ఆర్.ఎన్.సుదర్శన్

రట్టి నాగేంద్ర సుదర్శన్ (2 మే1939 – 8 సెప్టెంబరు 2017) భారతీయ సినిమా నటుడు మరియు నిర్మాత. ఆయన ప్రధానంగా కన్నడ సినిమాలలో తన సేవలనందించారు. ఆయన తమిళం, హిందీ, తెలుగు మరియు మలయాళ సినిమాలలో కూడా నటించాడు. [1] ఆయన మూడు దశాబ్దాలకు పైగా తన సినీ జీవితాన్ని కొనసాగించారు. ఆయన 250 లకు పైగా చిత్రాలలో వివిధ పాత్రలలో నటించారు. [2]

ఆర్.ఎన్.సుదర్శన్
జననంరట్టిహల్లి నాగేంద్ర సుదర్శన్
(1939-05-02) 1939 మే 2
కర్నాటక బ్రిటిష్ ఇండియా.
మరణం2017 సెప్టెంబరు 8 (2017-09-08)(వయసు 78)
బెంగళూరు, కర్ణాటక
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు, గాయకుడు, సినిమా దర్శకుడు
క్రియాశీలక సంవత్సరాలు1961–2017
జీవిత భాగస్వామిశైలశ్రీ
పిల్లలుఆర్. అరుణ్ కుమార్
తల్లిదండ్రులుఆర్.నాగేంద్రరావు
రత్నాబాయి
కుటుంబంఆర్.ఎన్.కృష్ణప్రసాద్ (సోదరుడు)
ఆర్.ఎన్.జయగోపాల్ (సోదరుడు)

వ్యక్తిగత జీవితం

ఆయన ప్రముఖ సినిమ దర్శకుడైన ఆర్. నాగేంద్రరావు కుమారుడు. ఆయన సోదరులలో ఆర్.ఎన్.జయగోపాల్ (మరణం.2005) ప్రముఖ సినీ గీత రచయిత మరియు ఆర్.ఎన్.ప్రసాద్ (మరణం.2008) ప్రముఖ సినిమాటోగ్రాఫర్. ఆయన భార్య "శైలశ్రీ". [3]

జీవితం

1961లో ఆయన తన 21వ యేట కన్నడ చిత్రంలో నటునిగా రంగప్రవేశం చేసారు. ఆయన తొలి చిత్రం "విజయనగర వీరపుత్ర". ఆయన సినిమాలలో ప్రతినాయకుని పాత్రలలో నటించడానికి పూర్వమే 60 సినిమాలలో వివిధ పాత్రలలో నటించారు. [4]

ఆయన ప్రస్తుతం కన్నడం లోని "అగ్నిశశి" డైలీ సీరియల్ లో నటిస్తున్నారు.

ఆయన కొన్ని చిత్రాలలో పాటలను కూడా పాడారు.

మరణం

ఆయన కొద్దికాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సెప్టెంబరు 8 2017 న మరణించాడు.[5]

మూలాలు

ఇతర లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.