ఆమ్ ఆద్మీ పార్టీ
ఆమ్ ఆద్మీ పార్టీ 2012 నవంబర్ 26 న సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రివాల్ చేత స్థాపించబడిన ఒక భారతీయ రాజకీయ పార్టీ. అవినీతికి వ్యతిరేకంగా జనలోక్ పాల్ బిల్లు కోసం జరిగిన ప్రజాపోరాటం నుంచి పుట్టిన పార్టీ. ఈ పోరాటాన్ని కేజ్రివాల్ రాజకీయ పార్టీగా కొనసాగించాలిని ప్రతిపాదించగా, ఈ పోరాటానికి నాయకత్వం వహించిన అన్నా హజారే వ్యతిరేకించారు. పార్టీ స్థాపించిన వెంటనే ఢిల్లీలో విద్యుత్ మరియు నీటి ధరలపై పోరాటాలు చేసారు. మహిళలపై అగాయత్యాలపై ప్రత్యేక చట్టం కోసం పోరాటాలు చేసారు.[2][3][4] పార్టీ పాల్గొన్న మొదటి ఎన్నికలు 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలు. ఈ ఎన్నికలలో పార్టీ మొత్తం 70 సీట్లలో 28 సీట్లు సాధించి రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 8 సీట్లు సాధించిన కాంగ్రెస్ బయటి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో కనీవిని ఎరుగని రీతిలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో మొత్తం 70 శాసనసభ స్థానాల్లో 67 సీట్లను సాధించి తిరిగి అధికారంలోకి వచ్చింది.[5]
| ఆమ్ ఆద్మీ పార్టీ | |
|---|---|
![]() | |
| నాయకుడు | అరవింద్ కేజ్రివాల్ |
| స్థాపన | నవంబర్ 26, 2012 |
| ప్రధాన కార్యాలయం | గ్రౌండ్ ఫ్లోర్, A-119, కుశామ్భి,ఘాజియాబాద్ -201010 |
| సిద్ధాంతం | స్వరాజ్యం[1] |
| రంగు | |
| ఢిల్లీ అసెంబ్లీ | 67 / 70 |
| లోక్ సభ | 4 / 545 |
| ఓటు గుర్తు | |
| వెబ్ సిటు | |
| www | |
చరిత్ర
సిద్దాంతాలు
పోరాటాలు
ఎన్నికలు
ఢిల్లీ శాసనసభ ఎన్నికలు 2013
ఢిల్లీ 2013 శాసనసభ ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీ పాల్గొనిన ప్రథమ ఎన్నికలు. ఎన్నికల కమిషన్ నుంచి పొందిన "చీపురు కట్ట" గుర్తు పై పోటిచేసారు. ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక హామీలు ప్రకటించారు. ఈ ఎన్నికలలో 70 సీట్లకు గాను 28 సీట్లు సాధించి సంచలనం సృష్టించారు. 32 స్థానాలు సాధించిన బిజెపి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు నిరాకరించటంతో, లెఫ్టినెంట్ గవర్నర్ పిలుపు మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజాభిప్రాయ సేకరణ తరువాత ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. 8 స్థానాలున్న కాంగ్రెస్ పార్టీ బయటి నుంచి మద్దతు ఇచ్చింది.
సాధారణ ఎన్నికలు 2014
2014 లోక్ సభ ఎన్నికలలో పార్టీ పలు రాష్రాలలో 300 పైగా సీట్లలో పోటిచేయాలని నిర్ణయించింది. [6][7][8] ఆమ్ ఆద్మీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో 443 స్థానాల్లో పోటీ చేసి 4 స్థానాల్లో గెలుపు సాధించింది.[9]
ఢిల్లీ శాసనసభ ఎన్నికలు 2015
కనీవిని ఎరుగని రీతిలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం దక్కించుకుంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మొత్తం 70 శాసనసభ స్థానాల్లో 67 సీట్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. 2013 శాసనసభ ఎన్నికలతో పోల్చుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ తన ఓటు బ్యాంకును భారీగా పెంచుకుంది. గత ఎన్నికల్లో ఆ పార్టీకి 29.5 శాతం ఓట్లు పోలవగా ఈసారి అనూహ్యంగా 54.3 శాతానికి పెరిగింది.[5]
మూలాలు, వనరులు
- http://www.aamaadmiparty.org/page/goal-of-swaraj
- PTI (19 May 2013). "AAP workers protest at residences of Delhi CM, MLAs". Times of India. New Delhi.
- "Delhi police arrests driver on rape charge after AAP activists protest". India Tv News channel. New Delhi. 24 May 2013.
- "Promise to Keep". Frontline Magzine. 15–28 Dec. 2012. p. Volume 29. Retrieved 3 August 2012. Check date values in:
|date=(help) - http://www.prajasakti.com/index.php?srv=10301&id=1289576
- "AAP gears for Lok Sabha polls, to contest all seats in Gujarat, Haryana". Indian Express Portal. 5 January 2014.
- "AAP to contest all Lok Sabha seats in Maharashtra: Anjali Damania". 8 January 2014.
- "AAP to contest all 39 Lok Sabha seats in Tamil Nadu". 19 January 2014.
- http://www.andhraprabha.com/elections/news-analysis/it-was-a-good-start;-could-have-done-better-in-delhi-kejriwal/17411.html
ఇవికూడా చూడండి
- భారతదేశ రాజకీయ పార్టీల జాబితా
- భారత రాజకీయాలు
- అరవింద్ కేజ్రివాల్
బయటి లింకులు
| Wikimedia Commons has media related to Aam Aadmi Party. |
