ఆంధ్ర ప్రదేశ్ లోకసభ నియోజకవర్గాలు

ప్రతిసభ్యుడు ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాడు.1962 వరకు 494 లోక్‌సభ స్థానాలు ఉండేవి. 1967 లో ఇవి 525 కు పెరిగాయి. 1973 లో 31 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సంఖ్యను 545 కు పెంచారు. 2001 వరకు ఈ సంఖ్యను మార్చకూడదని 1976 లో 42 వ రాజ్యాంగ సవరణ తెచ్చారు. 2026 వరకు ఈ సంఖ్య ఇలాగే ఉండాలని 2002 లో 84 వ రాజ్యాంగ సవరణ చేశారు.

  • లా కమిషన్ కోరికలు:
  • 25%స్థానాలు పెంచాలి
  • 5% కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థుల్నే గెలిచినట్లు ప్రకటించాలి
  • రెండు ఆంగ్లో ఇండియన్ స్థానాలు రద్దుచెయ్యాలి
  • నేరచరితుల్ని పోటీచెయ్యనివ్వ కూడదు
  • రెండు అవిశ్వాస తీర్మానాల మధ్య రెండేళ్ళ విరామం ఉండాలి
  • ఇండిపెండెంట్లు ఉండకూడదు
  • ఎన్నికయ్యాక పార్టీ వదిలితే సీటూ పోవాలి

ఆంధ్ర ప్రదేశ్‌లోని లోక్‌సభ నియోజకవర్గాలు

భారత లోక్‌సభలో మొత్తం సభ్యుల సంఖ్య : 545

ఆంధ్ర ప్రదేశ్ లోని లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య : 25 ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజనకు ముందు 42 (25 సీమాంధ్ర + 17 తెలంగాణా ) నియోజకవర్గాలు ఉండేవి.

సంఖ్య నియోజకవర్గం దీనిలో గల శాసనసభ నియోజకవర్గాలు
(వాటి వరుస సంఖ్యలు ఇవ్వబడినవి)
1. అరుకు (ఎస్.టి.) 130. కురుపాం (ఎస్.టి.),
131. పార్వతీపురం (ఎస్.సి.),
132. సాలూరు (ఎస్.టి.),
146. మాడుగుల,
147. అరకు లోయ (ఎస్.టి.),
148. పాడేరు (ఎస్.టి.) మరియు
172. రంపచోడవరం (ఎస్.టి.) .
2. శ్రీకాకుళం 120. ఇచ్ఛాపురం,
121. పలాస,
122. టెక్కలి,
123. పాతపట్నం,
124. శ్రీకాకుళం,
125. ఆముదాలవలస
127. నరసన్నపేట.
3. విజయనగరం 126. ఎచ్చెర్ల,
128. రాజాం (ఎస్.సి.),
129. పాలకొండ (ఎస్.టి.),
133. బొబ్బిలి,
134. చీపురుపల్లి,
136. భోగాపురం
137. విజయనగరం.
4. విశాఖపట్నం 135. గజపతినగరం,
138. శృంగవరపుకోట,
139. భీమిలి,
140. తూర్పు విశాఖపట్నం,
141. దక్షిణ విశాఖపట్నం,
142. ఉత్తర విశాఖపట్నం,
143. పశ్చిమ విశాఖపట్నం.
5. అనకాపల్లి 144. గాజువాక,
145. చోడవరం,
149. అనకాపల్లి,
150. పెందుర్తి,
151. ఎలమంచిలి,
152. పయకరావుపేట (ఎస్.సి.),
153. నర్సీపట్నం.
6. కాకినాడ 154. తుని,
155. ప్రత్తిపాడు,
156. పిఠాపురం,
157. కాకినాడ గ్రామీణ,
158. పెద్దాపురం,
160. కాకినాడ సిటీ,
171. జగ్గంపేట.
7. అమలాపురం (ఎస్.సి.) 161. రామచంద్రాపురం,
162. ముమ్మడివరం,
163. అమలాపురం (ఎస్.సి.),
164. రాజోలు (ఎస్.సి.),
165. గన్నవరం (ఎస్.సి.),
166. కొత్తపేట,
167. మండపేట.
8. రాజమండ్రి 159. అనపర్తి,
168. రాజానగరం,
169. రాజమండ్రి సిటీ,
170. రాజమండ్రి గ్రామీణ,
173. కొవ్వూరు (ఎస్.సి.),
174. నిడదవోలు,
185. గోపాలపురం (ఎస్.సి.) .
9. నరసాపురం 175. ఆచంట,
176. పాలకొల్లు,
177. నర్సాపురం,
178. భీమవరం,
179. ఉండి,
180. తణుకు,
181. తాడేపల్లిగూడెం.
10. ఏలూరు 182. ఉంగుటూరు,
183. దెందులూరు,
184. ఏలూరు,
186. పోలవరం (ఎస్.టి.),
187. చింతలపూడి (ఎస్.సి.),
189. నూజివీడు (ఎస్.సి.),
192. కైకలూరు.
11. మచిలీపట్టణం 190. గన్నవరం,
191. గుడివాడ,
193. పెడన,
194. మచిలీపట్నం,
195. అవనిగడ్డ,
196. ఉయ్యూరు,
197. పెనమలూరు.
12. విజయవాడ 188. తిరువూరు (ఎస్.సి.)
198. భవానీపురం,
199. సత్యనారాయణపురం,
200. విజయవాడ పడమట,
201. మైలవరం,
202. నందిగామ (ఎస్.సి.),
203. జగ్గయ్యపేట.
13. గుంటూరు 205. తాడికొండ (ఎస్.సి.),
206. మంగళగిరి,
207. పొన్నూరు,
210. తెనాలి,
212. ప్రత్తిపాడు (ఎస్.సి.),
213. గుంటూరు ఉత్తర,
214. గుంటూరు దక్షిణ.
14. నరసారావుపేట 204. పెదకురపాడు,
215. చిలకలూరిపేట,
216. నరసారావుపేట,
217. సత్తెనపల్లి,
218. వినుకొండ,
219. గురజాల,
220. మాచెర్ల.
15. బాపట్ల (ఎస్.సి) 208. వేమూరు (ఎస్.సి.),
209. రేపల్లె,
211. బాపట్ల,
223. పరుచూరు,
224. అద్దంకి (ఎస్.సి.),
225. చీరాల,
226. సంతనూతల (ఎస్.సి.) .
16. ఒంగోలు 221. ఎర్రగొండపాలెం,
222. దర్శి,
227. ఒంగోలు,
229. కొండపి (ఎస్.సి.),
230. మార్కాపురం,
231. గిద్దలూరు,
232. కనిగిరి.
17. నంద్యాల 253. ఆళ్ళగడ్డ,
254. శ్రీశైలం,
255. నందికొట్కూరు (ఎస్.సి.),
257. కల్లూరు,
258. నంద్యాల,
259. బనగానపల్లి,
260. డోన్.
18. కర్నూలు 256. కర్నూలు,
261. పత్తికొండ,
262. కోడుమూరు (ఎస్.సి.),
263. యెమ్మిగనూరు,
264. కౌతలం,
265. ఆదోని,
266. ఆలూరు.
19. అనంతపురం 267. రాయదుర్గం,
268. ఉరవకొండ,
269. గుంతకల్లు,
270. తాడిపత్రి,
272. అనంతపురం,
273. కళ్యాణదుర్గం,
274. రాప్తాడు.
20. హిందూపూర్ 271. సింగనమల (ఎస్.సి.),
275. మడకసిర (ఎస్.సి.),
276. హిందూపురం,
277. పెనుకొండ,
278. పుట్టపర్తి,
279. ధర్మవరం,
280. కదిరి.
21. కడప 243. బద్వేల్ (ఎస్.సి.),
245. కడప,
248. పులివెందుల,
249. కమలాపురం,
250. జమ్మలమడుగు,
251. ప్రొద్దుటూరు,
252. మైదుకూరు.
22. నెల్లూరు 228. కందుకూరు,
233. కావలి,
234. ఆత్మకూరు,
235. కొవ్వూరు,
236. నెల్లూరు పట్టణ,
237. నెల్లూరు గ్రామీణ,
242. ఉదయగిరి.
23. తిరుపతి (ఎస్.సి.) 238 సర్వేపల్లి,
239. గూడూరు (ఎస్సీ),
240. సూళ్ళూరుపేట (ఎస్సీ),
241. వెంకటగిరి,
286. తిరుపతి,
287. శ్రీకాళహస్తి,
288. సత్యవేడు (ఎస్సీ)
24. రాజంపేట 244. రాజంపేట (వైఎస్ఆర్ జిల్లా),
246 కోడూరు (వైఎస్ఆర్ జిల్లా),
247. రాయచోటి (వైఎస్ఆర్ జిల్లా),
281. తంబళ్ళపల్లె (చిత్తూరు జిల్లా),
282. పీలేరు (చిత్తూరు జిల్లా),
283. మదనపల్లె (చిత్తూరు జిల్లా),
284. పుంగనూరు (చిత్తూరు జిల్లా)
25. చిత్తూరు (ఎస్.సి.) 285. చంద్రగిరి,
289. నగరి,
290 గంగాధరనెల్లూరు (ఎస్.సీ.),
291 చిత్తూరు,
292 పూతలపట్టు (ఎస్సీ),
293 పలమనేరు,
294 కుప్పం.

ఇవీ చూడండి

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.