ఆరిజోనా
ఆరిజోనా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్రం అమెరికా దేశానికి నైఋతి దిక్కున ఉన్నది. ఈ రాష్ట్రం ఎడారి ప్రదేశాలకు, అతి తీవ్రమయిన వేసవికి, మధ్యస్థమైన చల్లదనం కలిగిన శీతకాలానికి ప్రసిద్ధికెక్కింది. ఈ రాష్ట్రానికి న్యూమెక్సికో, యూటా, నెవాడా, కాలిఫోర్నియా, కొలరాడో రాష్ట్రాలు సరిహద్దులు. ఈ రాష్ట్రానికి మెక్సికోలోని సొనోరా, బాజా కాలిఫోర్నియా అంతర్జాతీయ సరిహద్దులు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గ్రాండ్ కాన్యన్ లోయ, అనేకమయిన అడవులు, స్మారక స్థూపాలు, రెడ్ ఇండియన్ ల ఆవాసాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి.


This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
