ఆంధ్రప్రదేశ్ శాసనసభ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ను ది.2-3-2017న అమరావతిలో ప్రారంభించారు
| ఆంధ్రప్రదేశ్ శాసనసభ | |
|---|---|
| 14వ శాసనసభ | |
| రకం | |
| రకం |
ద్విసభ |
| నాయకత్వం | |
శాసనసభ నేత | |
| నిర్మాణం | |
| సీట్లు | 175 + 56 |
![]() | |
శాసనసభ రాజకీయ వర్గాలు |
అధికార పక్షం తె.దే.పా (102) భా.జ.పా (4) ప్రతిపక్ష పార్టీలు వై.కా.పా (67) NP (1) ఇతరులు (1) |
| ఎన్నికలు | |
శాసనసభ ఓటింగ్ విధానం | First past the post |
శాసనసభ చివరి ఎన్నికలు | 2014 |
| సమావేశ స్థలం | |
| ఆంధ్రప్రదేశ్ శాసనసభ అమరావతి | |
| వెబ్సైటు | |
| http://www.aplegislature.org | |
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ (అసెంబ్లీ) చరిత్రలో, రెండు సభలతోను మరియు ఒక సభతోను, రెండు విధాలుగా నిర్వహించబడింది. ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను శాసనసభ అని, ప్రజలచే పరోక్షముగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను శాసన మండలి సభ అని అంటారు. శాసనసభను దిగువసభ అని, శాసన మండలి సభను ఎగువ సభ అని కూడా అంటారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 295 మంది శాసన సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 90 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యాలయం హైదరాబాద్లో ఉంది. దీనిని 1913 లో నిర్మించారు, ఈ భవనం నిజానికి హైదరాబాద్ టౌన్ హాల్. 1905 లో నిజాం మీర్ మహాబుబ్ ఆలీ ఖాన్ యొక్క 40 వ పుట్టిన రోజు గుర్తించడానికి హైదరాబాద్ సంస్థాన రాష్ట్ర పౌరులు దీని నిర్మాణానికి అవసరమయిన నిధులు సేకరించారు. నిర్మాణ శోభితమైన ఈ హైదరాబాద్ యొక్క తెలుపు రత్నాన్ని ప్రత్యేకంగా నియమించబడిన వాస్తుశిల్పులు రూపొందించారు. ఇది సుందరమైన పబ్లిక్ గార్డెన్స్ ను ఆనుకొని ఉంది.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు
| సంఖ్య | పేరు | చిత్రం | ఆరంభము | అంతము | రాజకీయ పార్టీ | |
|---|---|---|---|---|---|---|
| 1 | అయ్యదేవర కాళేశ్వరరావు | 1956 | 1962 | కాంగ్రెస్ | ||
| 2 | బి. వి. సుబ్బారెడ్డి | 1962 | 1970 | కాంగ్రెస్ | ||
| 3 | జి. నారాయణ రావు | కాంగ్రెస్ | ||||
| 4 | దీవి కొండయ్య చౌదరి | కాంగ్రెస్ | ||||
| 5 | కోన ప్రభాకరరావు | 1980 | 1981 | కాంగ్రెస్ | ||
| 6 | తంగి సత్యనారాయణ | 1983 | 1985 | తె.దే.పా | ||
| 7 | డి. శ్రీపాదరావు | 1991 | 1995 | కాంగ్రెస్ | ||
| 8 | యనమల రామకృష్ణుడు | 1995 | 1999 | తె.దే.పా | ||
| 9 | కె. ప్రతిభా భారతి | 1999 | 2004 | తె.దే.పా | ||
| 10 | కె. ఆర్. సురేష్ రెడ్డి | 2004 | 2009 | కాంగ్రెస్ | ||
| 11 | నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి | 2009 | 2010 | కాంగ్రెస్ | ||
| 12 | నాదెండ్ల మనోహర్ | 2011 | 2014 | కాంగ్రెస్ | ||
| 13 | కోడెల శివప్రసాద్ | రాష్ట్ర విభజన తరువాత 2014 | ప్రస్తుతం | తె.దే.పా |
