ఆరవల్లి
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో ఆరవల్లి జిల్లా (గుజరాతీ : અરવલ્લી જીલ્લો) ఒకటి. మొదస పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2013 ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం ప్రకటించిన 7 జిల్లాలలో ఇది ఒకటి.[2]
| Aravalli District અરવલ્લી જીલ્લો | |
|---|---|
| District | |
| Headquarters | Modasa |
| పేరు పెట్టబడినది | Aravalli Hills |
| జనాభా (2013) | |
| • మొత్తం | 1.024[1] |
పేరువెనుక చరిత్ర
గుజరాత్ మరియు రాజస్థాన్ ఆరవల్లి పర్వతావళి జిల్లాలో ఉన్న కారణం జిల్లాకు ఈ పేరు వచ్చింది. .[3] గుజరాత్ ప్రభుత్వ రికార్డులు ఆరవల్లి పర్వతావళిలోని అరసూర్ శాఖ జిల్లాలోని దంతా, మొదస మరియు శ్యామల్జీ తాలూకాలలో ఉందని తెలియజేస్తున్నాయి.[4]
చరిత్ర
2013లో గుజరాత్ ప్రభుత్వం అంగీకారం పొందిన 7 జిల్లాలలో ఇది ఒకటి.[5] జిల్లాలో దీర్ఘకాలంగా గిరిజన ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. 2012లో గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించిన తరువాత అప్పిటి అధికారంలో ఉన్న " భారతీయజనతా పార్టీ " 7 కొత్త జిల్లాల ఏర్పాటును ప్రతిపాదించింది.[6]
భౌగోళికం
బనస్ కాంతా జిల్లాలోని మొదస, మల్పుర్, ధన్సుర, మెఘరాజ్, భిలోద మరియు భయద్ తాలూకాలను వేరు చేసి ఆరవల్లి జిల్లా రూపొందించబడింది. [1]
గణాంకాలు
జిల్లాలోని మెఘరాజ్, మల్పూర్ మరియు భిలోడా తాలూకాలలో గిరిజన ప్రజలు అధికంగా నివసిస్తున్నారు.[4] జిల్లాలో 676 గ్రామాలు, 306 గ్ర్రమపంచాయితీలు ఉన్నాయి. జిల్లా జనసంఖ్య 1,27 మిలియన్లు. గుజరాత్ రాష్ట్రంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లాగా ఆరవల్లి జిల్లా గుర్తించబడుతుంది.[1]
పర్యాటక ఆకర్షణలు
జిల్లాలో పలు బౌద్ధ అవశేషాలు మరియు శ్యామల్జీ వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి.[1]
ఆర్ధికం
ఆరవల్లి జిల్లాలో 500 మె.వా విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగిన ప్రైవేట్ రంగానికి చెందిన మొదటి " సోలార్ పవర్ ప్లాంట్ " ఉంది.[1] జిల్లా పారిశ్రామికంగా వెనుకబడి ఉంది. జిల్లాలో పెద్ద పరిశ్రమలు ఏమీ లేనప్పటికీ మొదసా, భిలోడా మరియు ధంసురా తాలూకాలలో చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా మజుం నది ప్రవహిస్తుంది. మజుం నది మీద రెండు ఆనకట్టలు నుర్మించబడ్డాయి.[4]
మూలాలు
- Dave, Kapil (August 25, 2013). "Dignity of PM office has reached its nadir: Modi". The Times of India. Retrieved 26 August 2013.
- "Aravalli now a district in Gujarat". DNA. 18 September 2012. Retrieved 23 February 2013.
- "Narendra Modi packs in a new dist, Nitin Gadkari hopes for 'Gujarat-like govt' in Delhi". The Indian Express. 18 September 2012. Retrieved 23 February 2013.
- "Namesake of oldest mountain, Aravalli scores nil in industry". The Indian Express. 2 September 2013. Retrieved 23 September 2013.
- "Seven new districts to be formed in Gujarat". Daily Bhaskar. January 24, 2013. Retrieved 23 February 2013.
- "Aravali to be Gujarat's 29th district". Times of India. September 17, 2012. Retrieved 23 February 2013.
