ఆగష్టు 19
ఆగష్టు 19, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 231వ రోజు (లీపు సంవత్సరములో 232వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 134 రోజులు మిగిలినవి.
| << | ఆగస్టు | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | ||||
| 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
| 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
| 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
| 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
| 2019 | ||||||
సంఘటనలు
- 1944: రెండవ ప్రపంచ యుద్ధము: పారిస్ విమోచన. మిత్రదళాల సహాయంతో, జర్మనీ ఆక్రమణ నుంచి పారిస్ కి విమోచనం కలిగింది.
- 1956: కడిదల్ మంజప్ప కర్ణాటక రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం. ( 1956 ఆగష్టు 19 నుంచి 1956 అక్టోబరు 31 వరకు)
- 1960: స్పుత్నిక్ ప్రోగ్రాం : స్పుత్నిక్ 5 ని సోవియట్ యూనియన్ రోదసి లోకి పంపింది. అందులో, బెల్కా, స్త్రెల్కా (కుక్కల పేర్లు), 40 చుంచులు, 2 ఎలుకలు మరికొన్ని రకాల మొక్కలు ఉన్నాయి.
- 2007: ఆంధ్ర ప్రదేశ్ గవర్నరు గా నారాయణదత్ తివారీ నియమితుడయ్యాడు.
- 2011: ప్రణాళికా సంఘం, ఏప్రిల్ 2012 నుంచి మొదలయ్యే, 12వ పంచవర్షప్రణాళిక లక్ష్యము 9 శాతం అభివృద్ధిగా పెట్టుకున్నట్లు ప్రణాళికా సంఘం ఉపాద్యక్షుడు ప్రకటించాడు. వ్యవసాయం అభివృద్ధి లక్ష్యం 4 శాతం అని చెప్పాడు. 11వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయరంగం లక్ష్యం 4 శాతమైనా, ఆ లక్ష్యాన్ని చేరలేకపోయామని, అయినా, వ్యవసాయరంగం మెరుగు గానే ఉంది అని చెప్పాడు.
- 2011: దేశీయ పరిఙ్ఞానంతో తయారైన స్టెల్త్ (శత్రువుల రాడార్ కు ఆచూకీ దొరకని) యుద్ధనౌక ఐ.ఎన్.ఎస్. సాత్పుర శనివారం, భారత నౌకాదళంలో చేరింది. శివాలిక్ తరగతి కింద నిర్మిస్తున్న ఫ్రిగేట్ యుద్ధనౌకల్లో సాత్పుర రెండవది. ఐ.ఎన్.ఎస్.శివాలిక్ మొదటి యుద్ధనౌక. చూడు
జననాలు

Shankar Dayal Sharma 36
- 1918: శంకర్ దయాళ్ శర్మ, భారత మాజీ రాష్ట్రపతి. (మ.1999)
- 1923: కొత్తపల్లి పున్నయ్య, న్యాయవాది, రాజకీయ నాయకుడు, కవి.
- 1925: అట్లూరి పుండరీకాక్షయ్య, తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు నటుడు. (మ.2012)
- 1946: బిల్ క్లింటన్, అమెరికా మాజీ (42వ) అధ్యక్షుడు.
మరణాలు
- 0014: ఆగస్టస్, రోమన్ చక్రవర్తి మరణించాడు (జ.63 బి.సి) ఇతని పేరున, ఆగష్టు నెల ఏర్పడింది.
- 1662: బ్లేజ్ పాస్కల్, పాస్కల్ సూత్రం కనిపెట్టిన శాస్త్రవేత్త. (జ.1623)
- 1994: లీనుస్ పాలింగ్, అమెరికా రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1901)
- 2015: పడాల బాలకోటయ్య, ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు, న్యాయనిర్ణేత. (జ.1937)
పండుగలు మరియు జాతీయ దినాలు
- ప్రపంచ మానవత్వపు దినము (ప్రపంచ వ్యాప్తంగా)
- ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం
- ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్ర్యదినోత్సవం. (1919)
- -
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 19
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చారిత్రక దినములు.
ఆగష్టు 18 - ఆగష్టు 20 - జూలై 19 - సెప్టెంబర్ 19 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.