ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి [1][2] అధినేత ముఖ్యమంత్రి కాగా, రాష్ట్ర పరిపాలన గవర్నరు పేరున జరుగుతుంది.
![]() | |
| పరిపాలనా కేంద్రం | అమరావతి |
|---|---|
| కార్యనిర్వహణ | |
| గవర్నర్ | ఈ.ఎస్.ఎల్.నరసింహన్ |
| ముఖ్యమంత్రి | నారా చంద్రబాబు నాయుడు |
| చట్ట సభలు | |
| శాసనసభ |
|
| సభాపతి | కోడెల శివప్రసాద్ |
| ఉప సభాపతి | మండలి బుద్ధప్రసాద్ |
| శాసనసభ్యులు | 175 |
| శాసన మండలి | శాసన మండలి |
| న్యాయవ్యవస్థ | |
| హైకోర్టు | ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు |
| ప్రధాన న్యాయమూర్తి | కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా |

గవర్నర్
శ్రీ ఈ.ఎస్.ఎల్.నరసింహన్ డిసెంబరు 28, 2009 గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. గవర్నర్ కార్యాలయము[3] గవర్నర్ కార్యక్రమాలను సమన్వయంచేస్తుంది.
ముఖ్యమంత్రి
శ్రీ నారా చంద్రబాబునాయుడు 2014, జూన్ 8 న రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి కార్యాలయము [4] ముఖ్యమంత్రి కార్యాక్రమాలను సమన్వయంచేస్తుంది.
ప్రధాన న్యాయమూర్తి
శ్రీ పినాకి చంద్ర ఘోష్ 25 జూన్ 2012 న రాష్ట్ర ఉన్నత న్యాయాలయానికి [5] తాత్కాలిక ప్రధాన న్యాయాధికారిగా బాధ్యతలు చేపట్టాడు.
మంత్రివర్గం
ప్రధాన వ్యాసం:ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మండలి-17
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
రాష్ట్ర విభజన అనంతరం 02.06.2014 నుండి శ్రీ ఐ.వి.ఆర్.కృష్ణారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా 31.01.2016 వరకూ పదవీ బాధ్యతలు నిర్వహించారు. పిమ్మట శ్రీ సత్యప్రకాష్ టక్కర్ 01.02.2016 నుండి 28.02.2017 వరకూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా పదవీ బాధ్యతలు నిర్వహించారు. పిమ్మట శ్రీ అజేయ కల్లం 01.03.2017 నుండి 31.03.2017 వరకూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా పదవీ భాద్యతలు నిర్వహించారు. శ్రీ దినేష్ కుమార్ 01.04.2017 నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రధాన ఎన్నికల అధికారి
ప్రస్తుత ప్రధాన ఎన్నికల అధికారి పి.సిసోడియా
ప్రభుత్వ శాఖలు
ప్రధాన వ్యాసం: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శాఖలు
30 పైగా శాఖలు, మొత్తం 253 సంస్థలు ఉన్నాయి.
శాసనసభ
చూడండి: శాసనసభ, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా
శాసనమండలి
పార్లమెంట్ సభ్యులు
జిల్లా స్ధాయి పరిపాలన
జిల్లా కలెక్టరు కార్యాలయం జిల్లా స్థాయిలో పరిపాలనకు కేంద్ర స్థానం. జిల్లా పరిషత్ అధికారులు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టటంలో జిల్లా కలెక్టరుతో సమన్వయం చేసుకుంటారు. చూడండి:జిల్లాకలెక్టర్ల వివరాలు[9]

