అల్యూమినియం ఫాస్ఫైడ్

అల్యూమినియం పాస్ఫైడ్ అత్యంత విష లక్షణాలు కలిగిన ఒక అకర్బన సమ్మేళన పదార్థం.అల్యూమినియం మరియు ఫాస్పరస్ మూలకాల పరమాణు సంయోగం వలన ఈ సంయోగపదార్థం ఏర్పడినది.ఈ సంయోగ పదార్థం యొక్క రసాయన సంకేత పదం AlP.అల్యూమినియం పాస్ఫైడ్ ను ధూమకారి/పొగలా వ్యాపించే రసాయన పదార్థం (fumigant)గా మరియు బ్యాండ్ గ్యాప్ సెమీకండక్టరుగా ఉపయోగిస్తారు. శుద్ధమైన అల్యూమినియం పాస్ఫైడ్ రంగులేని ఘన పదార్థం.జలవిశ్లేషణ మరియు ఆక్సీకరణ వలన చేరిన మలినాలవలన గ్రే-పచ్చ-పసుపు రంగులో కూడాఉండును.

అల్యూమినియం ఫాస్ఫైడ్
పేర్లు
ఇతర పేర్లు
Aluminum phosphide
Aluminium(III) phosphide
Aluminium monophosphide
Phostoxin
Fumitoxin
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [20859-73-8]
పబ్ కెమ్ 30332
యూరోపియన్ కమిషన్ సంఖ్య 244-088-0
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య BD1400000
SMILES [Al]#P
ధర్మములు
రసాయన ఫార్ములా
AlP
మోలార్ ద్రవ్యరాశి 57.9552 g/mol
స్వరూపం Yellow or gray crystals
వాసన garlic-like
సాంద్రత 2.85 g/cm3
ద్రవీభవన స్థానం 2,530 °C (4,590 °F; 2,800 K)
నీటిలో ద్రావణీయత
reacts
Band gap 2.5 eV (indirect)[1]
వక్రీభవన గుణకం (nD) 2.75 (IR), ~3 (Vis) [1]
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Zincblende
Space group
T2d-F43m
Lattice constant
a = 546.35 pm
కోఆర్డినేషన్ జ్యామితి
Tetrahedral
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ ΔfHo298
-164.4 kJ/mol
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ So298
47.3 J/mol K
ప్రమాదాలు
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
జ్వలన స్థానం {{{value}}}
Lethal dose or concentration (LD, LC):
LD50 (median dose)
11.5 mg/kg
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
Y verify (what is YN ?)
Infobox references

భౌతిక ధర్మాలు

అల్యూమినియం పాస్ఫైడ్ అత్యంత విష లక్షణాలు కలిగిన రసాయన సమ్మేళనం. శుద్ధమైన అల్యూమినియం పాస్ఫైడ్ రంగులేని ఘన పదార్థం. జలవిశ్లేషణ మరియు ఆక్సీకరణ వలన చేరిన మలినాలవలన గ్రే-పచ్చ-పసుపు రంగులో కూడా ఉండును. అల్యూమినియం పాస్ఫైడ్ అల్యూమినియం పాస్ఫైడ్ అణుభారం 57.9552 గ్రాములు/మోల్. 25 °C వద్ద అల్యూమినియం పాస్ఫైడ్ సాంద్రత 2.85 గ్రాములు/సెం.మీ3. అల్యూమినియం పాస్ఫైడ్ ద్రవీభవన స్థానం 2,530 °C (4,590 °F;2,800 K). నీటితో చర్యాశీలం .

సౌష్టవ లక్షణాలు

అల్యూమినియం పాస్ఫైడ్ జింకుబ్లెండ్ స్పటిక సౌష్టవాన్ని కలిగి ఉంది.అల్యూమినియం పాస్ఫైడ్ యొక్క స్పటికఅణుఅల్లిక స్థిరాంకం (lattice constant) 300 K. వద్ద 5.4510 Å.అల్యూమినియం పాస్ఫైడ్ స్పటికాలు థెర్మోడైనమికల్ గా 1,000 °C (1,830 °F)వరకు స్థిరమైనవి.

రసాయన చర్యలు

అల్యూమినియం పాస్ఫైడ్ నీటితో మరియు ఆమ్లాలతో చర్య జరిపి పాస్ఫైన్/పాస్ఫిన్ (phosphine)ను విడుదల చేయును.

AlP + 3 H2O → Al(OH)3 + PH3
AlP + 3 H+ → Al3+ + PH3

సంశ్లేషణ

అల్యూమినియం మరియు ఫాస్పరస్మూలకాలను సంయోగ పరచి అల్యూమినియం పాస్ఫైడ్ ను ఉత్పతి చేసెదరు.

4Al + P4 → 4AlP

ఉత్పత్తి జరుపు సమయంలోఏర్పడిన క్రియాజన్యమైన (product) అల్యూమినియం పాస్ఫైడ్ ను తేమతో కలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.తేమతో అల్యూమినియం పాస్ఫైడ్ రసాయన చర్య వలన విషకారక పాస్ఫైన్ వాయువును విడుదల చేయును.

ఉపయోగాలు

అల్యూమినియం ఫాస్ఫైడ్ ను కీటకనాశనిగా,ధూమకారిగా,ఎలుకజాతి జంతువులసంహారక విషంగాను,మరియు సెమీ కండక్టరుగా పలురకాలుగా ఉపయోగిస్తారు.

కీటకనాశనిగా

అల్యూమినియం పాస్ఫైడ్ ను ఎలు జాతి జంతు సంహరణ మందుగా (rodenticide),క్రిమి,కీటక నాశనిగా,మరియు గోదాముల్లో దీర్ఘకాలం నిలువఉంచు ధాన్యం, గింజలను పురుగు బారినుండి కాపాడు ధూమకారిగా ఉపయోగిస్తారు.అడవిఎలుకలు ( moles)మరియు కొరికి తినెడి ఎలుకలవంటి (rodents)చిన్న విషమయ క్షీరాదాలను చంపుటకు అల్యూమినియం పాస్ఫైడ్ ను ఉపయోగిస్తారు. అల్యూమినియం పాస్ఫైడ్ ను ధూమకారిగా మరియు నోటి ద్వారా ఇచ్చుపురుగు/క్రిమినాశనిగా ఉపయోగిస్తారు. ఎలుక రకపు జంతువులను చంపు మందుగా వాటి ఆహారంలో అల్యూమినియం పాస్ఫైడ్ కలుపుతారు. ఎలుక జాతి జంతువుల కడుపులోని జీర్ణవ్యవస్థలోని ఆమ్లంతో అల్యూమినియం పాస్ఫైడ్ చర్య జరపడం వలన ఫాస్ఫైన్ విషవాయువు వేలువడం వలన ఎలుకజాతి జంతువులు మరణించును. అల్యూమినియం పాస్ఫైడ్ వంటి క్రిమి.కీటక నాశనులు జింకు ఫాస్ఫేట్ మరియు కాల్షియం ఫాస్ఫేట్ లు.

క్రిమి సంహరణిగా అల్యూమినియం పాస్ఫైడ్‌ ఫ్యుమిటాక్సిన్, ఫాస్టాక్సిన్, క్విక్ ఫాస్ వంటి వివిధ బ్రాండుపేర్లతో అమ్మబడుతున్నది. ఈ క్రింద సమీకరణలో పేర్కొన్నవిధంగా ఫాస్ఫైన్ వాయువు అల్యూమినియం పాస్ఫైడ్ జలవిశ్లేషణ వలన ఏర్పడును.

2 AlP + 6 H2O → Al2O3∙3 H2O + 2 PH3

సెమీ కండక్టరుగా

అల్యూమినియం పాస్ఫైడ్ ఒక సెమీ కండక్టరు.అల్యూమినియం పాస్ఫైడ్ ఒక సెమీ కండక్టరు.దీనిని ఇతర యుగ్మపదార్థాలతో (binary materials) మిశ్రమ దాతువుగా కాంతిని ప్రసరించు డైయోడ్ ఉపకరణాలు (అల్యూమినియం గాలియం ఇండియం ఫాస్ఫిడ్) తయారు చేయుటలో ఉపయోగిస్తారు.

విషప్రభావం

విషయుక్తమైన అల్యూమినియం పాస్ఫైడ్ ను ఆత్మహత్య చేసుకొనుటకు వాడెదరు. ఒక్కోసారి పదార్థాలను ఫ్యుమిగేసన్ చేయునప్పుడు, అనుకోకుండా ఉత్పత్తి అయిన ఫాస్ఫైన్ వాయువు వలన సౌదీఅరేబియా మరియు అమెరికాలో మరణాలు సంభవించాయి. రిసైకిల్ చేసిన అల్యూమినియం ఫాస్ఫిడ్ డబ్బాలను ఉపయోగించడం వలన స్పెయిన్ లోని Alcalá de Guadaira లో మూడు కుటుంబాలలోని వారు మరణించారు. వాళ్ళు ఈ డబ్బాలను స్నానపు గదిలోని ఒక సంచిలో ఉంచేవారు, వాటితో నీరు కలియడం వలన ఫాస్ఫైన్ వాయువు వెలువడి కొన్ని గంటల్లోనే వారు మరణించారు.

అల్యూమినియం ఫాస్ఫిడ్ విష ప్రభావం వలన కలుగు నష్టం భారత ఉపఖండంలో పెద్ద సమస్యగా పరిణమిస్తున్నది.

ఇవికూడా చూడండి

మూలాలు/ఆధారాలు

  1. Berger, L. I. (1996). Semiconductor Materials. CRC Press. p. 125. ISBN 0-8493-8912-7.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.