుగూరదనుళ్,
  ఆడుపుట్కొడి యాది మూర్తి క్కడిమై పుగువదువే.
  నమ్మాళ్వార్-తిరువాయిమొழி 4-10-1,5,7

1. వైకుంఠ నాథ 2. విజయాసన 3. భూమిపాలన్
4. దేవేశ 5. సజ్కజి విలోచన 6. చోరనాట్యన్
7. నిక్షిప్తవిత్త 8. మకరాయత కర్ణపాశౌ
9. నాథం నమామి వకుళాభరణేన సార్థం.

అర్ధం

ఈ తిరునగరిలో నిర్ణిద్ర తింత్రిణి (నిద్రపోని చింతచెట్టు) ఉంది. ఇది ఆదశేషుల యవతారమని పెద్దలు చెప్పుదురు. ఈ వృక్షము క్రిందినే నమ్మాళ్వార్లు యోగనిష్ఠలో ప్రతిష్ఠితమై ఉన్నాడు. ఇచట జ్ఞానప్పిరాన్ అనే వరాహ పెరుమాళ్ సన్నిధి ఉంది. ఈ క్షేత్రము మణవాళ మహామునులచే వర్ణించబడింది. ఇక్కడ మేషమాసంలో ఉత్తర తీర్థోత్సవము. వృషభం మాసంలో నమ్మాళ్వార్ల నక్షత్రం విశాఖ రోజు ఉత్సవమున నమ్మాళ్వార్ హంసవాహనముపై నవ తిరుపతుల పెరుమాళ్లు కొలువుతీరుట.

వివరాలు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
ఆదినాథ పెరుమాళ్ (పాలిందునిన్ఱ పిరాన్) ఆదినాథ వల్లి తామ్ర పర్ణీనది తూర్పు ముఖము నిలచున్న నమ్మాళ్వార్ గోవింద విమానము నమ్మాళ్వార్లకు ప్రత్యక్షము

చేరే మార్గం

తిరునల్వేలి నుండి తిరుచ్చందూర్ రైలుమార్గం. ఆళ్వార్ తిరునగరిస్టేషన్ శ్రీవైకుంఠ స్టేషన్ నుండి 5 కి.మీ.

చిత్రమాలిక

ఇవికూడా చూడండి

మూలాలు

    వెలుపలి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.