ఆనకట్ట
ఆనకట్టలు (Dams) నదులకు అడ్డంగా నిర్మించిన కట్టడాలు. పెద్ద ఆనకట్టలు బహుళార్ధసాధకములైనవి. చిన్న ఆనకట్టలు నీటిని నిలువచేయడానికి ఉపయోగపడతాయి.కొన్ని ఆనకట్టలు వరద నీరు ఒక ప్రాంతం వైపు పారకుండా నిరోధించేందుకు కూడా నిర్మిస్తారు.
ఆనకట్ట
చరిత్ర
మొట్టమొదటి ఆనకట్ట మెసపుటోమియా కాలంలోనే నిర్మించినట్లు ఆధారాలున్నాయి. వారు టైగ్రిస్, మరియు యూఫ్రటీస్ నదుల నీటిమట్టాన్ని అదుపులో ఉంచడానికి దానిని నిర్మించారు. ఇంకొక పురాతనమైన ఆనకట్ట జోర్డాన్ దేశంలో ఉంది. ప్రపంచంలో అత్యంత పురాతనమైన, ఇప్పటికీ నిలిచిఉన్న ఆనకట్ట సిరియా దేశంలో ఉంది.
రకాలు
ఈ ఆనకట్టలను మానవులు నిర్మించవచ్చు లేదా సహజ సిద్ధంగా కూడా ఏర్పడవచ్చు. మానవ నిర్మితమైన ఆనకట్టలను వాటి ఎత్తును బట్టి లేదా వాటి అవసరాన్ని బట్టి వివిధ తరగతులుగా వర్గీకరించవచ్చు.
ఉపయోగాలు
- పంటలకు కాలువల ద్వారా నీటి సరఫరా చేయడం.
- పట్టణాలలోని ప్రజలకు త్రాగునీరు సరఫరా చేయడం.
- విద్యుత్తును ఉత్పత్తి చేయడం.
- అధిక వర్షపాతం వలన కలిగే వరదలను నివారించడం.
బహుళార్ధ సాధక ప్రాజెక్టులు
ఇవి కూడా చూడండి
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
