ఆరుద్ర నక్షత్రము

ఆరుద్ర నక్షత్రములలో ఆరవ నక్షత్రం. ఇది పరమశివుని జన్మ నక్షత్రం.

నక్షత్రంఅధిపతిగణముజాతిజంతువువృక్షమునాడిపక్షిఅధిదేవతరాశి
ఆరుద్రరాహువుమానవస్త్రీశునకమురేలఆదినాడిపింగళరుద్రుడుమిధునము
నక్షత్రములు
అశ్వని నక్షత్రము
భరణి నక్షత్రము
కృత్తిక నక్షత్రము
రోహిణి నక్షత్రము
మృగశిర నక్షత్రము
ఆరుద్ర నక్షత్రము
పునర్వసు నక్షత్రము
పుష్యమి నక్షత్రము
ఆశ్లేష నక్షత్రము
మఖ నక్షత్రము
పుబ్బ నక్షత్రము
ఉత్తర ఫల్గుణి నక్షత్రము
హస్త నక్షత్రము
చిత్త నక్షత్రము
స్వాతి నక్షత్రము
విశాఖ నక్షత్రము
అనూరాధ నక్షత్రము
జ్యేష్ట నక్షత్రము
మూల నక్షత్రము
పూర్వాషాఢ నక్షత్రము
ఉత్తరాషాఢ నక్షత్రము
శ్రవణ నక్షత్రము
ధనిష్ఠ నక్షత్రము
శతభిష నక్షత్రము
పూర్వాభాద్ర నక్షత్రము
ఉత్తరాభాద్ర నక్షత్రము
రేవతి నక్షత్రము

Disambiguation

అరుద్ర నక్షత్ర జాతకుల తారా ఫలాలు

తార నామంతారలుఫలం
జన్మ తారఆర్ద్ర, స్వాతి, శతభిషశరీరశ్రమ
సంపత్తారపునర్వసు, విశాఖ, పూర్వాభద్రధన లాభం
విపత్తారపుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్రకార్యహాని
సంపత్తారఆశ్లేష, జ్యేష్ట, రేవతిక్షేమం
ప్రత్యక్ తారఅశ్విని, మఖ, మూలప్రయత్న భంగం
సాధన తారభరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢకార్య సిద్ధి, శుభం
నైత్య తారకృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢబంధనం
మిత్ర తారరోహిణి, హస్త, శ్రవణంసుఖం
అతిమిత్ర తారమృగశిర, చిత్త, ధనిష్టసుఖం, లాభం

ఆరుద్ర నక్షత్రము నవాంశ

  • 1 వ పాదము -మిధునరాశి.
  • 2 వ పాదము - కన్యారాశి.
  • 3 వ పాదము - తులారాశి.
  • 4 వ పాదము - వృశ్చికరాశి.

ఆరుద్ర నక్షత్రమునందు పుట్టిన వారి యొక్క నైజము,తీఱు-తెన్నులు

ఈ నక్షత్రములో జన్మించిన వారు మాటలాడుటలో నేఱ్పరితనమును, మించిన జ్ఞాపక శక్తియు కలిఁగియుండెదరు, గొప్ప గమ్మత్తుఁగా మాట్లాడఁగలరు. వ్యాపార పరమైన నైపుణ్యము ఉంటుంది. పలు రంగాలలో పరిచయము ఉంటుంది. ఇతరుల అభివృద్ధికి ఇటుక రాళ్ళవలె సహాయపడతారు. ఎన్ని సార్లు జారిపడినా పట్టు వదలక ఉన్నత స్థితికి వస్తారు. కీర్తియోగము వీరిని ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. డబ్బులకు చెందునట్టి నిర్ణయాలను సరిగా చేయలేరు. తప్పుడు సలహాలు, శక్తిసామర్ధ్యాలు, పగ తీఱ్చుకోవాలనెడి కోరిక, మొండి పట్టుదల జీవితములో ఒడిదుదుకులకు దారి తీయ వచ్చును. తొందఱపాటుతో ముందు-వెనుక మంచి-చెడు అనేవి చూడకుండనే నిర్ణయాలను వెంతనే అమలు పరుస్తారు. అవమానాన్ని ఓర్చుకొన లేరు. లౌక్యము తెలివితేఁటలు కనబఱఁచుతారు. తల్లిఁదండ్రులు, తోడఁబుట్టువుల మీద గొప్ప ప్రేమను కలిఁగియుంటారు. రాత్రి పూఁట నిర్ణయాలు తీసుకుంటారు. మొదట తనలోతాను అందఱిలో తక్కువ అని పదేపదే అనుకొనవలసి వచ్చిన కూడను ఆ తరువాత అధిక్యతా భావములోకి మారి పోతారు. నిండు నూఱేండ్లు బ్రతికెదరు సంపూర్ణ ఆయుర్ధాయము కలిగి ఉంటారు. ఆడవారిపట్ల గౌరవ భావము కలిగి ఉంటారు. మూకలని నమ్మించ కలిగిన ఆకట్టుకొనఁగలిగిన శక్తిని వీరు కలిగి ఉంటారు. ఎంత మంది వీడి వెళ్ళినా ఎనలేని శక్తి సామర్ధ్యాలతో మఱల వీరు ఉన్నత స్థాయి సాధిస్తారు. వీరి వీరి బ్రతుకులలో ఏభై రెండు నుండి అరవై ఆరు సంవత్సరాల వరకు చిక్కులు తక్కువగానే ఉంటాయి.

బొమ్మల పేర్పు

చిత్ర మాలిక

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.