అల్యూమినియం డైబోరైడ్

అల్యూమినియం డైబోరైడ్ లేదా అల్యూమినియం బోరైడ్ ఒక రసాయన సంయోగపదార్థం. ఇది ఒక అకర్బన సమ్మేళనపదార్థం. అల్యూమినియం డైబోరైడ్ రసాయన సంకేతపదం(AlB2)[1]. ఈ సంయోగ పదార్థం అల్యూమినియం లోహమూలకం మరియు ఉపధాతువు బోరాన్ మూలకముల సంయోగము వలన ఏర్పడినది. అల్యూమినియం లోహం మరియు బోరాన్ ల సమ్మేళనం వలన ఏర్పడిన రెండు సంయోగపదార్థాలలో అల్యూమినియం డైబోరైడ్ ఒకటికాగా, మరొకటి అల్యూమినియం డోడెకాఅల్యూమినియం బోరైడ్(AlB12). ఈ రెండు అల్యూమినియం సంయోగపదార్థాలను సాధారణంగా అల్యూమినియం బోరైడ్ అని వ్యవహరిస్తారు.

అల్యూమినియం డైబోరైడ్
పేర్లు
IUPAC నామము
aluminium diboride
ఇతర పేర్లు
aluminium boride
aluminum diboride
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [12041-50-8]
యూరోపియన్ కమిషన్ సంఖ్య 234-923-7
SMILES B1=B[Al]1
ధర్మములు
రసాయన ఫార్ములా
AlB2
మోలార్ ద్రవ్యరాశి 48.604 g/mol[1]
స్వరూపం Copper-red solid
సాంద్రత 3.16 g/cm³[2]
ద్రవీభవన స్థానం 1,655 °C (3,011 °F; 1,928 K)
నీటిలో ద్రావణీయత
insoluble
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Hexagonal, hP3
Space group
P6/mmm, No. 191
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ ΔfHo298
-151 kJ/mol
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ So298
34.7 J/mol K
విశిష్టోష్ణ సామర్థ్యం, C 43.6 J/mol K
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
Y verify (what is YN ?)
Infobox references

భౌతిక ధర్మాలు

అల్యూమినియం డైబోరైడ్ రాగి (లోహం)వంటి ఎరుపు రంగులో ఉండు ఘనపదార్థం. అల్యూమినియం డైబోరైడ్ అణుభారం 48.604 గ్రాములు/మోల్[1]. 25 °C ఉష్ణోగ్రత వద్ద అల్యూమినియం డైబోరైడ్ సాంద్రత 3.16 గ్రాములు/సెం.మీ3[2].ఈ సంయోగపదార్థం ద్రవీభవన స్థానం 1,655 °C (3,011 °F;1,928 K). అల్యూమినియం డైబోరైడ్ నీటిలో కరుగదు.

నిర్మాణం

నిర్మాణ పరంగా అల్యూమినియం డైబోరైడ్‌లో బోరాన్ పరమాణువులు గ్రాఫైట్ వంటి పలకల వలె ఉండి, వాటి మధ్యలో అల్యూమినియం పరమాణువు లు ఉండును. ఈ అణు నిర్మాణం ఒకవిధంగా మెగ్నిషియం డైబోరైడ్ నిర్మాణపోలిక కలిగి ఉన్నది. అల్యూమినియం డైబోరైడ్ ఒంటరి స్పటికాలు లోహవాహకతత్వం ప్రదర్శించును[3] .స్పటికసౌష్టవం షట్భుజాకారం(Hexagonal).

ఆరోగ్యపరమైన ఇబ్బందులు

అల్యూమినియం డైబోరైడ్ ను ప్రమాదకర మైన రసాయనంగానే పరిగణిస్తారు. ఇది ఆమ్లాలు మరియు హైడ్రోజన్ తో చర్య వలన విషవాయువులను ఉత్పత్తి చేయును. ఉదాహరణకు హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య వలన బోరెన్(Borane) మరియు అల్యూమినియం క్లోరైడ్ ను విడుదల చేయును.

ఉపయోగం

అల్యూమినియం డైబోరైడ్ ఎక్కువ నిరోధకగుణం మరియు కఠినత్వం కలిగిఉండటం వలన దీని చూర్ణాన్ని పలు లోహ, అలోహ వస్తువులను గ్రైండింగు చేయుటకు మరియు పాలిష్ చేయుటకు ఉపయోగిస్తారు.[4]

ఇవికూడా చూడండి

మూలాలు/ఆధారాలు

  1. "Aluminum diboride". sigmaaldrich.com. http://www.sigmaaldrich.com/catalog/product/aldrich/399612?lang=en&region=IN. Retrieved 2015-10-12.
  2. "ALUMINUM BORIDE". chemicalbook.com. http://www.chemicalbook.com/ChemicalProductProperty_EN_CB9388141.htm. Retrieved 2015-10-12.
  3. "On the electronic and structural properties of aluminum diboride Al0.9B2" Burkhardt, Ulrich; Gurin, Vladimir; Haarmann, Frank; Borrmann, Horst; Schnelle, Walter; Yaresko, Alexander; Grin, Yuri Journal of Solid State Chemistry 177 (2004) 389-394
  4. "Aluminum boride". britannica.com. http://www.britannica.com/science/aluminum-boride. Retrieved 2015-10-12.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.