అల్లరి ప్రియుడు

అల్లరి ప్రియుడు, 1993లో విడుదలయిన ఒక తెలుగు సినిమా.

తెలుగు సినిమా*వేదిక
అల్లరి ప్రియుడు
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
నిర్మాణం కె.కృష్ణమోహనరావు
తారాగణం రాజశేఖర్,
రమ్యకృష్ణ,
మధుబాల
సంగీతం ఎం.ఎం.కీరవాణి
గీతరచన వేటూరి,
వెన్నెలకంటి
భువనచంద్ర
సీతారామశాస్త్రి
నిర్మాణ సంస్థ ఆర్.కె. ఫిల్మ్స్ ఎసోసియేట్స్
భాష తెలుగు

కథ

ఇందులో కథానాయకుడు రాజశేఖర్ ఒక గాయకుడు. అతడు ఒక కవయిత్రి పాటలను గానం చేస్తూ ప్రసిద్ధుడవుతాడు. అదే సమయంలో ఆమెను ప్రేమిస్తాడు. ఆయితే ఆ అసలు రచయిత్రి రమ్యకృష్ణ కాగా ఆమె తన చెల్లెలు మధుబాలవే రచయిత్రిగా రాజశేఖర్‌కు పరిచయం చేస్తుంది. అలా ఇద్దరమ్మాయిలు, ఒకబ్బాయి మధ్య నడచిన ముక్కోణపు ప్రేమయే ఈ సినిమా కథాంశం. సినిమాలో పాటలు బాగా విజయవంతమయ్యాయి.

తారాగణం

పాటలు

  • రోస్ రోస్ రోస్ రోజాపువ్వా - రచన:వేటూరి, గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బృందం
  • అందమా నీ పేరేమిటి - రచన:వేటూరి, గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బృందం
  • ప్రణయమా నీ పేరేమిటి- రచన:వెన్నెలకంటి, గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బృందం
  • ఏం పిల్లది ఎంత మాటన్నది - - రచన:కీరవాణి, గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
  • ఉత్తరాల ఊర్వశి - రచన:వేటూరి, గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
  • అహో ఒక మనసుకు నేడే - రచన:సీతారామ శాస్త్రి, గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
  • చెప్పకనే చెబుతున్నది - రచన:భువనచంద్ర, గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.