అశోకవృక్షం
అశోకవృక్షం (ఆంగ్లం: Ashoka tree లేదా "sorrow-less") (S. asoca (Roxb.) Wilde, or Saraca indica L. ) బహుళ ఆయుర్వేద ప్రయోజనాలున్న పుష్పించే చెట్టు. ఇది భారతదేశం మరియు శ్రీలంక దేశాలలో విస్తృతంగా పెరుగుతుంది.
_leaves_%26_flowers_in_Kolkata_W_IMG_4175.jpg)
కలకత్తాలోని పుష్పించిన అశోకవృక్షం.
| అశోకవృక్షం | |
|---|---|
![]() | |
| అశోకవృక్షపు పుష్పగుచ్ఛం. | |
| పరిరక్షణ స్థితి | |
![]() Vulnerable (IUCN 2.3) | |
| శాస్త్రీయ వర్గీకరణ | |
| రాజ్యం: | ప్లాంటే |
| విభాగం: | మాగ్నోలియోఫైటా |
| తరగతి: | మాగ్నోలియోప్సిడా |
| క్రమం: | Fabales |
| కుటుంబం: | ఫాబేసి |
| ఉప కుటుంబం: | Caesalpinioideae |
| జాతి: | Detarieae |
| జాతి: | సరాకా |
| ప్రజాతి: | ఎస్. అశోకా |
| ద్వినామీకరణం | |
| సరాకా అశోకా (Roxb.) Wilde | |
అశోకం ఫాబేసి (Fabaceae) కుటుంబంలోని సరాకా (Saraca) ప్రజాతికి చెందినది. ఇది ఎల్లప్పుడు ముదురు పచ్చగా ఆకులతో నిండివుంటుంది. వీని పుష్పాలు మంచి పరిమళాన్ని కలిగివుండి కాషాయం నుండి ఎరుపు రంగులో గుత్తులుగా పూస్తాయి. ఇవి ఎక్కువగా తూర్పు మరియు మధ్య హిమాలయా పర్వతాలు, దక్షిణ భారతదేశ మైదానాలలోను, పడమర తీరం వెంట అధికంగా కనిపిస్తాయి. ఇవి ఫిబ్రవరి నుండి ఏప్రిల్ మధ్యకాలంలో పుష్పిస్తాయి.
పురాణాలలో
- గౌతమ బుద్ధుడు లుంబినీ వనంలో అశోకవృక్షం క్రింద జన్మించాడు.
- మహావీరుడు వైశాలి నగరంలో అశోకవృక్షం క్రింద సన్యాసాన్ని స్వీకరించాడు.
- హిందువుల ప్రేమ దేవుడైన మన్మథుని పంచబాణాలులో ఒకటి అశోకవృక్షం పుష్పాలు.[1]
- రామాయణంలో అశోకవనంలో సీతాదేవిని హనుమంతుడు కనుగొంటాడు.
గ్యాలరీ
- Cowen, D. V. (1984). Flowering Trees and Shrubs in India, Sixth Edition. Bombay: THACKER and Co. Ltd. p. 5.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
_flowers_in_Kolkata_W_IMG_4146.jpg)

_trunk_in_Kolkata_W_IMG_2270.jpg)
_leaves_%26_flowers_in_Kolkata_W_IMG_2272.jpg)
_leaf_in_Kolkata_W_IMG_2268.jpg)
_flowers_in_Kolkata_W_IMG_4242.jpg)
_flowers_in_Kolkata_W_IMG_4240.jpg)
_flowers_growing_on_the_trunk_in_Kolkata_W_IMG_4333.jpg)
_flower_buds_%26_flowers_in_Kolkata_W_IMG_3449.jpg)
