ఆలకూరపాడు
ఆలకూరపాడు, ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలానికి చెందిన గ్రామము.[1]
| ఆలకూరపాడు | |
| — రెవిన్యూ గ్రామం — | |
![]() ఆలకూరపాడు |
|
| అక్షాంశరేఖాంశాలు: 15.357267°N 80.067462°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | ప్రకాశం జిల్లా |
| మండలం | టంగుటూరు |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 523286 |
| ఎస్.టి.డి కోడ్ | 08592 |
Disambiguation
సమీప గ్రామాలు
కొణిజేడు 14 కి.మీ, ఈతముక్కల 3.6 కి.మీ, మడనూరు 4 కి.మీ, పొందూరు 4.2 కి.మీ, మర్లపాడు 5.5 కి.మీ.
సమీప పట్టణాలు
టంగుటూరు 3.5 కి.మీ, జరుగుమిల్లి 9.7 కి.మీ, సింగరాయకొండ 12.8 కి.మీ, కొత్తపట్నం 13.2 కి.మీ.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
- జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
- మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
- ఈ గ్రామానికి చెందిన శ్రీ నార్నె శ్రీనివాసులు, ఈ గ్రామములోనే చదువుకొని అనంతరం పైచదులు చదువుకొని విదేశాలలో ఉంటున్నారు. అయినా తన కన్న ఊరునూ, చదువునేర్పించిన బడినీ మరచిపోకుండా, 5 సంవత్సరాలనుండి, పాఠశాల అభివృద్ధికి పాటుపడుచున్నారు. పాఠశాలలో శుద్ధిజల కేంద్రాన్ని ఏర్పాటుచేసారు. ప్రతి సంవత్సరం 10వ తరగతిలో అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థికి ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేయడమే గాకుండా, ఆ విద్యార్థికి ఇంటరులో అయ్యే ఖర్చును గూడా తనే భరించుచున్నారు. రెండు, మూడు స్థానాలలో వచ్చిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదుబహుమతులందించుచున్నారు. తరగతి గదులకు మరమ్మత్తులు గూడా చేయించుచున్నారు. ఉపాధ్యాయులను నియమించి, వారికి జీత, భత్యాలను గూడా అందజేయుచున్నారు. [3]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
శ్రీ షిర్డీసాయిబాబా మందిరం:- ఈ మందిరం, ప్రథమ వార్షికోత్సవం, 2913 నవంబరు 28&29 తేదీలలో జరుగును. [2]
మూలాలు
వెలుపలి లంకెలు
[2] ఈనాడు ప్రకాశం; 2013,నవంబరు-28; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2015,ఆగస్టు-17; 8వపేజీ.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
