ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణా సంస్థ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణా సంస్థ (AP State Council for Education Research and Training, (APSCERT)) 27-07-1967 న , అప్పటికే వున్న రాష్ట్ర విద్యాసంస్థ, రాష్ట్ర విద్యామరియు వృత్తిపర సలహా బ్యూరో మరియు రాష్ట్ర వైజ్ఞానిక విద్య సమితి మరియు రాష్ట్ర మూల్యాంకన సమితులను కలగలిపి ఏర్పడినది.[1]

లక్ష్యాలు

  • ప్రాథమిక, ప్రాథమికోన్నత, మాధ్యమిక సేవలలో వున్న ఉపాధ్యాయులకు మరియు వారికి శిక్షణఇచ్చే ఉపాధ్యాయులకు శిక్షణ
  • విద్యా విషయాలలో ఆలోచనలు మరియు సమాచార వినిమయానికి కేంద్రంగా వ్యవహరించుట
  • పాఠశాల విద్యావిషయక సలహాలు ఇచ్చుట
  • విద్యావిషయక కార్యక్రమాలపై అధ్యయనాలు మరియు సర్వేలు చేయుట
  • విద్యా సమస్యలు మరియు బోధనా పద్ధతులపై పరిశోధన కార్యకలాపాలను చేయట మరియు సమన్వయం చేయుట
  • పుస్తకాలు, పత్రికలు మరియు దృశ్యశ్రవణ సామాగ్రి తయారుచేయుట
  • రాష్ట్రంలో విద్యా కార్యక్రమాల ప్రభావాన్ని మూల్యాంకనం మరియు అధ్యయనం చేయుట

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.