అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. అదే సమయంలో ఈ నియోజకవర్గం పలు మార్పులకు గురైనది. పునర్విభజనకు పూర్వం ఈ లోక్‌సభ నియోజకవర్గంలో తాళ్ళరేవు, ముమ్మిడివరం, అల్లవరం, అమలాపురం, నగరం, రాజోలు, కొత్తపేత అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన గన్నవరంతో పాటు రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న రామచంద్రాపురం సెగ్మెంట్లు ఇందులో చేర్చబడింది.
| అమలాపురం | |
|---|---|
| పార్లమెంట్ నియోజకవర్గం | |
| (భారత పార్లమెంటు కు చెందినది) | |
| జిల్లా | తూర్పు గోదావరి |
| ప్రాంతం | ఆంధ్ర ప్రదేశ్ |
| ముఖ్యమైన పట్టణాలు | అమలాపురం |
| నియోజకవర్గ విషయాలు | |
| ఏర్పడిన సంవత్సరం | 1962 |
| ప్రస్తుత పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు |
| సభ్యులు | 1 |
| దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య | 7 |
| ప్రస్తుత సభ్యులు | జి.వి. హర్షకుమార్ |
| మొదటి సభ్యులు | బయ్యా సూర్యనారాయణ మూర్తి |
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
- రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం
- ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గం
- అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
- రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
- గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
- కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం
- మండపేట అసెంబ్లీ నియోజకవర్గం
నియోజకవర్గపు గణాంకాలు
నియోజకవర్గపు ప్రత్యేకతలు
- దేశంలోనే ఎస్సీలు అత్యధిక సంఖ్యలో ఉన్న నియోజకవర్గాలలో ఇది ఒకటి.
- ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన దివంగత జి.ఎం.సి.బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశాడు.
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
| లోక్‌సభ | పదవీకాలం | సభ్యుని పేరు | ఎన్నికైన పార్టీ |
|---|---|---|---|
| మూడవ | 1962-67 | బయ్యా సూర్యనారాయణ మూర్తి | భారత జాతీయ కాంగ్రెసు |
| నాలుగవ | 1967-71 | బయ్యా సూర్యనారాయణ మూర్తి | భారత జాతీయ కాంగ్రెసు |
| ఐదవ | 1971-77 | బయ్యా సూర్యనారాయణ మూర్తి | భారత జాతీయ కాంగ్రెసు |
| ఆరవ | 1977-80 | కుసుమ కృష్ణమూర్తి | భారత జాతీయ కాంగ్రెసు |
| ఏడవ | 1980-84 | పి.వి.జి.రాజు | భారత జాతీయ కాంగ్రెసు |
| ఎనిమదవ | 1984-89 | ఎ.జె.వెంకట బుచ్చిమహేశ్వరరావు | తెలుగుదేశం పార్టీ |
| తొమ్మిదవ | 1989-91 | కుసుమ కృష్ణమూర్తి | భారత జాతీయ కాంగ్రెసు |
| పదవ | 1991-96 | గంటి మోహనచంద్ర బాలయోగి | తెలుగుదేశం పార్టీ |
| పదకొండవ | 1996-98 | కె.ఎస్.ఆర్.మూర్తి | భారత జాతీయ కాంగ్రెసు |
| పన్నెండవ | 1998-99 | గంటి మోహనచంద్ర బాలయోగి | తెలుగుదేశం పార్టీ |
| పదమూడవ | 1999-04 | గంటి మోహనచంద్ర బాలయోగి | తెలుగుదేశం పార్టీ |
| పద్నాలుగవ | 2004-2009 | జి.వి.హర్షకుమార్ | భారత జాతీయ కాంగ్రెసు |
| 15వ | 2009-2014 | జి.వి.హర్షకుమార్ | భారత జాతీయ కాంగ్రెసు |
| 16వ | 2014-ప్రస్తుతం | పందుల రవీంద్రబాబు | తెలుగుదేశం పార్టీ |
2004 ఎన్నికలు
2004 ఎన్నికల ఫలితాలను చూపే పై చిత్రము
దున్న జనార్థనరావు (43.86%)
భూపతి మహేశ్వరరావు (3.79%)
యాగంటి రమేష్ (1.36%)
డి మురళీకృష్ణ (1.25%)
| సాధారణ ఎన్నికలు,2004:అమలాపురం | |||||
|---|---|---|---|---|---|
| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
| కాంగ్రెస్ | జి.వి.హర్షకుమార్ | 350,346 | 49.75 | +12.12 | |
| తె.దే.పా | దున్న జనార్థనరావు | 308,861 | 43.86 | -11.70 | |
| ఇండిపెండెంట్ | భూపతి మునీశ్వరరావు | 26,699 | 3.79 | ||
| ఇండిపెండెంట్ | రమేశ్ యాలంగి | 9,550 | 1.36 | ||
| బసపా | డి.మురళీకృష్ణ | 8,768 | 1.25 | ||
| మెజారిటీ | 41,485 | 5.89 | +23.82 | ||
| మొత్తం పోలైన ఓట్లు | 704,224 | 74.59 | -0.85 | ||
| కాంగ్రెస్ గెలుపు | మార్పు | +12.12 | |||
2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున జి.వి.హర్షకుమార్ పోటీ చేశారు.[2] ఈయన సమీప ప్రత్యర్థి అయిన ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి పోతుల ప్రమీలా దేవిపై విజయం సాధించారు.
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2009 24 అమలాపురం (SC) జి.వి.హర్షకుమార్ పు కాంగ్రెస్ 368501 పోతుల ప్రమీలాదేవి స్త్రీ ప్ర.రా.పా 328496
2014 ఎన్నికల ఫలితాలు
| సార్వత్రిక ఎన్నికలు, 2014: అమలాపురం | |||||
|---|---|---|---|---|---|
| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
| తె.దే.పా | పందుల రవీంద్రబాబు | 594,547 | 53.04 | +27.20 | |
| వై.కా.పా | పినిపె విశ్వరూప్ | 473,971 | 42.28 | N/A | |
| కాంగ్రెస్ | ఐతాబత్తుల జోగేశ్వర వెంకట బుచ్చి మహేశ్వరరావు | 12,182 | 1.09 | -34.90 | |
| జై సమైక్యాంధ్ర పార్టీ | జి.వి.హర్షకుమార్ | 9,931 | 0.89 | N/A | |
| బసపా | గెడ్డం సంతాదరావు | 7,219 | 0.64 | N/A | |
| NOTA | None of the Above | 6,141 | 0.55 | N/A | |
| మెజారిటీ | 120,576 | 10.76 | +6.86 | ||
| మొత్తం పోలైన ఓట్లు | 1,120,927 | 82.55 | +2.27 | ||
| కాంగ్రెస్ పై తె.దే.పా విజయం సాధించింది | ఓట్ల తేడా | +9.75 | |||
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
