అల్యూమినియం అయోడైడ్

అల్యూమినియం అయోడైడ్ ఒకరసాయన సంయోగపదార్థం. ఇది ఒక అకర్బన రసాయన సమ్మేళనపదార్థం. ఈ రసాయన సమ్మేళనపదార్థం అల్యూమినియం మరియు అయోడిన్ మూలక పరమాణువుల సంయోగం వలన ఏర్పడినది.ఈ రసాయన పదార్థం రసాయన సంకేతపదం AlI3.అల్యూమినియంతో అయోడిన్ రసాయనికచర్య వలన లేదా హైడ్రోజన్ అయోడిన్ తో అల్యూమినియం లోహం చర్యవలన అల్యూమినియం అయోడైడ్ సంయోగపదార్థం ఏర్పడును. లోహ అల్యూమినియం లేదా అల్యూమినియం హైడ్రాక్సైడ్ తో హైడ్రోజన్ అయోడైడ్ లేదా హైడ్రో అయోడిక్ఆమ్లం చర్య వలన ఆరు జలాణువులను (hexahydrate) కలిగిన అల్యూమినియం అయోడైడ్ ఏర్పడును. అరైల్ ఈథరులను అల్యూమినియం అయోడైడ్ విచ్చితి (cleaves) చేస్తుంది[1].

అల్యూమినియం అయోడైడ్
పేర్లు
Preferred IUPAC name
Aluminium iodide
ఇతర పేర్లు
Aluminium(III) iodide

Aluminum iodide
Aluminium triiodide

Aluminum triiodide
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [7784-23-8]
పబ్ కెమ్ 82222
యూరోపియన్ కమిషన్ సంఖ్య 232-054-8
SMILES I[Al](I)I
ధర్మములు
రసాయన ఫార్ములా
AlI3
మోలార్ ద్రవ్యరాశి 407.69495 g/mol (anhydrous)
515.786 g/mol (hexahydrate)
స్వరూపం colorless powder
but impure samples
are often brown
సాంద్రత 3.98 g/cm3 (anhydrous)
2.63 g/cm3 (hexahydrate)
ద్రవీభవన స్థానం 189.4 °C (372.9 °F; 462.5 K) (anhydrous)
185 °C, decomposes (hexahydrate)
బాష్పీభవన స్థానం 360 °C (680 °F; 633 K) , sublimes
నీటిలో ద్రావణీయత
reacts violently (anhydrous)
soluble (hexahydrate)
ద్రావణీయత in alcohol, ether soluble (hexahydrate)
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
Y verify (what is YN ?)
Infobox references

భౌతిక ధర్మాలు

అల్యూమినియం అయోడైడ్ సహజంగా రంగులేని పొడి ఘనపదార్థం.మలినాలున్న అల్యూమినియం అయోడైడ్ రసాయన పదార్థం బ్రౌన్‌రంగులో ఉండును. నిర్జల అల్యూమినియం అయోడైడ్ అణుభారం 407.69495 గ్రాములు/మోల్.మరియు ఆరు జలాణువులున్న అల్యూమినియం అయోడైడ్ అణుభారం 515.786 గ్రాములు/మోల్.25 °C వద్ద నిర్జల అల్యూమినియం అయోడైడ్ సాంద్రత 3.98 గ్రాములు/సెం.మీ3.అలాగే ఆరు జలాణువులున్న అల్యూమినియం అయోడైడ్ సాంద్రత 2.63 గ్రాములు/సెం.మీ3.నిర్జల అల్యూమినియం అయోడైడ్ ద్రవీభవన స్థానం189.4 °C (372.9 °F; 462.5 K), మరియు ఆరు జలాణువులున్న అల్యూమినియం అయోడైడ్‌ను వేడిచేసిన 185 °C వద్ద విఘటన/వియోగం చెందును.నిర్జల అల్యూమినియం అయోడైడ్ 360 °C (680 °F; 633K) వద్ద ఉత్పతనం (sublimes) చెందును.నిర్జల అల్యూమినియం అయోడైడ్ నీటితో వైలెంట్ గా చర్య జరుపును.సజల అల్యూమినియం అయోడైడ్ నీటిలో కరుగును. సజల అల్యూమినియం అయోడైడ్ ఇంకను ఆల్కహాల్, మరియు ఈథరు లలో కరుగుతుంది.

సౌష్టవం

అల్యూమినియం అయోడైడ్ Al2I6 రూపం కలిగిన ఒక ఘన డైమెరిక్/ద్వ్యణుక పదార్థం. డైమెరిక్ పదార్థం అనగా ఒకేరకమైన పోలిక ఉన్న రెండుఅణువులను కలిగిఉండుట. ఇది AlBr3సౌష్టవాన్ని పోలిక కలిగిఉన్నది[2].మొనోమేరిక్ (ఒకరకమైన అణువు నుకలిగిన) మరియు డైమెరిక్ రూపపదార్థాన్ని వాయుస్థితిలో గుర్తించారు[3] .మొనోమార్ అణువు త్రికోణ సమతలంగా ఉంది, బంధ దూరం/పొడవు 2.448 (6) Å కలిగి ఉంది.430 K వద్ద డైమెరిక్/ ద్వ్యణుక పదార్థం Al2Cl6 మరియు Al2Br6 ల పోలికతో ఉండి, అల్యూమినియం-అయోడిన్‌ల బంధ పొడవులను 2.456 (6) Å (టెర్మినల్), 2.670 (8) Å (అనుసందానిత) లను కలిగి ఉంది.

అల్యూమినియం అయోడైద్ అనుపేరు విస్తృతంగా త్రిఅయోడైడ్ (triiodide) లేదా ద్వ్యణుకం (dimer) ను వివరించటానికి వాడుచున్నారు.ట్రైఅయోడైడ్ కన్న గది ఉష్ణోగ్రత వద్ద సాపేక్షముగా అస్థిరమైనది[4] అయిన్నప్పటికి మొనో అయోడైడ్ కూడాఅల్యూమినియం-అయోడిన్ సంబంధంలో తనపాత్రను పోషిస్తున్నది.

3 AlI → AlI3 + 2 Al

ఇవికూడా చూడండి

మూలాలు/ఆధారాలు

  1. M. Gugelchuk (2004). Aluminum Iodide, in Encyclopedia of Reagents for Organic Synthesis (Ed: L. Paquette). New York: J. Wiley & Sons. doi:10.1002/047084289X.ra083.
  2. Troyanov, Sergey I.; Krahl, Thoralf; Kemnitz, Erhard (2004). "Crystal structures of GaX3(X= Cl, Br, I) and AlI3". Zeitschrift für Kristallographie. 219 (2–2004): 88–92. doi:10.1524/zkri.219.2.88.26320. ISSN 0044-2968.
  3. Hargittai, Magdolna; Réffy, Balázs; Kolonits, Mária (2006). "An Intricate Molecule: Aluminum Triiodide. Molecular Structure of AlI3and Al2I6from Electron Diffraction and Computation". The Journal of Physical Chemistry A. 110 (10): 3770–3777. doi:10.1021/jp056498e. ISSN 1089-5639.
  4. Dohmeier, C.; Loos, D.; Schnöckel, H. (1996). "Aluminum(I) and Gallium(I) Compounds: Syntheses, Structures, and Reactions". Angewandte Chemie International Edition. 35: 129–149. doi:10.1002/anie.199601291.CS1 maint: Multiple names: authors list (link)
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.