అల్లాహ్

అల్లాహ్ (అరబ్బీ : الله) అరబ్బీ భాష పదమైన 'అల్-ఇలాహ్ ' నుండి ఉద్భవించిన పదం అల్లాహ్.

వ్యాసముల క్రమము

ఇస్లాం మతం

విశ్వాసాలు

అల్లాహ్ · ఏకేశ్వర విశ్వాసం దేవుడు
ముహమ్మద్ · ఇతర ప్రవక్తలు

ఆచరణీయాలు

మూల విశ్వాసం · నమాజ్
ఉపవాసం · దాన ధర్మాలు · తీర్థయాత్ర

గ్రంధాలు మరియు చట్టాలు

ఖుర్'ఆన్ · సున్నహ్ · హదీస్
ఫిఖ॰ · షరియా · కలాం · సూఫీ తత్వం

చరిత్ర మరియు ఖలీఫాలు

ఇస్లామీయ చరిత్ర కాలపట్టిక
అహ్లె బైత్ · సహాబా
సున్నీ · షియా
రాషిదూన్ ఖలీఫాలు · ఇమామ్

సంస్కృతి మరియు సమాజం

విద్య · జంతువులు · కళలు
కేలండరు · పిల్లలు
జనగణన · పండుగలు
మస్జిద్‌లు · తత్వము
శాస్త్రము · స్త్రీ
రాజకీయాలు · దావాహ్ · జిహాద్

ఇస్లాం మరియు ఇతర మతములు

క్రైస్తవం · యూదమతము
హిందూ మతము · సిక్కు మతం · జైన మతము

విమర్శ ·  ముస్లింలలో అపవిశ్వాసాలు
ఇస్లామోఫోబియా
ఇస్లామీయ పదజాలము

భారతదేశంలో ఇస్లాం
ఆంధ్రప్రదేశ్‌లో ఇస్లాం

అరబ్బీలో అల్లాహ్ లిపీకళాకృతి.

ఏకైక ఆరాధ్యుడు

ఇలాహ్ అంటే దేవుడు అని అర్ధం. అరబ్ క్రైస్తవులు, అరబ్బీ భాష మాట్లాడే ఇతర మతస్తులూ, యూదుల కూడా దేవున్ని అల్లాహ్ అంటారు. అల్ ఇలాహ్ అంటే "ఆ దేవుడు", "అందరికీ తెలిసిన దేవుడు" .అద్వితీయుడు అంటే అలాంటి వాడింకెవడూ లేడు, ఉండడు. ఇది అరబీ భాషాపదం. హీబ్రూ భాష లోని "ఎలోహిం", దేవుని స్తుతించుడి "హల్లెలూయా", అరమాయిక్ భాషలోని "ఎలాహా" లాంటి పదాలు "ఇలాహ"ను గుర్తుచేస్తాయి. తెలుగులో "ఏకైక ఆరాధ్యుడు" అని అర్థం. మొత్తం ప్రపంచ మానవాళి మార్గదర్శకత్వం కోసం పంపబడిన అంతిమ దివ్యగ్రంథమైన ఖుర్ఆన్లో ఆ అల్లాహ్ ఎవరు అంటే ఆ ఏకైక ఆరాధ్యుడు ఎవరు అనే ప్రశ్నకు అనేక చోట్ల సమాధానం ఇవ్వబడింది. వాటి ఆధారంగా మరియు ప్రపంచ ప్రజలందరి మార్గదర్శకత్వం కోసం పంపబడిన అంతిమ దైవసందేశహరుడు మరియు ప్రవక్త అయిన మహనీయ ముహమ్మద్ (అల్లాహ్ ఆయనపై శాంతిని కరుణించుగాక) బోధించిన పవిత్ర ప్రవచనాల ఆధారంగానే క్రింద తెలిపిన అల్లాహ్ యొక్క 99 విశేష గుణగణాలు ఉనికిలోనికి వచ్చినవి. అంతేగాని ఎవరో ఒక ముస్లిం పండితుడు ఊహించి వ్రాసినవి కావు ఇవి. ఉదారహణకు అల్లాహ్ (ఏకైక ఆరాధ్యుడు) అంటే ఎవరు అనే ప్రశ్నకు చాలా క్లుప్తంగా, స్పష్టంగా దివ్యఖుర్ఆన్ లోని 114వ అధ్యాయంలో సమాధానం ఇవ్వబడినది - "ప్రకటించు! ఆయనే అల్లాహ్ - అద్వితీయుడు, అల్లాహ్ నిరపేక్షాపరుడు, ఎవరి ఆధారమూ, ఎవరి అక్కరా లేని వాడు. అందరూ ఆయనపై ఆధారపడేవారే. ఆయనకు సంతానము లేదు మరియు ఆయన ఎవరికీ పుట్టలేదు. ఆయనకు సరిసమానులు ఎవ్వరూ లేరు" దివ్యఖర్ఆన్ లో మరొకచోట 59వ అధ్యాయం 22 - 24 వచనాలలో అల్లాహ్ అంటే ఎవరు అనే ప్రశ్నకు ఇలా సమాధానం ఇవ్వబడింది. "ఆయనే అల్లాహ్: ఆయన తప్ప ఆరాధ్యుడు ఎవ్వరూ లేరు. దృశ్యాదృశ్య విషయాలన్నీ ఎరిగిన వాడు. ఆయనే కరుణామయుడు , కృపాశీలుడు. ఆయనే అల్లాహ్, ఆయన తప్ప ఆరాధ్యుడెవ్వరూ లేరు. ఆయన పరిపాలకుడు, ఎంతో పరిశుద్ధుడు, సురక్షితుడు, శాంతిప్రదాత, సంరక్షకుడు, సర్వాధికుడు, తన ఉత్తర్వులను తిరుగులేని విధంగా అమలుపరచేవాడు, ఎల్లప్పుడూ ఉన్నతుడిగానే ఉండేవాడు. ప్రజలు కల్పించే దైవత్వపు భాగస్వామ్యం వర్తించని పరిశుద్ధుడే అల్లాహ్. సృష్టివ్యూహాన్ని రచించేవాడు, దానిని అమలు పరచేవాడు, ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు. కేవలం ఆయనకే అన్ని ఉత్తమమైన పేర్లు (విశేషగుణగణాలు) చెందును. ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న ప్రతి వస్తువూ ఆయనను స్మరిస్తోంది. ఆయన సర్వాధికుడు, వివేకవంతుడూను". అలాగే దివ్యఖుర్ఆన్ లోని రెండవ అధ్యాయం (ఆవు) లోని 255వ వచనంలో అల్లాహ్ అంటే ఎవరు అనే ప్రశ్నకు ఇలా సమాధానం ఇవ్వబడినది - "అల్లాహ్ - ఆయన తప్ప ఆరాధ్యదైవం ఎవ్వరూ లేరు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. ఆయన కునుకడు నిదుర పోడు, భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనదే. ఆయన దగ్గర ఆయన అనుమతి లేకుండా సిఫారసు చెయ్యగలవాడెవ్వరు? ప్రజల ముందు ఉన్న దానినీ ఆయన ఎరుగును. వారికి గుప్తంగా ఉన్నదీ ఆయన ఎరుగును. ఆయన స్వయంగా తెలియజెయ్యాలని అభిలషిస్తే తప్ప ఆయనకున్న జ్ఞాన విశేషాలలోని ఏ విషయమూ వారి గ్రహణ పరిధిలోనికి రాదు. ఆయన రాజ్యాధికారం ఆకాశాలనూ, భూమినీ పరివేష్టించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఎంత మాత్రం అలసట కలిగించదు. ఆయన మాత్రమే సర్వాధికుడు, సర్వోత్తముడు"

వ్యాసముల క్రమము
దేవుడు

సాధారణ నిర్వచనాలు
దేవవాదం · హినోథీయిజం
ఏకేశ్వరవాదం · పానెంథీయిజం
పాంథీయిజం · మోనోలాట్రిజం


నిర్దేశిత భావనలు
పేర్లు · "దేవుడు" · ఉనికి · లింగము
సృష్టికర్త · నిర్మాణకర్త · డెమియుర్జ్ · అనంతజీవి
స్వామి · పిత · మొనాడ్ · ఏకత్వం
ఉన్నతుడు · సర్వం · వ్యక్తిగతం
యూనిటేరియానిజం · డైథీయిజం · త్రిత్వము
సర్వవ్యాప్తి · సర్వవ్యాపితము
సర్వాంతర్యామి · అనంత దయామయి
అయ్యవాజీలలో దేవుడు · ఇబ్రాహీం మతములలో దేవుడు
బహాయి విశ్వాసంలో · క్రైస్తవంలో
హిందూమతంలో దేవుడు · ఇస్లాంలో దేవుడు · యూదమతములో
సిక్కు మతములో · బౌద్ధమతములో


అనుభవాలు మరియు ఆచరణలు
విశ్వాసము · ప్రార్థన · నమ్మకం · అవతరణలు
ఫిడేయిజం · గ్నోసిస్ · మెటాఫిజిక్స్
మిథ్యావాదం · హెర్మెటిసిజం · ఇసోటెరిసిజం


సంబంధిత విషయాలు
తత్వశాస్త్రం · మతము · ఓంటాలజీ
గాడ్ కాంప్లెక్స్ · న్యూరో థియోలజీ
అయోమయం
చెడుతో సమస్యలు (థియోడైసీ)
ఆస్తికవాదం


ఖురాన్ నిర్వచనాలు

ఖురాన్ పవిత్రగ్రంథంలో 'అల్లాహ్' యొక్క విశేషణాత్మక నామవాచకాలు 99.

ఉదాహరణకు

"బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం"

పై వాక్యంలో "రహ్మాన్", "రహీం" అను పేర్లు గలవు. రహ్మాన్ అనగా దయాళువు, రహీం అనగా కరుణామయుడు.

ఖురాను లోని అల్లాహ్ 99 పేర్లు

#
అరబ్బీ

పేరు

తెలుగు

లిప్యాంతరీకరణ

అంటే అర్ధం
ఈ పేరున్న

ఖురానువాక్యం కనీసం ఒకటి

1الرحمنఅర్-రహ్మాన్దయాళువు, అమిత దయాశీలుడుఅల్-ఫాతిహా :2
2الرحيمఅర్-రహీమ్కరుణామయుడు, కృపాశీలిఅల్-ఫాతిహా : 2
3الملكఅల్-మాలిక్ప్రభువు, యజమాని, రాజుఅల్-ఫాతిహా : 3
4القدوسఅల్-ఖుద్దూస్పవిత్రుడుహషర్ :23
5السلامఅస్-సలామ్శాంతిహషర్ :23
6المؤمنఅల్-మూమిన్విశ్వసనీయుడు, భద్రత కల్పించేవాడు,

సత్యాన్ని ధ్రువీకరించేవాడు, పూచీనిచ్చేవాడు,

హషర్ :23
7المهيمنఅల్-ముహైమిన్సంరక్షకుడుహషర్ :23
8العزيزఅల్-అజీజ్సర్వ శక్తుడు, స్వయంసంపన్నుడు,

మహా గౌరవనీయుడు

హషర్ :23
9الجبارఅల్-జబ్బార్ఎదురులేనివాడు, ఒత్తిడిచేసేవాడు,

బాగుచేసేవాడు, పునరుద్ధారకుడు, నిరంకుశుడు

హషర్ :23
10المتكبرఅల్-ముతకబ్బిర్గొప్పవాడు, అహంకారి, గర్వించేవాడు,

ఎవ్వరూ తిరుగుచెప్పలేని వాడు

హషర్ :23
11الخالقఅల్-ఖాలిఖ్సృష్టికర్తహషర్ :24
12البارئఅల్-బారిచేసేవాడు, తయారీదారుడుహషర్ :24
13المصورఅల్-ముసవ్విర్రూపశిల్పి, చిత్రకారుడుహషర్ :24
14الغفارఅల్-గఫార్క్షమాశీలి, సదా మన్నించువాడుతాహా :82
15القهارఅల్-ఖహ్హార్అన్నిటినీ అణచివేసేవాడుయూసుఫ్ :39
16الوهابఅల్-వహాబ్వరాలిచ్చేవాడుఇమ్రాన్ :8
17الرزاقఅల్-రజాక్పోషకుడుజారియత్ :58
18الفتاحఅల్-ఫత్తాహ్ప్రారంభకుడుసబా :26
19العليمఅల్-అలీమ్సర్వజ్ఞానిసబా :26
20القابضఅల్-ఖాబిజ్అడ్డగించేవాడు, సరిచేసేవాడునిసా :245
21الباسطఅల్-బాసిత్వ్యాప్తినొందించువాడునిసా :245
22الخافضఅల్-కాఫిజ్అణగదొక్కేవాడు, హీనపరచేవాడుఅల్ వాఖియా :56
23الرافعఅర్-రాఫెయ్ఘనపరచేవాడు, పైకిలేపేవాడుగఫీర్ :16
24المعزఅల్-ముఇజ్జుగౌరవమిచ్చేవాడుఇమ్రాన్ :26
25المذلఅల్-ముజెల్వినాశకుడు,అణగదొక్కేవాడుతౌబా :2
26السميعఅల్-సమీయుఆలకించువాడుషూరా :11
27البصيرఅల్-బసీర్చూసేవాడుఫుర్ఖాన్ :20
28الحكمఅల్-హకీంపాలకుడునూర్ :18
29العدلఅల్-అదల్న్యాయమూర్తినహల్ :90
30اللطيفఅల్-లతీఫ్అతి సున్నితుడు, సూక్ష్మగ్రాహిషూరా :19
31الخبيرఅల్-ఖబీర్సర్వం తెలిసినవాడుఫుర్ఖాన్ :58
32الحليمఅల్-హలీమ్ప్రశాంతుడు, ఓర్చుకునేవాడు, సహనశీలి, దీర్ఘశాంతుడునిసా :12
33العظيمఅల్-అజీమ్మహోన్నతుడునూర్ :14
34الغفورఅల్-గఫూర్మన్నించువాడునూర్ :22
35الشكورఅష్-షకూర్మొర ఆలకించేవాడుఫుర్ఖాన్ :62
36العليఅల్-అలియ్ఔన్నత్యాన్నిచ్చేవాడు, గౌరవపరచేవాడు, సన్మానించేవాడుబఖరా :255
37الكبيرఅల్-కబీర్గొప్పవాడుఫుర్ఖాన్ :58
38الحفيظఅల్-హాఫిజ్కాపాడువాడు, రక్షకుడుహూద్ :57
39المقيتఅల్-ముఖీత్బలపరచువాడునిసా :85
40الحسيبఅల్-హసీబ్లెక్కించువాడునిసా :6
41الجليلఅల్-జలీల్గౌరవనీయుడురహ్మాన్ :78
42الكريمఅల్-కరీమ్అమిత దయాళువు, ధర్మదాతమూమినూన్ :116
43الرقيبఅర్-రఖీబ్సదా కనిపెట్టి చూసేవాడు, కాపరినిసా :1
44المجيبఅల్-ముజీబ్ఆమోదించేవాడు, స్పందించేవాడు,

జవాబిచ్చేవాడు, కోర్కెలుతీర్చేవాడు, ఆపదమొక్కులవాడు

హూద్ :61
45الواسعఅల్-వాసియ్సర్వ వ్యాపిజుమర్ :10
46الحكيمఅల్-హకీమ్సర్వజ్ఞుడు,జ్ఞానినూర్ :18
47الودودఅల్-వదూద్ప్రేమించువాడు,బురూజ్ :14
48المجيدఅల్-మజీద్మహిమాన్వితుడుహూద్ :73
49الباعثఅల్-బాయిత్మృతుల్ని తిరిగి లేపేవాడుజుమా :2
50الشهيدఅష్-షహీద్సాక్షిహజ్ :17
51الحقఅల్-హఖ్హ్సత్యం, నిజంనూర్:25
52الوكيلఅల్-వకీల్ఆదరణకర్త, ఉత్తరవాదిజుమర్ :62
53القوىఅల్-ఖవియ్యుబలశాలిషూరా :19
54المتينఅల్-మతీన్స్థిరంగావుండేవాడు, మాటతప్పనివాడు, సదా నిలిచి ఉండేవాడుజారియత్ :58
55الولىఅల్-వలీయ్యుమిత్రుడు, అభిమాని, ఆత్మబంధువు, ఆపద్బాంధవుడుషూరా :9
56الحميدఅల్-హమీద్ప్రశంసా పాత్రుడు, స్తోత్తార్హుడుషూరా :28
57المحصىఅల్-ముహ్ సిఎంతైనా ఇవ్వగలవాడు, సర్వవర ప్రదాత,

సర్వం అనుగ్రహించువాడు

జుమర్ :35
58المبدئఅల్-ముబ్ దినిర్మాత, ఆవిష్కర్త, ప్రారంభించువాడునమల్:64
59المعيدఅల్-ముఈద్తిరిగి సృష్టించువాడుసబా:49
60المحيىఅల్-ముహియ్యుజీవమిచ్చేవాడురూమ్:19
61المميتఅల్-ముమీత్జీవం తీసుకునేవాడు, మరణదాత, నాశనం చేయువాడుబురూజ్:20
62الحيఅల్-హయ్యిసజీవుడు, అంతంలేనివాడుఇమ్రాన్:2
63القيومఅల్-ఖయ్యూమ్అందరినీ కొరతలేకుండా పోషించేవాడు,బురూజ్:20
64الواجدఅల్-వాజిద్గ్రహించేవాడు, చూచేవాడు, కనుక్కునేవాడు, గురితప్పనివాడుఅద్ దుహా:7
65الماجدఅల్-మాజిద్బ్రహ్మాండమైనవాడు, గొప్పవాడు, మాదిరిచూపేవాడుహూద్:73
66الواحدఅల్-వాహిద్ఏకేశ్వరుడు, ఒకే ఒక్కడుమూమినూన్:52
67الاحدఅల్-అహద్ఒకేఒక్కడు, అద్వితీయుడు, ఏకేశ్వరుడు

సర్వాంతర్యామి, అఖండుడు

ఇక్లాస్:1
68الصمدఅస్-సమద్స్వయం సమృద్ధుడు, నిత్యుడు,

దుర్భేద్యుడు, అజేయుడు, ఈశ్వరుడు,

ఎవరి అవసరం లేనివాడు

ఇక్లాస్:2
69القادرఅల్-ఖాదిర్సర్వశక్తుడు, అన్నీచేయగలవాడుఇనామ్:37
70المقتدرఅల్-ముఖ్తదిర్అన్నీ నిర్ణయించేవాడు, అధిపతిఖమర్:42
71المقدمఅల్-ముఖద్దిమ్త్వరపరచేవాడు, ముందుకునడిపేవాడు,

పనులు పూర్తిచేసేవాడు

యూనుస్:11
72المؤخرఅల్-ముఅఖ్ఖిర్శాంతకారకుడునూహ్:4
73الأولఅల్-అవ్వల్ఆదిహదీద్:3
74الأخرఅల్-ఆఖిర్అంతంహదీద్:3
75الظاهرఅజ్-జాహిర్కనిపించేవాడుహదీద్:3
76الباطنఅల్-బాతిన్అదృశ్యుడు, కానరానివాడు, దాగివున్నవాడుహదీద్:3
77الواليఅల్-వలీఅధికారి, దాత, ప్రోత్సాహకుడు, అభిమానిరౌద్:11
78المتعاليఅల్-ముతాలిస్వీయాభిమాని, ఘనుడురౌద్:9
79البرఅల్-బర్ర్దయగలవాడు, నీతిమంతుడుతూర్:28
80التوابఅల్-తవ్వాబ్బాకీ ఉంచుకోనివాడు, తిరిగి ఇచ్చేవాడు,నూర్:10
81المنتقمఅల్-మున్ తఖిమ్పగతీర్చుకొనువాడుసజ్దా:22
82العفوఅల్-అఫువ్వుమన్నించువాడు, పాపహరుడునిసా:43
83الرؤوفఅర్-రవూఫ్జాలిపడేవాడు, దయామయుడునూర్:20
84مالك الملكమాలిక్-అల్-ముల్క్సృష్టి యజమాని, స్వయంభువుడుఇమ్రాన్:26
85ذو الجلال|
و الإكرام
జుల్-జలాలి -
వ-అల్-ఇక్రామ్
ఘనతకు, దాతృత్వానికీ ప్రభువుఖమర్:27
86المقسطఅల్-ముఖ్సిత్నిష్పక్షపాతి, న్యాయమూర్తి, పగతీర్చేవాడుఇమ్రాన్:18
87الجامعఅల్-జామియ్సమకూర్చువాడు, ఐక్యపరచేవాడుషూరా:7
88الغنىఅల్-ఘనీమహా సంపన్నుడు, సర్వస్వతంత్రుడుజమర్:7
89المغنىఅల్-ముఘ్ నిఅమిత ధనవంతుడు, ఉదారుడుతౌబా:28
90المانعఅల్-మానిహాని తొలగించేవాడు,తిరిగికాపాడేవాడు, ఆదుకునేవాడుఅల్ ఖసస్:35
91الضارఅద్-దార్బాధించేవాడు, కీడుకల్పించేవాడు, కొట్టేవాడుఅర్రాద్:22
92النافعఅన్-నాఫియ్మంచిని పుట్టించేవాడు, పరిహారంచేసేవాడు,

ప్రాయశ్చి త్తం చేసేవాడు, దోషంవదలగొట్టేవాడు

అర్రూమ్ :37
93النورఅన్-నూర్తేజస్వి, తేజస్సు, వెలుగు, జ్యోతినూర్:35
94الهاديఅల్-హాదిఉపదేశకుడు, బోధకుడుఫుర్ఖాన్:31
95البديعఅల్-బదీయ్పోల్చలేనివాడు, ఆవిర్భావకుడుఇనామ్:10
96الباقيఅల్-బాఖిఅమృతుడు, సజీవిరహ్మాన్:27
97الوارثఅల్-వారిస్వారసుడుఖసాస్:58
98الرشيدఅర్-రాషిద్మార్గదర్శి, గురువు, సర్వజ్ఞానిహూద్:1
99الصبورఅస్-సబూర్సహనశీలుడు, కాలాతీతుడు.బకరా:251

ఇతర లిపులలో మరియు భాషలలో అల్లాహ్ పేరు

Allāh in other languages that use Arabic script is spelled in the same way. This includes Urdu, Persian/Dari, Uyghur among others.

  • అస్సామీ బెంగాళీ: আল্লাহ Allah
  • Bosnian: [Allah] error: {{lang}}: text has italic markup (help)
  • Chinese: 阿拉 Ālā, 安拉 Ānlā; 真主 Zhēnzhǔ (semantic translation as "the true master"), 胡大 Huda (Khoda, from Persian language)
  • Czech,
  • Greek: Αλλάχ Allách
  • Hebrew: אללה Allah
  • హిందీ: अल्लाह Allāh
  • మళయాళం|അള്ളാഹ് Aḷḷāh
  • Japanese: アラー Arā, アッラー Arrā, アッラーフ Arrāfu
  • Maltese: [Alla] error: {{lang}}: text has italic markup (help)
  • Korean: 알라 Alla
  • Polish: [Allah] error: {{lang}}: text has italic markup (help), also archaic Allach or Ałłach
  • Russian, Ukrainian, Bulgarian: Алла́х Allakh
  • Serbian, Belarusian, Macedonian: Алах Alah
  • Spanish, పోర్చుగీసు: [Alá] error: {{lang}}: text has italic markup (help)
  • Thai: อัลลอฮ์ Anláw
  • పంజాబీ (గురుముఖి): ਅੱਲਾਹ Allāh, archaic ਅਲਹੁ Alahu (in సిక్కు గ్రంథాలు)
  • Turkish: Allah
The word Allah written in different writing systems.

అల్లాహ్ పదంపై క్రైస్తవులకూ హక్కు

దేవుడిని ఉద్దేశిస్తూ 'అల్లా' పదాన్ని వాడుకోవటానికి క్రైస్తవులకు రాజ్యాంగబద్ధ హక్కుందని మలేషియా కోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది.ముస్లిమేతరులు అల్లా పదాన్ని వాడుకోవటం వల్ల శాంతి, సామరస్యాలు పెంపొందుతాయనీ కోర్టు అభిప్రాయపడింది.[1]

ఇవీ చూడండి

నోట్స్

  1. (ఈనాడు2.1.2010)

మూలాలు

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.